ప్రకాశం

వరి పంటకు సాగర్‌నీరు హుళక్కేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 28: నాగార్జున సాగర్ ఆయకట్టుపరిధిలోని రైతులు వరి పంట సాగుచేయవద్దని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రకటించిన నేపధ్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళన వ్యక్తవౌతుంది. నాగార్జునసాగర్ సాగునీటితో జిల్లాలోని అద్దంకి, దర్శి, ఒంగోలు బ్రాంచికెనాల్ పరిధిలోని నాలుగులక్షల ఎకరాల్లో వరిపంటను సాగుచేస్తారు. గత సంవత్సరమే సాగర్‌నీరు రాక కొన్ని ప్రాంతాల్లో వరిసాగును రైతులు సాగుచేయకుండా ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గుచూపారు. స్వయానా మంత్రి పత్తిపాటి ప్రకటించిన నేపధ్యంలో సాగర్ ఆయకట్టుపరిధిలోని రైతులు వరినారుమడులను పోసుకునేందుకు సిద్ధంకాని పరిస్థితి నెలకొంది. వరిపంట సాగుకాకపోతే మాత్రం రానున్నరోజుల్లో జిల్లాలో వరిసాగుచేసే రైతులు ఇతర జిల్లాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి. గతంలో జిల్లాలోని సాగర్ ఆయకట్టుపరిధిలోని రైతుల లక్షలాది బస్తాల ధాన్యాన్ని పండించేవారు. ప్రధానంగా కొమ్మమూరు కెనాల్ పరిధిలోని కారంచేడు ఇతరప్రాంతాలకు చెందిన రైతులు వరిసాగును విస్తత్రంగా చేపట్టారు. ఇప్పటికి పుట్టుల్లో వరిధాన్యం మగ్గుతూనే ఉంది. ఇదిలాఉండగా జిల్లాలో సాగర్ ఆయకట్టుపరిధిలోనే ప్రధానంగా వరిసాగు అవుతుంది. మంత్రి వ్యాఖ్యలతో ప్రత్యామ్నాయ పంటలైన పత్తి, మిరప, కంది ఇతర పంటలను రైతులు సాగుచేసుకోనున్నారు. లక్షల ఎకరాల్లో వరిపంటను సాగుచేయకపోవటంతో బియ్యం ధరలు కొండెక్కికూర్చోనే అవకాశాలున్నాయి. కూలీలకు కూడా కూలి దొరక్క ఇతరప్రాంతాలకు వలసలు వెళ్లే అవకాశాలున్నాయి. వరి పంట సాగుచేసే దగ్గర నుండి కోసేవరకు కూలీలతోనే రైతులకు పని ఉంటుంది. వరి సాగుచేయకపోతే కూలీలు కూడా ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. సాగర్ ఆయకట్టుపరిధిలోని ఎరువులు, పురుగుమందుల వ్యాపారం కూడా సక్రమంగా సాగే పరిస్థితి ఉండదు. కోట్లాది రూపాయల ఎరువులు, పురుగుమందుల విక్రయాల పడిపోనున్నాయి. దీంతో కూలీలతోపాటు, ఎరువుల, పురుగుమందుల వ్యాపారులు సైతం రోడ్డున పడే అవకాశాలున్నాయి. ఇదిలాఉండగా రైస్‌మిల్లుల యజమాన్యాలు సైతం ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. ఇతర జిల్లాల్లో పండే ధాన్యాన్ని మిల్లుల యజమానులు కొనుగోలుచేసి తమ మిల్లుల్లో బియ్యాన్ని తయారు చేసుకునే పరిస్థితులు రానున్నాయి. మొత్తంమీద జిల్లాలోని వరి పంట సాగుకు సాగర్‌నీటిని విడుదల చేయాలని ఆయాప్రాంతాలకు చెందిన రైతులతోపాటు, రైతుసంఘాల నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.