ప్రకాశం

గౌడ్‌లు అన్ని రంగాల్లో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 31:వెనుకబడిన గౌడ్‌లు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా విద్యాపరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూశాఖమంత్రి కెఇ కృష్ణమూర్తి వెల్లడించారు. ఆదివారం స్థానిక పివిఆర్ బాలుర పాఠశాల గ్రౌండ్స్ ఆవరణలో దివంగత బలగాని వెంకటేశ్వరగౌడ్ ప్రాంగణంలో ప్రకాశం జిల్లా గౌడ్‌సంఘం,కల్లుగీత సంఘం జిల్లానూతన కార్యవర్గం ప్రమాణాస్వీకారమహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ గౌడ్‌ల అభివృద్ధికి దివంగత గౌతులచ్చన్న లాంటి ఎందరో పోరాటం చేసినట్లు తెలిపారు. ఆ పోరాట ఫలితంగా ప్రస్తుతం గౌడ్‌లు అభివృద్ధి చెందుతున్నారని అయితే ఇంకా ఐక్యంగా ఉండి చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం గౌడ్ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న నారాయణ కూడా గౌడ్‌ల అభివృద్ధికి కృషిచేస్తున్నారని తెలిపారు. వృత్తి గొప్పదా, కులం గొప్పదా అంటే తాను రెండు గొప్పవేనని చెబుతానన్నారు. గౌడ్ వృత్తిలో తాను జన్మించబట్టే ఈనాడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి స్థాయిలో గౌరవమైన పదవిలో ఉన్నానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఫింజారిలు, బండారిలు, నాగారులు, అహుయ్యాలు కూడా మన కులవృత్తినే చేస్తున్నారని ఈకులాలకు చెందిన వారు కూడా పార్లమెంటులో కొంతమంది సభ్యులుగా ఉండటం ఎంతో గౌరవంగా ఉందన్నారు. ఏది తింటున్నామో ఏలా బతుకుతున్నామో ముఖ్యంకాదని అయితే మనమంతా గౌరవంగా బతకాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన వాళ్ల చేత వెలమదొరలు ఇళ్లకు కల్లు తెప్పించుకోవటం లాంటి సంఘటనలు తనకు ఎంతో బాధ కలిగిస్తుందన్నారు. అదేవిధంగా మన గౌడజాతి మహిళలు కల్లుగీసే సమయంలో అక్కడి వెలమదొరలు లాంటి వారు అవమానించే విధంగా వ్యవహరించటం కూడా తనకు ఎంతో బాధ కలిగిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే గౌడ్‌లు వారి పిల్లలను బాగా చదివించి భవిష్యత్‌లో ఉన్నత స్థానాలకు ఎదిగే విధంగా చూడాలన్నారు. ఒసిల కంటే మనం తక్కువేమికాదని మనహక్కులను మనం సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిఇలా ఉండగా ఇటీవల రాజ్యసభలో ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే అవకాశం లేదంటూ మాట్లాడటం ఎంతో బాధగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పార్లమెంటు సభ్యులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేవిషయాన్ని ప్రధానిమోదీ చేవిలో ఊదాలని చెబుతున్నారని అదేవిధంగా పార్లమెంట్‌లో కూడా ప్రత్యేకహోదా విషయంలో నిలదీయాలని సిఎం చెబుతున్నట్లు కెఇ తెలిపారు. అయినప్పటికి రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తుందన్న ఆశ తమలో ఉందన్నారు. అదేవిధంగా నిధులు కూడా ఇచ్చి ఆదుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు. కేంద్రం రాష్ట్రానికి కొన్ని విషయాల్లో సహరించకుండా ఇబ్బందులు పెడుతున్నప్పటికీ ఎన్‌డిఎ ప్రభుత్వం నుండి తప్పుకునేందుకు మనసు అంగీకరించటం లేదని అన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వంలో ఇప్పటివరకు అవినీతి జరగకపోవటమే ఇందుకు కారణమని ఆయన తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటుసభ్యుడు, రాష్ట్ర గౌడసంఘం అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ గౌడ్ మాట్లాడుతూ గౌడ్ సంఘీయులు అంతా చైతన్యవంతులు కావాలని ఒక రాజకీయశక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. రాష్టమ్రంతా పర్యటించి గౌడ్‌ల అభివృద్ధికి కృషిచేయటంతోపాటు సంఘాన్ని పటిష్టం చేసేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశంప్రభుత్వం గౌడ్ సంఘీయులకు అండగా ఉందన్నారు. గౌడ్‌సంఘీయుల ప్రయోజనాలకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. మాజీ శాసనసభ్యుడు జోగి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక మంది గౌడ్‌లు ప్రభుత్వ,ప్రతిపక్ష పార్టీల్లోరాజకీయంగాకీలకమైన పదవుల్లో ఉండిపనిచేయటం సంతోషంగా ఉందన్నారు. గౌడ్‌లు ఏపార్టీలో పోటీచేసినా పార్టీలకు అతీతంగా అభ్యర్ధులను గెలిపించాలనికోరారు. రాష్టమ్రంతటా తిరిగి గౌడ్‌సంఘాన్ని తిరుగులేని సంఘంగా తీర్చిదిద్దుతామన్నారు. రేపల్లె శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాదు గౌడ్ మాట్లాడుతూ గౌడ్‌లు అంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాలని కోరారు. ఈకార్యక్రమంలో రాష్టబ్రిసి సంక్షేమసంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు, తెలుగుదేశంపార్టీ రాష్టక్రార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు, రాష్ట్ర తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు దేవరప్రతాప్, రాష్ట్ర తెలుగునాడుగీత సంఘం వర్కింగ్ ప్రసిడెంట్ రేక సుధాకర్‌గౌడ్, ప్రకాశం జిల్లా గౌడసంఘం గౌరవాధ్యక్షుడు సురగాని లక్ష్మికాంతరావు, జిల్లా గౌడ్ సంఘం మాజీ అధ్యక్షుడు పాగోలు శ్రీనివాసరావుగౌడ్, కర్పురపు కోటయ్య, కృష్ణాజిల్లా గౌడసంఘం అధ్యక్షుడు బలగాని సుధాకర్,తాతా జయప్రకాశ్‌నారాయణ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఇదిలా ఉండగా సభలో గౌడ్‌సంక్షేమ సంఘం, కల్లుగీత సంఘం జిల్లానూతనకార్యవర్గప్రమాణాస్వీకారం జరిగింది. ఈకార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి వీరికి కండవులు కప్పి ప్రమాణాస్వీకారం చేయించారు. గౌడ్ సంక్షేమసంఘం నూతన అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు బలగాని ఆంజనేయులు, కీర్తి సాయన్నగౌడ్‌లు నియమితులుకాగా కోశాధికారిగా పాగోలు చింతయ్య, ఉపాధ్యక్షులుగా జంపాని కొండలస్వామితోపాటు మరికొంత మంది కార్యవర్గసభ్యులతో ప్రమాణాస్వీకారంచేయించటం జరిగింది. అదేవిధంగా కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా జంపాని రామచంధ్రరావు,ప్రధానకార్యదర్శిగా గజ్జా వెంకటేశ్వర్లు నియమితులు కాగా కోశాధికారిగా తెల్లపాటి రాఘవ ఇతర కార్యవర్గ సభ్యులు నియమితులయ్యారు. వీరిచేత ఉపముఖ్యమంత్రి ప్రమాణాస్వీకారం చేయించారు.