ప్రకాశం

వైకాపా మేయర్ అభ్యర్థి రేసులో శమంతకమణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూలై 23:ఒంగోలు నగర కార్పొరేషన్ వైకాపా మేయర్ అభ్యర్థి రేసులో ఒంగోలుకు చెందిన డి శమంతకమణి ఉన్నారు. ఆ మేరకు ఆమెను పార్టీ ఆదేశిస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఒంగోలులోని సిఆర్‌పి క్వార్టర్స్‌కు చెందిన ఆమె వైకాపా తరపున చురుగ్గా పార్టీకార్యక్రమాల్లో పాల్గొంటునే మరోపక్క సేవా కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారు. ఇటీవల వృద్ధాశ్రమంలోని వృద్ధులకు కావాల్సిన బియ్యంతోపాటు సామగ్రిని తన స్వంత నిధులతో పంపిణీ చేసి పార్టీశ్రేణులకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఒంగోలు నగర పార్టీనాయకులు పాల్గొన్నారు. ఆమె తండ్రి డిపిఆర్ ప్రసాదు కూడా రిటైర్డు డిటిఒగా పనిచేశారు. ఆయన సంతనూతలపాడు, కొండెపి నియోజకవర్గాల తరపున కాంగ్రెస్‌పార్టీనుండి పోటీప్రయత్నాలుచేశారు. కాని ఆయనకు సీటు దక్కలేదు. ప్రస్తుతం ఆయన కుమార్తె ఒంగోలు నగర మేయర్ రేసులో వైకాపా తరుపున పోటీచేసేందుకు పావులు కదుపుతున్నారు. విద్యావంతురాలైన ఆమె ఆర్థికంగా కూడా స్థిరపడినట్లు సమాచారం.దీంతో ఆమె పోటీ చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. శమంతకమణి ఉద్యోగరీత్యా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మద్రాసులో పనిచేస్తున్నారు. ఇప్పటివరకు వైకాపా తరపున పోటీచేసేందుకు ఎవరు ముందుకురాని నేపధ్యంలో ఆమె ముందుకురావటంతో ఆమె పేరునే అధిష్టానం పరిశీలనలోకి తీసుకుంటుందా లేక కొత్తవారిని తెరపైకి తీసుకువస్తారా అన్న చర్చ పార్టీశ్రేణుల నుండి వినిపిస్తోంది. ఇదిలా ఉండగా నవంబర్‌లోపు రాష్ట్రంలో ఎన్నికలు జరగని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయని స్వయానా మునిసిపల్ శాఖమంత్రి నారాయణ ఇటీవల ప్రకటించిన నేపధ్యంలో రాజకీయంగా వేడెక్కింది. జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు, కందుకూరు మునిసిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. ఒంగోలు నగర కార్పొరేషన్‌కు రిజర్వేషన్ల ప్రకారం ఎస్‌సి మహిళ కావటంతో ఆమె పేరు తెరపైకి వైకాపా తరపున వచ్చినట్లు సమాచారం. ఈపాటికే ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల నేపధ్యంలో జిల్లా వైకాపా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గడపగడపకు వైకాపా నినాదాన్ని తీసుకెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటునే మరోపక్క తమపార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. తెలుగుదేశంపార్టీ తరపున ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ఒంగోలు నగరంలోని ప్రతివార్డులో సుడిగాలి పర్యటన చేస్తూ అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తున్నారు. మొత్తంమీద ఒంగోలు నగర కార్పొరేషన్ వైకాపామేయర్ అభ్యర్థి రేసులో శమంతకమణి ఉన్నారు. రాష్టప్రార్టీ ఆదేశిస్తే తాను పోటీకి సిద్ధమంటూ సంకేతాలు కూడా పంపించినట్లు తెలుస్తొంది.
