ప్రకాశం

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే వికాస్‌పర్వ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,జూన్ 9:ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే కేసులు పెట్టరా అని రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. గురువారం స్థానిక కాపుకల్యాణ మండపంలో భారతీయజనతాపార్టీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో వికాసపర్వ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ కాపులను బిసిల్లో చేర్చాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలో చేపట్టిన ఆందోళన కార్యక్రమం సందర్భంగా రైలును తగలబెట్టడటం జరిగిందని ఆ కేసుకు సంబంధించి కొంతమంది అల్లరిమూకలు నిందితులుగా ఉన్నారని సిఐడి అధికారులు నిగ్గుతెల్చిన తరువాత కొంతమందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. జరిగిందన్నారు.ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినప్పుడు ఎంతటివారిపైనైనా కేసులు పెట్టాల్సివస్తుందన్నారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం లేదనిస్పష్టం చేశారు. కాపుల సంక్షేమం రాష్ట్రప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని కాపుఫెడరేషన్‌కు ఇప్పటికే 11వందల కోట్లరూపాయలు కేటాయించిందని, కాపులను బిసిల్లో చేర్చేందుకు కమీషన్‌ను వేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ముద్రగడ దీక్ష ఎవరికోసం చేస్తున్నారో ఆయనకే అర్ధం కావటం లేదన్నారు.ప్రభుత్వం మాత్రం సామరాస్యంగా ముందుకు వెళ్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ఎన్నుకున్నట్లు చెప్పారు. రాష్ట్భ్రావృద్ధిపై ప్రధాని మోదీ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. 14వ ఆర్థిక సంఘం బిల్లు ప్రకారం 2017 మార్చి తరువాత ఏ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని బిల్లులో స్పష్టంగా పొందుపర్చారన్నారు. వికాస్‌పర్వ్ పేరుతో దేశవ్యాప్తంగా రెండువందల పట్టణాల్లో సభలు జరుగుతున్నాయని, రాష్ట్రంలోని ఏడు పట్టణాల్లో ఈకార్యక్రమం ప్రారంభమైందన్నారు. ఇప్పటికే నలుగురు కేంద్రమంత్రులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారని కేంద్రం రాష్ట్రానికి చేసిన సేవలు, ప్రగతిని పూర్తిస్థాయిలో ప్రజలకు వివరిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి మాట్లాడుతూ రామాయపట్నం పోర్టుకు సంబంధించి తెలుగుదేశంపార్టీ నేతలు రకరకాలుగా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రమే చేపడుతుందని మాట్లాడారన్నారు.
కేంద్రం రామాయపట్నం పోర్టుకు పునాదివేయాలంటే ఐదువేల ఎకరాలను భూసేకరణ చేసి కేంద్రానికి పంపిస్తే వెంటనే పునాది వేసేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టును ఇప్పటికే జాతీయప్రాజెక్టుగా గుర్తించామని, ఈప్రాజెక్టును కేంద్రమే పూర్తిచేస్తుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించటంలో కాంగ్రెస్‌ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. కేంద్రమంత్రి నితిన్‌గడ్కారి రాష్ట్రంలోని రహదారులకు 65వేల కోట్లరూపాయలను కేటాయించారని అందులో అమరావతి చుట్టుపక్కల రహదారులకు 20వేలకోట్లరూపాయలను కేటాయించారన్నారు.రోజుకు 30కిలోమీటర్ల రహదారుల నిర్మాణం జరగాల్సి ఉండగా 21కిలోమీటర్ల పనులు జరుగుతున్నాయన్నారు. దేశంలోని ఐదుకోట్లమంది పేదమహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేస్తున్నామని రాష్ట్రంలోని మూడులక్షలమందిమహిళలకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. అమరావతి నిర్మాణానికి నిధులు పూర్తిస్థాయిలో ఇస్తామని రెవిన్యూలోటును భర్తీచేస్తామని హామీ ఇచ్చారు. తీరప్రాంత జిల్లాల్లో సీపోర్టులతోపాటు హార్బర్లు ఏర్పాటుచేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్భ్రావృద్ధిలో కీలకపాత్రపోషిస్తున్నకేంద్రప్రభుత్వం విమర్శలు చేస్తున్న ప్రతిపక్షపార్టీలకు పార్టీనేతలు బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో రాష్ట్రప్రధానకార్యదర్శి ఎస్ సురేష్‌రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ప్రధానకార్యదర్శి రవీంద్రరాజు, రాష్టప్రార్టీనాయకులు బత్తిన నరసింహరావు, పి వెంకటసుబ్బారావు, మీనాకుమారి, సరోజినిదేవి, గోలి నాగేశ్వరరావు, ఈదాసుధాకర్‌రెడ్డి, నరాల రమణారెడ్డి, కందుకూరి సత్యనారాయణ, ఖలీఫ్‌తుల్లాబాషా పాల్గొన్నారు.