ప్రకాశం

జిల్లాకు నాలుగు టిఎంసిల నీటిని వెంటనే విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూలై 22: జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన మంచినీటి ఎద్దడిని నివారించేందుకు తక్షణమే నాలుగుటిఎంసిల నీటిని ప్రభుత్వం విడుదల చేయాలని వైకాపా రాష్ట్ర నాయకుడు, ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి శుక్రవారం ఒకప్రకటనలో డిమాండ్ చేశారు.జిల్లాలోని ప్రజలు మంచినీటికోసం తీవ్ర అవస్ధలు పడుతున్నారని అందువలన నాలుగుటిఎసిల నీటితో 291నోటిఫైడ్, నాన్‌నోటిఫైడ్ చెరువులను నింపాలన్నారు. ఈపాటికే జిల్లాలోని 150చెరువులునీరు లేక ఎండిపోయాయన్నారు. జిల్లాప్రజల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్రప్రభుత్వం తక్షణమే కృష్ణబోర్డు యజమాన్యంతో మాట్లాడి నీటిని విడుదల చేయించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని కొన్నిగ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ప్రజల దాహార్తిని తీర్చాలన్నారు.అదేవిధంగా ప్రజలతోపాటు, పశువులు సైతం చెరువుల్లో నీరు లేక ఇబ్బందులుపడుతున్నాయన్నారు. పశువులు నీటికోసం మైళ్ళకొద్ది వెళ్లాల్సిన పరిస్ధితి నెలకొందని,దీనివలన పాలదిగుబడులు సైతం తగ్గిపోతున్నాయన్నారు. ప్రజలను,పశువులను దృష్టిలో ఉంచుకుని సాగునీటి చెరువులకు నాగార్జున సాగర్‌నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రమైన ఒంగోలు నగర వాసులకు ఐదురోజులకొకసారి నీటిని విడుదలచేస్తున్నారని దీంతో నగరప్రజలు మంచినీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. నాగార్జునసాగర్‌నీటిని విడుదల చేస్తే ఒంగోలులోని ఎస్‌ఎస్ ట్యాంకులకు నీరు చేరుతుందని దీంతో నగరప్రజల దాహార్తి తీరుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని దీంతో ఆ పంటలను కాపాడుకునేందుకు రైతులకు పూర్తిస్ధాయిలో రెయిన్‌గన్స్‌ను మంజూరుచేయాలని ఆయన రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోతీవ్రమైన కరువుపరిస్దితులు ఏర్పడిన నేపధ్యంలో రైతులు ఆర్ధికంగా కుంగిపోతున్నారన్నారు. ఖరీఫ్‌సీజన్‌లో రెండులక్షల 35వేల ఎకరాల సాగుకావాల్సి ఉండగా కేవలం 60వేల ఎకరాల్లో మాత్రమే పంటలను రైతులు సాగుచేశారన్నారు. రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని అందువలన రైతులను అన్నివిధాల ఆదుకునేందుకు రెయిన్‌గన్స్‌ను పూర్తిస్ధాయిలో సబ్సిడీపై మంజూరుచేయాలన్నారు. జిల్లాలో ఈనెలలో 89.7మిల్లీమీటర్ల వర్షపాతంనమోదుకావాల్సి ఉండగా ఇప్పటివరకు 23 ఎంఎంల వర్షపాతం మాత్రమే నమోదైందన్నారు. సాగర్‌నీటి విడుదలతోపాటు, రైతులకు రెయిన్‌గన్స్‌ను మంజూరుచేయాలని ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.