మాజీ మంత్రి జివి శేషు మృతి తీరనిలోటు
- పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి నివాళి
ఒంగోలు అర్బన్,జూలై 23: మాజీ మంత్రి గుర్రాల వెంకటశేషు (71) మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. శేషు శనివారం తెల్లవారుజామున నాలుగంటలప్రాంతంలో ఒంగోలులో గుండెపోటుతో మృతిచెందారు. ఆయన మృతికి కాంగ్రెస్‌పార్టీకి చెందినప్రముఖులతోపాటు,వివిధ రాజకీయపక్షాలకు చెందిన నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.ప్రధానంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘవీరారెడ్డి,రాష్టయ్రూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఒంగోలు,కొండెపి, సంతనూతలపాడు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్, డోలా బాలవీరాంజనేయస్వామి, ఆదిమూలపుసురేష్, జిల్లా వైకాపా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీశాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, దారా సాంబయ్య, కెపి కొండారెడ్డి, ఈశ్వరరావు,మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి, టిడిపి నేత కరణం వెంకటేష్, నెల్లూరు జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య, మాజీ మునిసిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, మాజీ ఎఎంసి చైర్మన్ అయినబత్తిన ఘనశ్యాంలు జివి శేషు పార్ధివదేహాన్ని సందర్శించి పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు.అదేవిధంగా ఒంగోలుపార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి, జిల్లా శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు,రాష్ట్ర ఎస్‌సి,ఎస్‌టి కమిషన్ చైర్మన్ కారెం శివాజి,బాపట్ల పార్లమెంటు సభ్యుడు శ్రీరాం మాల్యాద్రి,కేంద్రమాజీ మంత్రి పనబాక లక్ష్మి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా రాష్టప్రిసిసి అధ్యక్షుడు ఎన్ రఘవీరారెడ్డి మాట్లాడుతూ జివి శేషు మరణం కాంగ్రెస్‌పార్టీకి తీరని లోటన్నారు.
1989సంవత్సరంలో ఒకేసారి తాము ఇద్దరం అసెంబ్లీలో అడుగుపెట్టామన్నారు. 1999లో ఇద్దరు శాసనసభ్యులుగా కలిసి పనిచేశామని, రాష్టమ్రంత్రిగా శేషు ప్రజలకు ఎనలేని సేవలు అందించారన్నారు. గ్రామస్థాయి నుండి కార్యకర్తగా ఎదిగి రాష్టస్థ్రాయి మంత్రిగా పనిచేశారన్నారు. గతమార్చినెలలో కోటిసంతకాల సేకరణ, మట్టిసత్యగ్రహం కార్యక్రమాలకు హాజరయ్యారన్నారు.ప్రతినెలలో ఒకసారైన తామిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటామని గుర్తుచేశారు. భవిష్యత్‌లో ఆయన కుమారుడు రాజ్‌విమల్‌తో కలిసి పనిచేస్తామన్నారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ తనకు అతితక్కువ కాలంలో పరిచయం అయినప్పటికి తన తండ్రితో స్నేహభావంతో శేషు ముందుకువెళ్ళేవారన్నారు. అలాంటినేతను పొగోట్టుకోవటం దురదృష్టకరమన్నారు.
ఇదిఇలాఉండగా ఆయన ఒంగోలు బ్లాక్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా 1977లో పనిచేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రధానకార్యదర్శిగా 1996నుండి 99వరకు పనిచేశారు. 1999నుండి 2004వరకు ఎఐసిసి సభ్యునిగా, 2005నుండి 2008వరకు జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. 1989నుండి 94వరకు సంతనూతలపాడు శాసనసభ్యునిగాను, 1989నుండి 90వరకు మర్రిచెన్నారెడ్డి క్యాబినేట్‌లో పాడిపరిశ్రమ, క్రీడలశాఖ, లీడ్‌క్యాప్‌శాఖమంత్రిగా పనిచేశారు. 2007-09వరకు జిల్లా శాసనమండలి సభ్యునిగా పనిచేశారు. 2009లో కొండెపి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అక్కడనుండి ఇప్పటివరకు కాంగ్రెస్‌వాదీగా కొనసాగుతున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్నకుమారుడు రాజ్‌విమల్‌ను 2014 ఎన్నికల్లో కొండెపి అసెంబ్లీ నియోజకవర్గంనుండి కాంగ్రెస్‌పార్టీఅభ్యర్ధిగా పోటీచేసి ఓటమిపాలైనారు.పెద్దకుమారుడు టోని ఆస్ట్రేలియాలో సాప్ట్‌వేర్ రంగంలో స్థిరపడ్డారు. ఆయన అంత్యక్రియలు సోమవారం ఉదయం పదిగంటలకు సమాధుల తోటలో అధికారలాంఛనాలతో జరగనున్నాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రజాసాధికార సర్వే
సమర్థవంతంగా నిర్వహించాలి
* అధికారులు సమన్వయంతో పనిచేయాలి
* కలెక్టర్ సుజాతశర్మ
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,జూలై 23:ప్రజాసాధికార సర్వే కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సుజాతశర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని మంగమూరు, ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో నిర్వహిస్తున్న ప్రజాసాధికార సర్వేను కలెక్టర్, ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారితో కలిసి పర్యవేక్షించారు.
