ప్రకాశం

అలుపెరగని పోరాట యోధుడు పాలస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, జూన్ 7: అలుపెరగని ఉద్యమ పోరాట యోధుడు సుదర్శి పాలస్ అని పలువురు నేతలు కొనియాడారు. కార్మిక, కర్షక, బలహీన వర్గాల ప్రజల కోసం అలుపెరగని ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి సోమవారం మృతి చెందిన పాలస్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం మంగళవారం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఉంచారు. ఈసందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ వెంకయ్య, జిల్లా కార్యదర్శి కె అరుణ, స్థానిక ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యేలు దివి శివరాం, కె ఆదెన్న, మాజీ మున్సిపల్ చైర్మన్ దివి లింగయ్యనాయుడు, సిపిఐ కార్యదర్శి కెవివి ప్రసాద్, ఎంఎల్ నారాయణ, సిపిఎం నాయకులు ఎం కోటయ్య, కె ఆంజనేయులు, ఓ రామకోటయ్య, మనోజ తదితరులు పాలస్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ తుది శ్వాస వరకు కమ్యూనిజం బలోపేతానికి, పేద వర్గాల హక్కుల సాధన కోసం మడిమతిప్పని ఎన్నో ఉద్యమాలు నిర్వహించిన కమ్యూనిస్ట్ పాలస్ అని పేర్కొన్నారు. ఆయన ఉద్యమస్ఫూర్తి పార్టీకి ఎంతో అవసరమని, ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు. ఆర్ వెంకయ్య మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి ఎన్నో ఉద్యోగాలను సైతం త్యజించి బలహీన వర్గాల ప్రజలకు సేవలు అందించేందుకు ఉద్యమాలు నిర్వహించిన మహనీయుడు పాలస్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఉప్పుటూరి ప్రకాష్‌రావు, ఆర్ వెంకటరావు, హనుమారెడ్డి, వౌలాలి, సర్దార్, పివిఆర్ చౌదరి, లక్ష్మీశేషు, విజయ, రమణమ్మ, ఎం వెంకటనారాయణ, శ్రీనివాస్, వై రవి, రామారావు, జి రవి, ఎన్ గురవయ్య, జి బాలకోటయ్య, గులాంహుస్సేన్, స్థానిక సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె వీరారెడ్డి, నాయకులు వలేటి రాఘవులు, బాలకోటయ్య, సురేష్, యు మాధవరావు, జి మాలకొండయ్య, బి రమణమ్మ, ఆదినారాయణ, సులోచనమ్మ, సిపిఎం నాయకులు గౌస్, మున్వర్‌సుల్తానా, సిపిఐ (ఎంఎల్) డెమొక్రసీ నాయకులు నాంచార్లు, ఆర్ మోహన్‌రావు, బిజెపి నాయకులు రోశయ్య, రాఘవరావు, గిరిజన సంఘం నాయకులు సత్యం, సుధాకర్, వీరాస్వామి తదితరులు పాలస్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.