ప్రకాశం

ధరలు గిట్టబాటు కాక వేలాన్ని అడ్డుకున్న పొగాకు రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదిలి, జూన్ 7 : పొదిలి పొగాకు బోర్డులోని 1, 2 వేలం కేంద్రాల్లో తమకు గిట్టుబాటు ధరలు రావడం లేదంటూ మంగళవారం పొగాకు రైతులు అర్ధాంతరంగా వేలాన్ని అడ్డుకుని అమ్మకాలను ఆపివేశారు. స్థానిక 1వ వేలంకేంద్రానికి గంగవరం క్లస్టర్‌కు చెందినరైతులు 600 పొగాకుబేళ్ళను విక్రయానికి తీసుకు వచ్చారు. వాటిలో 103 బేళ్ళకు విక్రయాలు జరిగాయి. అదే విధంగా 2వ వేలం కేంద్రానికి కంభం క్లస్టర్‌కు చెందినరైతులు 300 బేళ్ళను వేలానికితీసుకు వచ్చారు. వాటిలో 30 బేళ్ళకు మాత్రమే విక్రయాలు జరుగుతుండగా తమకు సరైన ధరలు రావడం లేదంటూ రెండువేలం కేంద్రాల్లోని రైతులు ఆగ్రహించి వేలాన్ని నిలిపి వేయించారు. అనంతరం బోర్డు వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొగాకు రైతుల నాయకులుగుంటూరి సుబ్బయ్య మాట్లాడుతూ ప్రారంభంలో కిలో 140 రూపాయలకు పైగా ధరలు పలికాయని, అయితే వ్యాపారులు సిండికేట్‌గా మారి ప్రస్తుతం నాణ్యమైన పొగాకునుకూడా కేజి 40 రూపాయలకు మించకుండా కొనుగోలుచేస్తున్నారంటూ ఆరోపించారు. రైతులువ్యయ ప్రయాసలకొర్చి విక్రయానికి తీసుకు వచ్చిన పొగాకు బేళ్ళను కుంటుసాకులతో వ్యాపారులు కొనుగోలు చేసేందుకు తిరస్కరిస్తున్నారని ఆయన విమర్శించారు. దీంతో ఆయా పొగాకుబేళ్ళను మళ్ళీ వెనక్కి తీసుకు వెళ్ళలేక రైతులు అతి తక్కువ ధరలకు వ్యాపారులకే అంటగట్టి నష్టాల బారిన పడుతున్నారని ఆయన ఆందోళనవ్యక్తం చేశారు.గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుత ప్రభుత్వంలో పొగాకు రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని సుబ్బయ్య తీవ్రంగా విమర్శించారు. పొగాకు బోర్డు చైర్మన్ , ఈడి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీంతో కిందిస్థాయి సిబ్బంది వ్యాపారుల నుండి పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలం అవుతున్నారన్నారు. గిట్టుబాటు ధరలు కల్పించడంలోవిఫలమైన ప్రభుత్వం బ్యారన్‌కు 8 లక్షలునష్టపరిహారం చెల్లించి పొగాకు పంటను పూర్తిగా ఎత్తి వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం బోర్డు అధికారులు వ్యాపారులు, రైతులతో చర్చలు జరిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని అధికారులు భరోసా ఇవ్వడంతో రైతులు శాంతించారు.