ప్రకాశం

నూర్‌బాషా దూదేకుల అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 17:నూర్‌బాషా, దూదేకుల, బిసి ముస్లింల అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని రాష్ట్ర రవాణా శాఖమంత్రి శిద్దా రాఘవరావు హామీ ఇచ్చారు. ఆదివారం స్థానిక బిసికులాల ఆరామక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్టన్రూర్‌బాషా,దూదేకుల, బిసి ముస్లిం సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నూర్‌బాషా విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహకాల అభినందన సభ జరిగింది. ఈ అభినందనసభకు డిఆర్‌ఒ నూర్‌బాషా ఖాసీం అధ్యక్షత వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి శిద్దా మాట్లాడుతూ ప్రభుత్వం నూర్‌బాషా దూదేకుల,బిసి ముస్లింల సంక్షేమానికి కృషిచేస్తుందన్నారు. తాను కూడా అండగా ఉండి వారి అభివృద్ధికి కృషిచేయనున్నట్లు తెలిపారు. ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల మాట్లాడుతూ ముస్లిం తెలుగుదేశంపార్టీకి ఎంతో సహాయసహకారాలు అందిస్తున్నారని వారి అభివృద్ధికి తనవంతు కృషిచేయనున్నట్లు తెలిపారు. ఒంగోలులో బిసిల కోసం భవనాన్ని నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌లో తెలుగుదేశంపార్టీకి సహాయసహకారాలు అందించాలని ఆయన కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కె నాగూర్‌మీరా మాట్లాడుతూ రాష్ట్రంలో 25లక్షలమంది నూర్‌బాషాలు ఉన్నారని రాష్ట్రప్రభుత్వం వారి పట్ల చిన్నచూపుచూడకుండా దామాషాప్రకారం శాసనసభ్యులు, ఎంఎల్‌సి పదవులను ఇవ్వటంతోపాటు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అనంతపురం జిల్లాపరిషత్ చైర్మన్ నూర్‌బాషా సంఘం నాయకులు డి చమన్ మాట్లాడుతూ రాష్ట్రంలో తమ సామాజిక వర్గానికి చెందిన వారు ఎంతో ఇబ్బందిపడుతున్నారని వారి అభివృద్ధికి తోడ్పడటంతోపాటు చట్టసభలో తగినమేర సీట్లను ప్రభుత్వం రాజకీయపార్టీలు కేటాయించి వారి అభివృద్ధికి తోడ్పాడాలని కోరారు. ఈకార్యక్రమంలో పదవతరగతితోపాటు వివిధ తరగతుల్లో మెరిట్‌మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఉచిత వివాహపరిచయవేదిక కార్యక్రమం ఈ సందర్భంగా జరిగింది. ఈకార్యక్రమంలో జిల్లాకార్యదర్శి ఎస్‌కె ఖాసీం, గౌరవాధ్యక్షుడు మీరామొహిద్దీన్, జిల్లా కోశాధికారి ఎస్‌కె మీరావలి, రాష్ట్ర మహిళా విభాగం, మహిళా ఉద్యోగుల సంఘం రాష్టక్రార్యదర్శి, ఎన్‌జివో జెఎసి సెక్రటరి ఎస్‌కె మస్తాన్, ఇతర సంఘ నాయకులతోపాటు నూర్‌భాషా దూదేకుల ముస్లీం సంఘం నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం 150మంది ఎస్‌ఎస్‌సి పరీక్షల్లో 85శాతం మార్కులు సాధించినవారికి ఇంటర్‌లో 900మార్కులు సాధించిన వచ్చిన 68మంది విద్యార్థులకు 1116రూపాయలు సహాయాన్ని అందచేయటంతో పాటు మెమోంటోలను అందచేశారు. ఈకార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యుడు కదిరి బాబురావు తదితరులు హాజరయ్యారు.