ప్రకాశం

దామచర్ల సమక్షంలో టిడిపిలో చేరిన డిసిసి బ్యాంకు డైరెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 17: డిసిసి బ్యాంకు డైరెక్టర్, జిల్లా బిసి సంక్షేమ సంఘ అధ్యక్షులు రాచగర్ల వెంకట్రావు యాదవ్ ఆదివారం స్థానిక తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒంగోలు, సర్వేరెడ్డిపాలెం, కొప్పోలు, అల్లూరు, మల్లవరప్పాడుకు చెందిన తన అభిమానులు సుమారు 200 మందితో వచ్చి వెంకట్రావు యాదవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు.
దామచర్ల ముందుగా పార్టీ జెండాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ దేవాదాయశాఖ మాజీ మంత్రి అయిన తన తాత గారి అనుచరుడుగా చిరపరిచితులైన రాచగర్ల వెంకట్రావు యాదవ్ తన అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరటం అభినందనీయం అన్నారు. రాజధాని నిర్మాణం లాంటి కార్యక్రమాలతో రాష్ట్రం ఆర్థికంగా లోటులో ఉన్నప్పటికీ తన రెండేళ్లపాలనలో 460 కోట్ల రూపాయల నిధులతో తన నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతోపాటు సుమారు 40 కోట్ల రూపాయల నిధులతో ఏడుగుండ్లపాడు నుండి ఒంగోలుకు తాగునీటి పైపులైన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కళాకారుల సౌకర్యార్థం బాలభవన్ ముస్తాబ్ చేస్తున్నట్లు తెలిపారు. 20 కోట్ల రూపాయల నిధులతో పోతురాజు కాలువ అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. నగరంలో పూలే విగ్రహం ఏర్పాటు చేయటంతోపాటు బిసి భవనం నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అందరూ కలిసి నగరాభివృద్ధికి సహాకారాన్ని అందించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా రాచగర్ల వెంకట్రావుయాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి దామచర్ల ఆంజనేయులు అనుచరునిగా ఉన్నానని, పరిస్థితుల కారణంగా పార్టీకి కొంతకాలం దూరమైనప్పటికీ రాష్ట్భ్రావృద్ధికి చంద్రబాబు, నగరాభివృద్ధికి దామచర్ల జనార్దన్ చేస్తున్న కృషికి ఆకర్షితుడైన తిరిగి సొంతగూటికి చేరటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు కొమ్మూరి రవిచంద్ర, వైవి సుబ్బారావు, కొటారు శ్రీనివాసరావు, టివి శ్రీరామమూర్తి, యర్రాకుల శ్రీనివాస్, టి అనంతమ్మ, జి వెంకటేశ్వర్లు, గెనేం సుబ్బారావుతదితరులు పాల్గొన్నారు. తొలుత స్థానిక భాగ్యనగర్ నుండి శాసనసభ్యుని ఇంటిమీదుగా స్థానిక ట్రంకురోడ్డు, మస్తాన్‌దర్గా సెంటరు మీదుగా శ్రీకృష్ణుని ఆలయం వరకు బైక్‌ర్యాలీ జరిగింది. శ్రీకృష్ణుని ఆలయంలో వెంకట్రావు పూజలు నిర్వహించుకుని అనంతరం తెలుగుదేశంపార్టీ జిల్లాకార్యాలయం వరకు బైక్ ర్యాలీ సాగింది.