ప్రకాశం

అభివృద్ధి నినాదంతో అధినేత బిజీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, జూలై 17: నూతనంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశాలు తిరుగుతూ బిజీగా ఉంటే స్థానిక నేతలు మాత్రం గ్రూపు రాజకీయాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. అధికారం వస్తే న్యాయం జరుగుతుందని ఆశించిన కార్యకర్తలు మాత్రం నిరాశా, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిడిపి తరపున పోటీచేసి ఓటమిపాలైన అన్నా రాంబాబు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుండగా ఆ నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌సిపి తరపున గెలిచిన ముత్తుముల అశోక్‌రెడ్డి టిడిపి తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. ఒక దశలో శనివారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి రావెల కిశోర్‌ను తన అనుచరులతో కలిసి గిద్దలూరు నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలను దృష్టికి తీసుకువెళ్ళగా తనకు తెలియకుండా ఎలాంటి బదిలీలు చేయరాదని ఆదేశాలు జారీచేశారు. దీంతో అక్కడ టిడిపి పరిస్థితి రెండు గ్రూపులు, నాలుగు వర్గాలుగా మారింది. ఇక మార్కాపురం నియోజకవర్గంలో ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న కందుల నారాయణరెడ్డి, ఇమ్మడి కాశీనాథ్‌లు రెండు గ్రూపులుగా చీలి ఎవరికివారే యమున తీరేలా నడుచుకుంటున్నారు. కందులకు బలరామకృష్ణమూర్తి ఆశీస్సులు ఉండగా, ఇమ్మడి కాశీనాథ్‌కు జిల్లా టిడిపి అధ్యక్షులు దామచర్ల ఆశీస్సులు ఉన్నాయి. యర్రగొండపాలెం నియోజకవర్గానికి వస్తే అక్కడ వైఎస్‌ఆర్‌సిపి నుంచి గెలిచిన పాలపర్తి డేవిడ్‌రాజు వైసిపిలో గెలిచి టిడిపి తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ కూడా గ్రూపు రాజకీయాలు బహిర్గతం కాకపోయినప్పటికీ కోల్డ్‌వార్ నడుస్తోంది. డేవిడ్‌రాజు పార్టీలోకి రాకముందు వివిధ పనులు చేపట్టాలంటూ త్రిసభ్య కమిటీ అధికారులకు నివేదికలు ఇవ్వగా, పార్టీలో చేరిన కొద్దిరోజులకే వాటిని కాదని తాను రాసిచ్చినవే చేపట్టాలని లేఖలు ఇవ్వడంతో త్రిసభ్య కమిటీ కొంతమేర అసహనం వ్యక్తం చేసినప్పటికీ బహిర్గతం కాకుండా చాపకింద నీరులా అసమ్మతి పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదవి, పాలన, అభివృద్ధి అనుకుంటే సరిపోదని, పార్టీ లేకుంటే ఈ అధికారం ఉండదు, పాలన అసలే ఉండదనే విషయాన్ని గుర్తించి పార్టీ క్యాడర్‌కు న్యాయం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు. మంత్రులు కూడా నియోజకవర్గాల్లో పర్యటించడం, కార్యకర్తల కష్టాలు తెలుసుకోవడం, వాటిని పరిష్కరించడం లాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే రావడం, రిబ్బన్ కట్ చేయడం కామ్‌గా వెళ్ళిపోవడం అన్న విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.