ప్రకాశం

‘ప్రత్యేక హోదాతోనే నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, ఆగస్టు 2: ప్రత్యేక హోదాతోనే నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం అవుతుందని వైసిపి, సిపిఐ, సిపిఎం నాయకులు స్పష్టం చేశారు. ఎపికి ప్రత్యేక హోదా అందించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా, సిపిఐ, సిపిఎం పార్టీల పిలుపుమేరకు మంగళవారం కందుకూరులో బంద్ పాక్షికంగా జరిగింది. అడుగడుగునా పోలీసులు బంద్‌కు ఆటంకం కలిగిస్తూ పలువురు నాయకులను అరెస్ట్ చేసారు. ఈసందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆయా పార్టీలకు చెందిన నాయకులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని బస్సులను అడ్డుకున్నారు. ఈసందర్భంగా పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో డిపో నుంచి బస్సులు రాకపోకలు ప్రారంభించాయి. ఈసందర్భంగా వైకాపా నాయకులు, సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ, సిపిఎం నాయకులు తదితరులు అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ స్థానిక పోలీస్‌స్టేషన్ ముందు నాయకులు బైఠాయించారు. అనంతరం అరెస్ట్‌చేసిన నాయకులను పోలీసులు విడుదల చేసారు. అనంతరం వైకాపా రాష్ట్ర ప్రచార కార్యదర్శి రామాల సింగారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ, సిపిఎం నాయకులు గౌస్ తదితరుల ఆధ్వర్యంలో ఆయా పార్టీల నాయకులు పట్టణంలో ర్యాలీగా బయలుదేరి వ్యాపార దుకాణాలను, ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించి బంద్ విజయవంతానికి కృషి చేసారు. ఈసందర్భంగా పోస్ట్ఫాస్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో సింగారెడ్డి మాట్లాడుతూ ఎపికి ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్టీలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు ఒనగూరుతాయని ఆయన తెలిపారు. వెంటనే ఏపికి ప్రత్యేక హోదా ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేసారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశంపై కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేలేని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశంపై బంద్ చేపడుతున్న వారిని పోలీసులు చేత అరెస్ట్ చేయించడం దురదృష్టకరమన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో ఎపికి ఐదు సంవత్సరాలు ప్రత్యేకహోదా అంశాన్ని తెరపైకి తేగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి నాయకులు వెంకయ్యనాయుడు 15 సంవత్సరాలు ప్రత్యేకహోదా కల్పించాలని కోరారన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నా ఆయన ప్రత్యేక హోదాపై మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. సిపిఎం నాయకులు జి వెంకటేశ్వర్లు, గౌస్ తదితరులు మాట్లాడుతూ ఏపికి ప్రత్యేకహోదా అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలం అయ్యారన్నారు. ఇప్పటికైనా నాయకులు స్పందించి ఏపికి ప్రత్యేకహోదా తీసుకురావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పివి రమేష్‌యాదవ్, రాష్టయ్రువజన విభాగం నాయకులు జి గంగిరెడ్డి, రఫీ, కె శ్రీనివాసులు, మాల్యాద్రి, ధామస్, సుదర్శి శ్యామ్, అహమ్మద్, కొండయ్య, రాజారెడ్డి, అల్లాభక్షు, వెంకటరామిరెడ్డి, ఖాదర్‌బాషా, కాలేషా, చాంద్‌బాషా, సిపిఐ నాయకులు కె వీరారెడ్డి, వలేటి రాఘవులు, సురేష్, రత్నం, సిపిఎం నాయకులు జివిబి కుమార్, మనోజ, వెంకటరావు, పవన్, రామకోటయ్య, విద్యార్థి సంఘాల నాయకులు యేసురాజు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.