శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వ్యవసాయం తర్వాత పరిశమ్రలదే ముఖ్యపాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, జూన్ 6: రాష్ట్ర అభివృద్ధిలో వ్యవసాయం తర్వాత పరిశ్రమలే ముఖ్యపాత్ర వహిస్తాయని శాసనమండలి సభ్యులు వాకాటి నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం నవనిర్మాణ దీక్షలో భాగంగా స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో పరిశ్రమలు, సేవలు తదితర అంశాలపై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల పరిశ్రమలన్నీ తెలంగాణ ప్రాంతాలకు పోయాయన్నారు. ముఖ్యమంత్రి పరిశ్రమల అభివృద్ధికై విదేశాలకు వెళ్లి రాష్ట్రంలో ఉన్న సదుపాయాలను పెట్టుబడిదారులకు తెలియజేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం నెల్లూరు జిల్లాలో 45వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశమ్రలు స్థాపించేందుకు అనువుగా విధి విధానాలను సరళీకృతం చేసినట్లు తెలిపారు. పరిశ్రమలు స్థాపించేవారికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి విశాఖపట్నంలో వివిధ కంపెనీలకు చెందిన వారితో సమావేశమయ్యారని, ఆ సమావేశంలో దాదాపు 4 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చినట్లు ఆయన చెప్పారు. పారిశ్రామికవేత్తలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయులు కూడా చేసినట్లు తెలిపారు. సరళీకృత పారిశ్రామిక విధానాల వల్ల 21రోజుల్లోనే పరిశ్రమలు నెలకొల్పడానికి అన్ని అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు, థర్మల్ స్టేషన్స్, నేషనల్ హైవే ఉండటం వల్ల పెట్టుబడుదారులు నెల్లూరు జిల్లాకు ఎక్కువగా రావడానికి అవకాశం ఉందన్నారు. దగదర్తిలో విమానాశ్రయం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని, దీనివల్ల పారిశ్రామికవేత్తలు నెల్లూరుకు రావడానికి సులభతరం అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేయడం వల్ల అవినీతి తగ్గి పరిపాలన పారదర్శకంగా జరిగేందుకు దోహదపడుతుందన్నారు. జిల్లాలో పరిశ్రమలు పెడుతున్న పారిశ్రామికవేత్తలు స్థానిక యువతీ యువకులకు ఉపాధి కల్పించడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ విశాఖపట్నం తరువాత నెల్లూరు జిల్లాలోనే పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారన్నారు. ఇప్పటి వరకు ఇఫ్‌కో సెజ్ నిర్లప్తంగా ఉందని, కాని ఇప్పుడు అక్కడ పరిశ్రమల స్థాపన చురుగ్గా జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర ఆదాయం 1.07లక్షలు కాగా ఒక్క నెల్లూరు జిల్లాను చూస్తే తలసరి ఆదాయం 1.15 లక్షలు అన్నారు. అలాగే మండల ఆదాయం 2.15లక్షలు అని దానికి కారణం తడ మండలం పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో ఉందన్నారు. 10 రోజుల క్రితం ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో కృష్ణపట్నం, ఎస్‌ఎస్ టెక్స్‌టైల్స్, టెక్ మహేంద్ర గ్రూపుల వారు జాబ్‌మేళా నిర్వహించగా అందులో 800 మంది నెల్లూరు జిల్లా వారు ఉద్యోగాలకు ఎంపిక కావడం సంతోషకరమన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సుధాకర్‌రావు మాట్లాడుతూ ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో ప్రభుత్వం 5 సెజ్‌లు ఏర్పాటు చేశాయన్నారు. నెల్లూరు జిల్లా పరిశ్రమల స్థాపనకు ఎంతో అనుకూలంగా ఉందన్నారు.కృష్ణపట్నం పోర్టు పిఆర్‌ఓ వేణుగోపాల్ మాట్లాడతూ కృష్ణపట్నం పోర్టు 2008 సంవత్సరంలో పని ప్రారంభించిందన్నారు. 2016నాటికి భారతదేశంలోనే కృష్ణపట్నం పోర్టు దిగుమతి, ఎగుమతుల్లో రెండవ స్థానంలో ఉందన్నారు. కృష్టపట్నం పోర్టు 25వేల మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. నెల్లూరు జిల్లా మరింత పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి మరిన్ని విద్యుత్ సబ్‌స్టేషన్లు, పరిశ్రమలకు కావలసిన నీరు అందుబాటులో ఉంచాలన్నారు. రవాణాశాఖ ఉపకమిషనర్ ఎన్ శివరామ్‌ప్రసాద్ మాట్లాడుతూ రవాణా సౌకర్యాలు ఉంటేనే పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల వాహనాలు ప్రస్తుతం రోడ్ల మీద తిరుగుతున్నాయన్నారు. రవాణాశాఖ ఆన్‌లైన్ విధానం ద్వారా పౌరులకు సేవలు అందించడానికి అవకాశం కలిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖకు సంబంధించి 83 సేవలు ఆన్‌లైన్ విధానం ద్వారా అందించడానికి తగు ప్రణాళికలు అమలు చేయడానికి చర్యలు తీసుకుంటుందని, అది పూర్తి అయితే పౌరులు ఇంటి వద్ద నుంచే సేవలు పొందవచ్చన్నారు. ఏపిఐఐసి జోనల్ మేనేజర్ కె నాగేశ్వరరావు మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు ఉపయోగించుకొని పరిశ్రమలు స్థాపించాలన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇఇ ప్రదీప్‌కుమార్ మాట్లాడతూ జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, పెద్ద పరిశ్రమలు అన్ని కలిపి దాదాపు 330 పరిశ్రమలు ఉన్నాయన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాయి, జల కాలుష్యాలను నివారించడానికి అనేక సాంకేతిక పరమైన విషయాలను పారిశ్రామిక వేత్తలకు అందించనున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టూ పరిశ్రమలన్ని స్థాపించడం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన తరువాత కొత్త రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. ముఖ్యమంత్రి పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి వివిధ దేశాలు సందర్శించినట్లు చెప్పారు. అనంతరం డిఎఫ్‌ఓ చైతన్యరాజు, విద్యుత్ శాఖ ఎస్‌ఇ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉపకమిషనర్ తదితర అధికారులు ఆయా శాఖల గురించి మాట్లాడారు. ఈ సమావేశంలో ఏజేసి-2 సాల్మాన్‌రాజ్‌కుమార్‌తోపాటు కృష్ణపట్నం పోర్టు ఉద్యోగులు, ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

మసీదుల వద్ద వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి
* జిల్లా కలెక్టర్ ఎం జానకి ఆదేశం
వేదాయపాళెం, జూన్ 6 : రంజాన్ మాసం ప్రారంభమైనందున నగరంలో ఉన్న అన్ని మసీదులతోపాటు ముస్లింలు నివాసం ఉండే ప్రాంతాల్లో వౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం జానకి అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముస్లిం ఆవాస ప్రాంతాల్లో నిరంతరంగా విద్యుత్ సరఫరా, తాగునీరు, పారిశుద్ధ్యం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మసీదు ప్రాంతాల్లో అధికారులు స్వయంగా తనిఖీ చేసి సౌకర్యాలలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలన్నారు. కరెంటు, తాగునీరు, పారిశుద్ధ్యంపై ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ ద్వారా తెలపాలన్నారు. ముస్లిం సోదరులు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 9949352384 నెంబర్‌కు ఫోన్ చేసి సమస్య పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రంజాన్ మాసంలో ట్రాఫిక్ నియంత్రణ పగడ్బందీగా చేయాలని పోలీసు అధికారులను కోరారు.