ప్రకాశం

మహీధర్‌రెడ్డి పయనమెటు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, జూలై 3: కందుకూరు నియోజకవర్గంలో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగాను ఉమ్మడి ఏపిలో తనదైన శైలిలో రాష్టవ్య్రాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన మహీధర్‌రెడ్డి ప్రస్తుత పయనమెటు అని నియోజకవర్గ ప్రజలతోపాటుగా రాష్టవ్య్రాప్తంగా చర్చ జరుగుతోంది. మానుగుంట ఆదినారాయణరెడ్డి వారసత్వంగా ఈ నియోజకవర్గ రాజకీయాలతో మహీధర్‌రెడ్డికి అవినాభావ సంబంధం ఉంది. గత రెండున్నర దశాబ్దాలుగా నియోజకవర్గంలో ప్రజలతో ఆయనకు సత్సంబంధాలు నెలకొన్నాయి. అటు రాష్ట్రంలోను, ఇటు నియోజకవర్గంలోను ఆయన హయాంలో అభివృద్ధి పనులు పరుగులు తీసాయి. నియోజకవర్గానికి దాదాపు రూ.1750కోట్లు మేర అభివృద్ధి పనులు చేపట్టి గొప్ప పరిపాలన దక్షకుడిగా పేరు సంపాదించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు సైతం ఆయన హయాంలో మంజూరు చేయించినవి కావడం విశేషం. అనంతరం రాష్ట్ర విభజన తదితర పరిస్థితుల కారణంగా 2014 ఎన్నికల్లో ఆయన దూరంగా నిలిచారు. మహీధర్‌రెడ్డి మాత్రం తన అనుచరుల నివాసాల్లో జరిగే పెళ్లిళ్లు, విచారింపులు, ఇతర శుభకార్యాలు, తిరునాళ్లకు తరుచుగా హాజరవుతుంటారు. అదేవిధంగా స్వగ్రామమైన మాచవరంలో తన ఇంటి వద్ద తరుచూ అనుచరులను కలుస్తూ వారికి నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ప్రస్తుతం మహీధర్‌రెడ్డి వద్దకు వచ్చే వారి తాకిడి అనూహ్యంగా పెరిగినట్లు సమాచారం. ఇవన్నీ ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి తిరిగి అడుగుపెట్టేందుకు సన్నాహంగా నియోజకవర్గ ప్రజలు యోచిస్తున్నారు. ఈ తరుణంలో ఇటీవల కొంతకాలంగా మహీధర్‌రెడ్డి టిడిపిలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న పోతుల రామారావు టిడిపిలో చేరడంతో మహీధర్‌రెడ్డి వైసిపిలో చేరతారు అనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో ఆదివారం తనను కలిసిన విలేఖర్లతో మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ తాను ఇంత వరకు ఏ పార్టీలో చేరాలనే నిర్ణయం తీసుకోలేదని, తనతో ఎవరు పార్టీలో చేరాలని సంప్రదింపులు జరపలేదని చెప్పారు. టిడిపి, వైసిపిలో తన బంధువర్గం ఉందని, వారు తరుచూ బంధుత్వంతో మాత్రమే మాట్లాడతారని, వారితో రాజకీయ ప్రస్తావన తేలేదన్నారు. రెండున్నర దశాబ్దాలుగా తనకు వెన్నంటి ఉండి అండదండగా నిలిచిన అనుచరులతో చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్నికలు ఖరీదుగా మారాయని, నియోజకవర్గానికి సుమారు కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. నియోజకవర్గంలో పలు సమస్యలపై ఆయన చర్చించారు. సోమశిల, రాళ్లపాడు ప్రాజెక్టు అభివృద్ధి పనులకు తన హయాంలోనే నిధులు మంజూరు చేయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏ పార్టీలో చేరుతున్నారోననే అంశంపై విలేఖరులు ఆయనను ప్రశ్నించగా, తాను ఇంకా ఏ నిర్ణయానికి రాలేదని, ముందుముందు ఏం జరగబోతుందో తాను ఇప్పుడే చెప్పలేనని, కాలనుగుణంగా వచ్చే మార్పులకు ఎవరు అతీతులు కారని నర్మగర్భంగా ఆ అంశాన్ని దాటవేసారు.