ప్రకాశం

జిల్లాలో ముగియనున్న పొగాకు కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 17: జిల్లాలో పొగాకు కొనుగోళ్లు ఈనెలాఖరు నాటికి దాదాపుగా ముగియనున్నాయి. పొగాకు బోర్డు వేలం కేంద్రాల్లో ఈనెలాఖరు నాటికి పొగాకు కొనుగోళ్లు ముగుస్తున్నప్పటికీ వేలం కేంద్రాల్లో ఒక కిలో పొగాకుకు 111 రూపాయలు మించి ధర రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పొగాకు రైతులకు గత ఏడాది కంటే అదనంగా పొగాకు ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. పెరిగిన ఖర్చుల ప్రకారం రైతులకు ఒకి కిలో పొగాకుకు సగటు ధర 140 రూపాయలు ధర వస్తేనే గిట్టుబాటు ధర వస్తుంది. అలాంటిది ప్రస్తుతం జిల్లాలో ఒక కిలో పొగాకుకు సగటు ధర 111 రూపాయలు మాత్రమే ధర వస్తుంది. ప్రస్తుతం బోర్డు అనుమతి ఇచ్చిన పొగాకు కొనుగోళ్లు దాదాపుగా అన్ని వేలం కేంద్రాల్లో పూర్తయ్యి, ప్రస్తుతం అనాథరైజ్‌డ్ పొగాకు కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయినప్పటికీ రైతులకు మంచి ధరలు రావటం లేదు. అదే గోదావరి జిల్లాలోని పొగాకు వేలం కేంద్రాల్లో అయితే ఇప్పటికీ ఒక కిలో పొగాకుకు సరాసరి ధర 143 రూపాయల వరకు ధర వస్తున్నట్లు సమాచారం. ఈ ప్రకారం చూస్తే జిల్లాలోని పొగాకు రైతులు ఒక కేజికి సుమారు 22 రూపాయలు వరకు రైతులు నష్టపోవాల్సి వస్తుంది. గోదావరి జిల్లాలోని పొగాకుకు, ప్రకాశం జిల్లాలో రైతులు పండించిన పొగాకుకు నాణ్యతలో పెద్దగా తేడా లేక పోయినప్పటికీ ధరలో ఇంత వ్యత్యాసం ఏమిటని జిల్లాలోని పొగాకు రైతులు, జిల్లా రైతు సంఘాల నాయకులు దుగ్గినేని గోపినాథ్, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని రైతులపై వీరికి ఏమాత్రం కనికరం లేదని వారు ఆరోపిస్తున్నారు. గోదావరి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అక్కడ రైతులు పక్షాన నిలబడటం, అదే విధంగా కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌కు గోదావరి జిల్లాలో బంధుత్వతం ఉండమే అక్కడ రైతులకు మంచి ధరలు వస్తున్నట్లు వారు విమర్శిస్తున్నారు. వేలం కేంద్రాల ప్రారంభంలో జిల్లాలోని రైతుకు కాస్త మంచి ధరలు ఇచ్చిన పొగాకు వ్యాపారులు ఆ తరువాత వేలం కేంద్రాల్లో తరచుగా సిండికేట్ అవుతూ ధరలను బాగా తగ్గించి కొనుగోలు చేయటం కారణంగా జిల్లాలోని ఒక్కొక్క బ్యారన్ పొగాకు రైతు రెండు లక్షల రూపాయలు వరకు నష్టపోయినట్లు రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పొగాకును రైతులు పండిస్తే పొగాకు వ్యాపారులు మాత్రం సిగరెట్ పెట్టలపై పుర్రె గుర్తు 80 శాతం పైగా ముద్రించడం కారణంగా కంపెనీలు నష్టపోవాల్సి వస్తుందని దీంతో పొగాకును అధిక ధరలు పెట్టి కొనుగోలు చేయలేక పోతున్నట్లు చెబుతూ ధరలు బాగా తగ్గించి కొనుగోలు చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో పొగాకు రైతులు ఈ ఏడాది తమకు గిట్టుబాటు ధరలు రాక తీవ్రంగా నష్టపోతున్నామని , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని పదే పదే కోరినప్పటికీ ప్రభుత్వాలు అనుకున్న మేర స్పందించకపోవడం కారణంగానే తమకు గిట్టుబాటు ధరలు రాలేదని రైతులు వాపోతున్నారు. పొగాకు వ్యాపారులపై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాల వత్తిడి లేక పోవడం కారణంగానే వ్యాపారులు వారి ఇష్టాను సారంగా ధరలు ఇస్తూ పొగాకును కొనుగోలు చేయటంతో తాము నష్టపోవాల్సి వచ్చిందని రైతులు పేర్కొంటున్నారు. అయితే మరో వారం రోజులలో జిల్లాలో పొగాకు వేలం కేంద్రాలు ముగిస్తున్న సమయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు పొగాకు రైతుల గిట్టుబాటు ధరల విషయం పై కేంద్ర వాణిజ్యశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ను కలసి చర్చించేందుకు ఈనెల 19న ఢిల్లీకి వెళుతున్నట్లు ప్రకటించడం ఇది వ్యాపారుల ప్రయోజనం కోసమా లేక రైతుల ప్రయోజనం కోసమా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 120 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి చేయాలని బోర్డు రైతులకు లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 90 మిలియన్ కిలోల వరకు పొగాకు కొనుగోళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో ఇంకా రైతుల వద్ద సుమారు 30 మిలియన్ కిలోల పొగాకు నిల్వ ఉంది. ఒక వేళ మంత్రి పర్యటనలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించి మంచి ధరలు వచ్చేలా చూసినప్పటికీ అది ప్రకాశం జిల్లా రైతులకు ఏ మాత్రం మేలు జరగదని రైతులు ఆరోపిస్తున్నారు.