మంగమూరు గ్రామంలోని అంబేద్కర్ కాలనీలో కసుకుర్తి సరోజనమ్మ, సీతారామయ్యల కుటుంబం అదేవిధంగా కంకణాల రాములమ్మ కుటుంబాన్ని పంచాయతీ సెక్రటరీ సునీత, తహశీల్దార్ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాసాధికార సర్వేను కలెక్టర్ పర్యవేక్షించారు. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులను గుర్తించి ప్రజాసాధికార సర్వేవారి పేర్లు నమోదుచేసి వారి నుండి 15రూపాయల వసూలుచేసి పథకాన్ని వర్తింపచేయాలని కలెక్టర్ ఎన్యుమరేటర్లకు సూచించారు. మంగమూరు ఐకెపి మహిళా జి అరుణ చంద్రన్న బీమా పథకానికి సంబంధించి ప్రీమియం వసూలుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కలెక్టర్ ప్రశ్నించారు. మంగమూరు అంబేద్కర్ కాలనీలో మురుగునీరు పారుదల కాకుండా నిలిచిపోయి దోమలకు నిలయంగా మారిందని, ఎక్కడికక్కడే చెత్తచెదారంతో డ్రైన్స్ అన్ని పూడి పోయి ఉన్నాయని, కాలనీలో పారిశుద్ధ్య కార్యక్రమం అధ్వాన్నంగా ఉందని కలెక్టర్ పంచాయితీ సెక్రటరీ సునీతను ప్రశ్నించారు. ఈవిషయంపై పంచాయితీ సెక్రటరిని వివరణ కోరుతూ సంజాయిషి ఇవ్వాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని శంకరనారాయణ కళ్యాణమండపం, రామాలయం వీధిలో నిర్వహిస్తున్న ప్రజాసాధికార సర్వేను కలెక్టర్ పర్యవేక్షించారు. రామాలయం వీధిలోగల సాంబశివరావు కుటుంబం అదేవిధంగా కె సత్యనారాయణ కుటుంబాల ప్రజాసాధికార సర్వేను ఎన్యుమరేటర్లు నిర్వహించే విధానాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. మెప్మా నుండి ఒకరిని నియమించారని వారు రావటం లేదని కలెక్టర్‌కు తెలిపారు. కలెక్టర్ వెంటనే మెప్మా పిడి అన్నపూర్ణతో ఫొటోలో మాట్లాడుతూ మెప్మాసిబ్బంది సర్వేకార్యక్రమంలో సక్రమంగా విధులకు హాజరుకాకపోవడంపై వివరాలు అడిగితెలుసుకున్నారు. సర్వే కార్యక్రమంలో హాజరుకాని సిబ్బందికి ఏలాంటి రెమ్యూనరేషన్ చెల్లించవద్దని ఒంగోలు ఆర్‌డిఒకు సూచించారు. కలెక్టర్ వెంట వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

రాజకీయాలకు వనె్నతెచ్చిన మహనీయుడు రామారావు
మంత్రి మాణిక్యాలరావు
పొదిలి,జూలై 23:రాజకీయాలకు వనె్నతెచ్చిన మహనీయుడు,దివంగత బిజెపి నేత, మాజీ సిక్కిం గవర్నర్ బి రామారావు అని రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖమంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. ంచారు. ఈ సందర్భంగా మువ్వలవెంకట సుబ్బయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాణిక్యాలరావుమాట్లాడుతూ నిబద్ధతో కూడిన నైతిక విలువలతో కూడిన రామారావు అన్నారు. పదవుల్ని తృణప్రాయంగా త్యజిస్తూ తనదైన శైలిలో జీవితమంతా గడిపారని ఆయన బిజెపి పార్టీకోసం చేసిన సేవలు మరవజాలమన్నారు. అలాంటి మహానీయుడు జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించటం తన అదృష్టంగా మంత్రి చెప్పుకున్నారు. అలాగే రాష్ట్రంలో బిజెపి బలోపేతానికి రామారావుతోపాటు మరో సీనియర్ దివంగత నేత పొదిలి ప్రాంతవాసి మువ్వల శ్రీహరిరావు కీలకపాత్ర పోషించారని అలాంటి మహానీయులను అందరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అలాంటివారి ఆశయసాధనకోసం కార్యకర్తలు కృషిచేయాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో బిజెపి బలమైన శక్తిగా తయారౌతుందన్నారు. ముఖ్యమంత్రి దివంగత ఎన్‌టిఆర్ హయాంలో బిజెపి ఆశించిన మేర గెలవలేకపోయిందన్నారు. అయితే నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసే పార్టీ బిజెపి పార్టీ అని ఆయన పేర్కొన్నారు. మాజీ శాసనసభ్యుడు దారా సాంబయ్య మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు పూర్తిఅయితేనే జిల్లా ఆశించిన మేరకు అభివృద్ధి జరుగుతుందన్నారు. అలాగే రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు నాయకులు గట్టిగా కృషిచేయాలన్నారు.