ప్రకాశం

హైటెక్ మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముండ్లమూరు, జూన్ 7 : మండలంలోని సుంకరవారిపాలెం గ్రామానికి చెందిన చిట్టిబోయిన గురుప్రసాద్ బ్యాంకు ఖాతా నుండి మంగళవారం ఏడువేల రూపాయల నగదును గుర్తుతెలియని వ్యక్తులు డ్రాచేసుకున్నట్లు బాధితుడు ముండ్లమూరు పోలీసులకు తెలిపారు. బాధితుని కథనం మేరకు గురు ప్రసాద్‌కు మారెళ్ళ సిండికేట్ బ్యాంకులో ఖాతా ఉంది. మంగళవారం గురుప్రసాద్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌చేసి బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం, మీ ఖాతా స్తంభించబడిందని, మీ ఖాతా నెంబరు, ఎటియం కార్డు నెంబరు, పిన్ నెంబర్ తెలియజేయాలని కోరగా బాధితుడు వివరాలను వెల్లడించడంతో గురుప్రసాద్ ఖాతా నుండి ఏడువేల రూపాయలు అపహరణకు గురైనట్లు బాధితుడు తెలుసుకుని ముండ్లమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.