ప్రకాశం

ప్రజా సంక్షేమమే టిడిపి ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముండ్లమూరు, జూలై 24: రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమమే టిడిపి ధ్యేయంగా భావించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిర్వహిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు స్పష్టం చేశారు. మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం ద్వారా కరవును పారద్రోలుతున్న అపర భగీరథుడన్నారు. 100 టిఎంసిల గోదావరి నీటిని కృష్ణానదిలో కలిపి 13 లక్షల ఎకరాలకు తాగు, సాగునీటిని అందిస్తున్నామన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి పనులు కూడా శరవేగంతో జరుగుతున్నాయన్నారు. ఆరు వేలకోట్లకు వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు పెంచిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 24వేల కోట్లరూపాయలతో రైతు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. 12వేల కోట్ల రూపాయలతో డ్వాక్రా రుణాలను మాఫీ చేయడం జరిగిందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లుగా భావించి ప్రజా సంక్షేమంపై నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడేనన్నారు. దర్శి నియోజక వర్గంలో టిడిపి ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలకాలంలో 950 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. దర్శిలో డ్రైవింగ్ స్కూల్, దర్శి, పొతకమూరులలో బ్రిడ్జిని ఏర్పాటు చేయడం, అద్దంకి నుండి దర్శి వరకు ఆర్‌అండ్‌బి రోడ్డును డబుల్‌రోడ్డుగా మార్చడం, వెల్లంపల్లి నుండి ముండ్లమూరు వరకు డబుల్ రోడ్డుగా వేసినట్లు చెప్పారు. జిల్లాలో 800 కిలోమీటర్ల మేర పంచాయతీ రోడ్లను ఆర్ అండ్‌బిలో విలీనం చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాకే దొనకొండ తలమానికం అని, పారిశ్రామిక కారిడార్ కోసం 25 వేల ఎకరాల భూ సేకరణ జరిగిందని, 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పారిశ్రామిక కారిడార్‌గా రూపాంతరం చెందనుందన్నారు. దీంతో దొనకొండ చుట్టు ప్రక్కల 60 నుండి 70 కిలోమీటర్ల మేర అభివృద్ధి జరుగుతుందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మారెళ్ల గ్రామంలో 22 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో ఎత్తి పోతల పథకం నిర్మాణం జరుగుతుందన్నారు. జమ్మలమడకలో 17 కోట్ల రూపాయలతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఆయన పరిశీలించారు. ముండ్లమూరులో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సీజన్‌కు నీరు అందిస్తామని ఆయన రైతులకు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధాలన్నింటిని అమలుచేశామని మంత్రి తెలిపారు. మారెళ్ల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఎదుట కాంప్లెక్స్ నిర్మించాలని గ్రామస్థులు మంత్రిని కోరారు. ముండ్లమూరులో గల పోలేరమ్మ దేవాలయానికి ఒక కోటి 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశామన్నారు. తమసొంత నిధులు 25 లక్షల రూపాయలు దేవస్థానం అభివృద్ధికి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆయన వెంట ఆర్ అండ్‌బి ఎస్‌ఇ రమేష్‌బాబు, కందుకూరు ఆర్డీఓ మల్లికార్జున్, ఎంపిపి ఎం వెంకట్రావు, ముండ్లమూరు, పోలవరం, జమ్మలమడకగ్రామాల సర్పంచులు మేదరమెట్ల వెంకట్రావు, మాలెంపాటి మల్లికార్జున్‌రావు, బ్రహ్మయ్య, వేముల సర్పంచ్ ఏడుకొండలు రెడ్డి, వేముల ఎంపిటిసిలు సుంకర రాఘవరెడ్డి, భీమవరం ఎంపిటిసి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.