వెలుగొండ పూర్తయితే తాగునీటి సౌకర్యం కలుగుతుందన్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు జిల్లా అభివృద్దికి పాటుపడాలని ఆయన కోరారు. ఎఫ్‌సిఐ డైరక్టర్ అయినబత్తిన రాముతోపాటు వివిధ సంఘాల నాయకులు మంత్రికి శాలువలను కప్పి ఘనంగా సన్మానించారు. ముందుగా పొదిలికి విచ్చేసిన మంత్రికి తహాశీల్దార్ విద్యాసాగరుడు, ఆర్‌ఐ రవిశంకర్‌తోపాటు బిజెపినాయకులు,కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. స్ధానిక ఎస్‌వికెపి డిగ్రీకాలేజి ఆవరణలోని దివంగత నేత మువ్వల శ్రీహరిరావుకాంస్యవిగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తరువాత గోసాలను సందర్శించి అక్కడ మొక్కలను నాటారు. గోవుల సంరక్షణగురించి వాకాబుచేసిన మంత్రి నిర్వాహకులను అభినందించారు. అనంతరం శ్రావణి ఎస్ట్‌ట్‌లోని పద్మావతి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకపూజలు జరిపారు. మంత్రి పర్యటన సందర్బంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్‌పి రాంబాబు నేత్రుత్వంలో ఎస్‌ఐ శశికుమార్,ట్రైనీ ఎస్‌ఐ అబ్ధుల్ రహమాన్ గట్టిపోలీసుబందోబస్తు నిర్వహించారు.కార్యక్రమంలో బిజెపి నాయకులు బత్తిన నరసింహరావు, పివి కృష్ణారెడ్డి, ఖలీఫాతుల్లాభాషా, మువ్వల పార్ధసారధి, సయ్యద్ ఖాదర్‌బాషా, గోలి నాగేశ్వరరావు, పందిటి మురళీ, మాగులూరి రామయ్య, పివి కృష్ణారావు, రావూరి సత్యాలు, న్యాయవాదులు వరికూడి నాగరాజు, ఎస్ శ్రీనివాసరావు, బెల్లంకొండ పద్మావతి, శ్రావణి వెంకటేశ్వర్లు, వెలిశెట్టి విజయగౌరి, నారాయణ, సామంతపూడి నాగేశ్వరరావు, ఎండి గౌస్, యక్కల శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

పెరోల్‌పై వచ్చి పోలీసుల కళ్ళుకప్పి పరారైన జీవిత ఖైదీ అరెస్టు
మార్కాపురం, జూలై 23: సోదరుడు మరణించడంతో అంత్యక్రియలకు పెరోల్‌పై వచ్చి పోలీసుల కళ్ళుకప్పి పరారైన జీవిత ఖైదీని మార్కాపురం రూరల్ పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని అమ్మవారిపల్లి గ్రామానికి చెందిన కురుకుందు శ్రీనివాసులు అలియాస్ శ్రీనుకు గత ఏడాది జంట హత్య కేసులో జీవిత ఖైదు విధించారు. కాగా, జైలులో ఉన్న శ్రీనివాసులు సోదరుడు వెంకటేశ్వర్లు మృతిచెందడంతో మే 30వ తేదీన అంత్యక్రియలు నిర్వహించేందుకు పోలీసు ఎస్కార్ట్‌తో స్వగ్రామమైన అమ్మవారిపల్లికి వచ్చాడు. మే 1వ తేదీన కాలకృత్యాలు తీర్చుకొని వస్తానని చెప్పి పోలీసుల కళ్ళుకప్పి పరారయ్యాడు.
దీంతో అప్పట్లో ఎస్కార్ట్‌గా వచ్చిన ముగ్గురు పోలీసులను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. దీంతో నిందితుని కోసం మార్కాపురం రూరల్ ఎస్సై జి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి గాలింపుచర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం మార్కాపురం మండలం ఎల్‌బిఎస్ నగర్ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఎఎస్సై డేవిడ్, కానిస్టేబుళ్లు వీరభద్ర, అంజన్, హోంగార్డు నోవా అక్కడకు చేరుకొని నిందితుడు శ్రీనివాసులును అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచినట్లు రూరల్ ఎస్సై జి వెంకటేశ్వర్లు తెలిపారు.