ప్రకాశం

జగన్ దర్శకత్వంలో నటిస్తున్న ముద్రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, జూన్ 7: రాజకీయ లబ్ధికోసం జగన్ దర్శకత్వంలో ముద్రగడ పద్మనాభం నటిస్తూ కాపులను మోసం చేస్తున్నారని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ యలమంచిల రామాంజం ఆరోపించారు. మంగళవారం ఈ విలేఖరికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాను ముద్రగడకు ఐదు ప్రశ్నలతో ఉత్తరం రాశానని, ఇంత వరకు వాటికి సమాధానం చెప్పలేదని అన్నారు. ప్రధానంగా ముద్రగడ ఇంటివద్ద వైఎస్‌ఆర్ విగ్రహం ఎందుకు పెట్టావు అని ప్రశ్నించగా తాను, డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆత్మబంధువులమని, అందుకే ఏర్పాటు చేశామని చెప్పారని, అంత ఆత్మబంధువుగా చెప్పుకున్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరేళ్లపాటు అధికారంలో ఉంటే కాపులను బిసిల్లో చేర్చాలని ఎందుకు కోరలేకపోయావని తాను లేఖలో రాశానని, అయితే ఇంతవరకు సమాధానం లేదని ఆయన తెలిపారు. టిడిపి హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కాపులు తనవద్దకు రావద్దని ఇంటివద్ద బోర్డు పెట్టుకున్న మీరు కాపులకు ఏమి న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపులను బిసిల్లో చేర్చేందుకు కమిషన్ వేసి 1100 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే డెడ్‌లైన్ పెడుతూ ఎందుకు బెదిరిస్తున్నావని తాను లేఖలో రాశానని, దానికి కూడా సమాధానం లేదన్నారు. ఎంపిగా ఉన్న కాలంలో ఎప్పుడైనా కాపుల సమస్యలు తీర్చావా..? అలా తీర్చినవి ఏవైనా ఉంటే బయటపెట్టాలని తాను కోరినప్పటికీ ఇంతవరకు బయటపెట్టలేదని అన్నారు. కాపునేతగా చెప్పుకుంటున్న ముద్రగడ పద్మనాభాన్ని ఏ కాపునాయకులు ఆయనను నేతగా ఎన్నుకున్నారో..? అందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే చూపాలని డిమాండ్ చేశారు. కాపులను బిసిల్లో చేర్చాలని ఒత్తిడి తెస్తున్న ముద్రగడ పద్మనాభం ఏనాడైనా మంజునాథ్ కమిషన్‌ను కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ కలిసి సలహాలు, సూచనలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. అధికారంలేని నేతలను కలిసి కృతజ్ఞతలు చెబుతున్న ముద్రగడ ఎందుకు వారిని కలువలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్వార్థప్రయోజనాల కోసం కాపు ఉద్యమం చేసి కాపులకు న్యాయం చేయాల్సిన ముద్రగడ అన్యాయం చేస్తున్నారని, ఈయన ఉద్యమాల వలన కాపులకు అన్యాయం జరిగితే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తెలుగుదేశం హయాంలో ప్రస్తుతం 30మంది కాపులు ఎమ్మెల్యేలుగా ఉన్నారని, ఐదుమంది మంత్రివర్గంలో ఉన్నారని, కాంగ్రెస్ హయాంలో ఎప్పుడైనా ఇంతమంది కాపులకు పదవులు ఇచ్చారా? అని రామాంజం ప్రశ్నించారు. ముద్రగడది ఒకే అజెండా అని, తన ఆత్మ కుమారుడైన జగన్‌కు మేలు చేకూర్చాలనే ధ్యేయంతో కాపులను అడ్డుపెట్టుకొని రాజకీయాలను కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు.