ప్రకాశం

అద్దంకి మేజరు కెనాల్‌కు గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంకి, ఆగస్టు 5: అద్దంకి మేజరు కెనాల్‌కు శుక్రవారం ఉదయం వలపర్ల గ్రామం వద్ద గండి పడడంతో సాగరు జలాలు పొలాల్లోకి వృథాగా పోతున్నాయి. గురువారం సాగరు జలాలు మంచినీటి చెరువులు నింపేందుకు వదిలారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలకు 1400క్యూసెక్కుల సాగరు జలాలు వదిలిన నేపధ్యంలో గుంటూరు జిల్లాకు చెందిన గేట్లు ఎత్తకపోవడంతో రెండు జిల్లాలకు రావాల్సిన సాగరు నీరు ప్రకాశం జిల్లా కెనాల్‌కు వచ్చాయి. ఒక్కసారిగా అధికశాతం నీరు ఓవర్‌ఫ్లో కావడంతో అద్దంకి కెనాల్‌లో మెతకగా ఉన్న చోట గండి పడింది. శుక్రవారం ఉదయం గండి పడిందన్న సమాచారం రావడంతో కలెక్టరు సుజాతశర్మ, టిడిపి తెలుగురైతు అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ హుటాహుటిన గండిపడిన స్థలానికి చేరుకున్నారు. గండిని పూడ్చేందుకు తగిన ఆదేశాలిచ్చారు. ఓవర్‌ఫ్లో కావడం మూలాన గండిని పూడ్చేందుకు వీలుకాలేదు. కాలువకు పడిన గండి క్రమంగా పెరుగుతూ సాగరు జలాలు పొలాల్లోకి వృథాగా పోతున్నాయి. గండికి సమీపంలో మట్టిని తరలించారు. బల్లికురవ గ్రానైట్ కంపెనీల వద్ద రాళ్లను ట్రాక్టర్లు, లారీల ద్వారా తరలించి గండిని పూడ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శనివారం మధ్యాహ్నానికి గండి పూర్తిస్థాయిలో పూడ్చేందుకు అవకాశం ఉంది. మంచినీటి చెరువులు నింపాల్సిన సాగరు జలాలు గండి కారణంగా పొలాల్లోకి చేరాయి. ఎన్‌ఎస్‌పి అధికారులు, సమీప గ్రామాల ప్రజలు కాలువ గండిని పూడ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. కరణం బలరాం సాయంత్రం వరకు ఉండి గండిని పూడ్పించేందుకు కృషి చేశారు.