ప్రకాశం

బస్సు, లారీ ఢీ 24మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగరాయకొండ, ఆగస్టు 20: జాతీయ రహదారిపై ఒంగోలు వెళుతున్న లారీని బస్సు వెనుక నుంచి ఢీ కొట్టడంతో బస్సులోని 24మంది ప్రయాణికులు గాయాలు పాలైన సంఘటన శుక్రవారం అర్థరాత్రి కలికవాయి రోడ్డు సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న సూపర్ లగ్జరీ ఆర్టీసి బస్సు సింగరాయకొండ కలికవాయి రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై ముందు వెళుతున్న ట్రాలీ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 24మంది ప్రయాణికులకు గాయాలైయ్యాయి. సమాచారం అందుకున్న సింగరాయకొండ ఎస్‌ఐ వైవి రమణయ్య సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 సహాయంతో ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. అయితే బస్సులో మొత్తం 36మంది ప్రయాణిస్తుండగా వారిలో 18మంది నెల్లూరుకు చెందినవారు, మిగిలిన వారు తిరుపతికి ప్రయాణిస్తున్నట్లు కండక్టర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ప్రకాశం పంతులు జయంతి ఉత్సవాలను
ఘనంగా నిర్వహించాలి
జాయింట్ కలెక్టర్
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఆగస్టు 20: మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 145వ జయంతి ఉత్సవాలను ఈనెల 23న జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్ అధికారులను ఆదేశించారు. శనివారం తన ఛాంబర్‌లో ప్రకాశం పంతులు 145వ జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం పంతులు జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించిందన్నారు. ఈ నేపధ్యంలో ఈనెల 23వతేదీ మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి ప్రకాశం భవనంలో ఉత్సవాలను నిర్వహించాలన్నారు. అనంతరం ఒంగోలు మండలం దేవరంపాడు విజయం స్థూపం వద్ద, నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెం పాఠశాల వద్ద ప్రకాశంపంతులు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 23వతేదీ ప్రకాశం భవనంలో జరిగే కార్యక్రమాలకు ఒంగోలు రెవిన్యూ డివిజనల్ అధికారి, తహశీల్దార్లు, జిల్లా విద్యాశాఖాధికారి పర్యవేక్షించాలన్నారు. ప్రకాశం భవనంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఒంగోలు విద్యాశాఖాధికారి ఏర్పాటుచేయాలన్నారు. ప్రకాశం భవనంలో ప్రకాశం పంతులు కాంస్య విగ్రహాన్ని శుభ్రంచేసి కార్యక్రమం వద్ద తాగునీటి ఏర్పాటుచేయాల్సిందిగా ఒంగోలు నగరపాలక ఇన్‌చార్జి కమిషనర్‌ను ఆదేశించారు. నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెంలో జరిగే కార్యక్రమాల ఏర్పాట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల విద్యాశాఖాధికారి, తహశీల్దార్ చూడాలన్నారు. ఒంగోలు మండలం దేవరంపాడు వద్ద జరిగే కార్యక్రమాల ఏర్పాట్లను ఒంగోలు తహశీల్దారు, మండల పరిషత్ అభివృద్ధి అదికారి, విద్యాశాఖ డిప్యూటీ డిఇఒ చూడాలన్నారు.. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

ప్రత్యేకహోదా విషయంలో ఎపికి మొండిచేయి
సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గసభ్యుడు శ్రీనివాసరావు
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,ఆగస్టు 20:రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేవిషయంలో కేంద్రప్రభుత్వం మొండిచేయి చూపిస్తుందని సిపిఎం కేంద్రకార్యదర్శివర్గసభ్యుడు వి శ్రీనివాసరావు విమర్శించారు. ప్రత్యేకహోదా కోసం టిడిపి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తడి తీసుకురాకుండా నాన్చుడి ధోరణితో ఎపి ప్రజలను మోసం చేస్తుందని దుయ్యబట్టారు. సిపిఎం జిల్లాకమిటీ సమావేశం శనివారం సుందరయ్యభవన్‌లో జరిగింది. సిపిఎం రాష్టక్రమిటీ సభ్యుడు జాలా అంజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్టవ్రిభజన అనంతరం ఎపి అన్నివిధాలుగా దెబ్బతిందన్నారు. ఎంపికి ప్రత్యేకహోదా ఇచ్చి ఆదుకుంటామని, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజి ఇస్తామని, పోలవరంప్రాజెక్టు,రాజధాని నిర్మాణాలకు సహాయం అందిస్తామని చెప్పిన బిజెపి నేడు మాటమార్చి ఆర్థిక సహకారానికే పరిమితం చేస్తుందని విమర్శించారు. కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన రెండుసంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలు అమలుచేయకపోగా ప్రజాసమస్యలపై నిర్లక్ష్య ధోరణి ఉండటంతో ప్రజల్లో టిడిపి, బిజెపి ప్రభుత్వాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్షాలు ఇచ్చిన బంద్‌కు ప్రజల నుండి వచ్చన స్పందనతో కేంద్రం ఎపికి అది చేస్తాం, ఇది చేస్తామంటూ ప్రకటనలు, హడావుడి చేస్తుందని దుయ్యబట్టారు. నేటికి కూడాప్రత్యేకహోదాపై ఏలాంటి ప్రకటన చేయకుండా ప్యాకేజితోనే సరిపెట్టేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ప్రత్యేకహోదా చర్చను పక్కదారి పట్టించేందుకు కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. గోరక్షణ పేరుతో దళితులపై దాడులకు దిగడటం వంటి చర్యలకు పాల్పడున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రత్యేకహోదా ఇచ్చేందుకు కేంద్రం ప్రకటన చేయాలని, ఆదిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టిడిపి ప్రభుత్వం నాన్చుడు ధోరణిని విడనాడి ప్రత్యేకహోదా కోసం కేంద్రంతో పోరాడాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్టక్రార్యదర్శివర్గసభ్యుడు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల్లో తీవ్రమైన కరవు ఏర్పడిందన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లాకార్యదర్శి పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాల చేపట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లానాయకులు ఎం కోటయ్య, జివికొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.