ప్రకాశం

గ్రామీణ తపాలా ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం టౌన్, జూలై 24: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న తపాలా ఉద్యోగులను కేంద్రప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ జాతీయ సహాయ ప్రధాన కార్యదర్శి బివి రావు డిమాండ్ చేశారు. గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జూన్ 12న శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన బివి రావు పాదయాత్ర ఆదివారం మార్కాపురం పట్టణం చేరుకోవడంతో స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో 1.30లక్షల పోస్ట్ఫాసులు పనిచేస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో 24వేల పోస్ట్ఫాసులు మాత్రమే పనిచేస్తున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బంది రోజుకు 10 నుంచి 12గంటల పాటు పనిచేస్తున్నారని, వారిని పార్ట్‌టైం ఉద్యోగులుగా పరిగణించి నెలకు 6వేల రూపాయల నుంచి 10వేల రూపాయల వరకు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. పట్టణ ప్రాంతంలో పనిచేసే పోస్టల్ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్, ఇతరత్రా సౌకర్యాలు గ్రామీణ ప్రాంత ఉద్యోగులకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కూలీలకు చెల్లింపులు, వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్లు తదితర పథకాలు గ్రామీణప్రాంత పోస్ట్ఫాసుల్లో సమర్థవంతంగా అమలు చేస్తుండడంతో తపాలా శాఖకు ఆదాయం చేకూరుతుందన్నారు. ఈఏడాది అక్టోబర్ నుంచి రూరల్ ఇన్‌ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పథకం కింద గ్రామీణప్రాంత పోస్ట్ఫాసులను కంప్యూటరీకరించి రెవెన్యూ, విద్యుత్, నీటిపన్ను తదితర బిల్లులను పోస్ట్ఫాసుల్లో చెల్లించే సౌకర్యం గ్రామీణులకు అందుబాటులోకి రానుందన్నారు. వచ్చేఏడాది నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని పోస్ట్ఫాసులన్నింటినీ పేమెంటు బ్యాంకులుగా మార్చి బ్యాంకు సేవలు అందించడానికి రిజర్వ్‌బ్యాంకు అనుమతి ఇచ్చిందని అన్నారు. వీటన్నింటిని నిర్వహించడానికి గ్రామీణ ప్రాంత తపాలా సిబ్బందిపై అధిక భారం పడుతున్నందున వారిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. గత డిసెంబర్‌లో గ్రామీణ తపాలా వ్యవస్థను పరిశీలించి వీరికి ఇవాల్సిన వేతనాలు, సౌకర్యాలు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి పోస్టల్ బోర్డులో పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారి కమలేష్‌చంద్రతో ఏకసభ్య కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించిందన్నారు. ఈ కమిటీపై ఒత్తిడి తెచ్చి గ్రామీణ తపాలా ఉద్యోగులను కేంద్రప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు తీసుకువచ్చేందుకు తాను పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు. ఈ పాదయాత్రలో రాష్ట్ర సహాయ కార్యదర్శి వై మర్రెడ్డి, మార్కాపురం బ్రాంచి కార్యదర్శి డి నారాయణరెడ్డి, సహాయ కార్యదర్శి ఎన్ రమణారెడ్డి, రాష్ట్ర నాయకులు సిహెచ్ సత్యనారాయణ, సయ్యద్ కాశీం, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు రావులపల్లి రవీంద్రనాథ్, స్థానిక నాయకులు పఠాన్ అబ్దుల్ ఆజాద్‌ఖాన్, ఆర్ కొండయ్య పాల్గొన్నారు.