ప్రకాశం

భరత్‌కు మద్దతుగా భారీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, ఆగస్టు 18: విధులకు ఆటంకం కలిగించిన కేసులో దర్శి సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న పర్చూరు నియోజకవర్గ వైకాపా ఇన్‌చార్జి, జిల్లా వైకాపా యువజన విభాగం అధ్యక్షులు గొట్టిపాటి భరత్ గురువారం బెయిల్‌పై విడుదల అయిన సందర్భంగా మద్దతుదారులు ఆయనకు భారీ స్వాగత ర్యాలీ నిర్వహించారు. సుమారు 200 వాహనాల్లో తరలివచ్చిన కార్యకర్తలు ఆయన్ను ఊరేగింపుగా నియోజకవర్గానికి తీసుకెళ్లారు. విడుదలైన వెంటనే దర్శి గడియార స్తంభం సెంటర్‌లో వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి భరత్ నివాళులు అర్పించారు. అనంతరం దర్శి నుండి ర్యాలీగా తరలివెళ్లారు.
అద్దంకిలో...
అద్దంకి: నేరం చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేస్తే, కృష్ణా పుష్కరాలకు వెళ్లే ప్రజలకు ఇబ్బంది కలిగించారంటూ తనను అరెస్టు చేసి జైలుకు పంపించారని, గత సంవత్సరం జరిగిన గోదావరి పుష్కరాల్లో పలువురి మృతికి కారణమైన సిఎం చంద్రబాబునాయుడుపై కనీసం చార్జిషీటు కూడా దాఖలు చేయలేదేమని పర్చూరు వైసిపి ఇన్‌చార్జి గొట్టిపాటి భరత్ ప్రశ్నించారు. మార్టూరు మండలం నాగరాజుపల్లిలో వారం రోజుల క్రితం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో వైసిపికి చెందిన వారిపై టిడిపికి చెందిన వారు దాడి చేసి తీవ్రంగా కొట్టారని, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు వారిని అరెస్టు చేయలేదంటూ గత శనివారం గొట్టిపాటి భరత్ మార్టూరులో రాస్తారోకో చేశారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడం వలన కృష్ణా పుష్కరాలకు వెళ్లే ప్రజలకు ఇబ్బందులు కలిగించారంటూ పోలీసులు భరత్‌పై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచగా రిమాండ్‌కు తరలించారు. గురువారం దర్శి సబ్‌జైలు నుండి భరత్ బెయిల్‌పై విడుదలయ్యారు. దర్శి నుండి అద్దంకి మీదగా మార్టూరు వరకు భరత్ అభిమానులు, వైసిపి కార్యకర్తలు భారీ ర్యాలీ ప్రదర్శనగా వెళ్లారు. అద్దంకి భవానిసెంటర్‌లో స్థానిక పోలీసులు అద్దంకి స్టేషన్‌లో సంతకం చేయించుకొని భరత్‌ను పంపించారు. ఈసందర్భంగా భరత్ విలేఖర్లతో మాట్లాడుతూ ఒక వర్గంవారిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరచి గ్రామాల్లో తిరుగుతున్నారని, వారిని అరెస్టు చేయకుండా, అరెస్టు చేయమన్నందుకు తనపై కేసులు బనాయించి జైలుకు పంపించారన్నారు. తాను చేసిన రాస్తారోకో సందర్భంగా పుష్కరాలకు వెళ్లే ప్రజలు కొద్దిసేపు మాత్రమే ఇబ్బందులుకు గురై ఉంటారని, కాని గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు చేసిన పనికి పలువురు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆయనపై నేటివరకు ఎలాంటి కేసులుగాని, చార్జిషీటులుగాని లేవన్నారు. ప్రతిపక్షానికి చెందిన వారిపై టిడిపి వారు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, దీనిని రాష్ట్రప్రజలంతా చూస్తున్నారన్నారు. ప్రజలకోసం పనిచేసే వారికి జైలుకుపోవడం లాంటివితప్పదని, ఇలాంటి వాటికి బెదిరిపోయే వాడిని కానన్నారు. అనంతరం ర్యాలీగా మార్టూరుకు తరలివెళ్లారు.
ముండ్లమూరులో...
ముండ్లమూరు: ముండ్లమూరులోని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పర్చూరు నియోజకవర్గ వైకాపా ఇన్‌చార్జి గొట్టిపాటి భరత్ గురువారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇటీవల మార్టూరు వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో గొట్టిపాటి భరత్‌ను పోలీసులు అరెస్ట్‌చేసి అనంతరం అద్దంకి కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. గురువారం బెయిల్ మంజూరు కావడంతో దర్శి నుండి వస్తూ మార్గమధ్యంలోని ముండ్లమూరులోని వైఎస్ విగ్రహానికి భరత్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట మండల వైకాపా కన్వీనర్ అంజయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కారంచేడులో...
కారంచేడు: పర్చూరు నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సిపి ఇన్‌చార్జి గొట్టిపాటి భరత్ విడుదల పట్ల మండలంలోని అభిమానులు, వైకాపా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండలం నుంచి సుమారు 40 వాహనాల్లో 400 మంది నాయకులు, కార్యకర్తలు దర్శికి తరలివెళ్లారు. మండలంలోని అన్ని వాహనాలు ప్రదర్శనగా నినాదాలు చేసుకుంటూ దర్శికి బయలుదేరి వెళ్లాయి. జైలు నుంచి విడుదల అయిన అనంతరం ఆయన వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించినట్లు వైకాపా రాష్ట్ర కార్యదర్శి జువ్వా శ్రీనివాసరావు తెలిపారు. దర్శికి తరలివెళ్లిన వారిలో దండా చౌదరి, కె అనీల్, యార్లగడ్డ పాపారావు, శ్రీకాంత్, ప్రసాద్ తదితరులు ఉన్నారు.