ప్రకాశం

ప్యాకేజి అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,సెప్టెంబర్ 9:కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అద్భుతమైన ప్యాకేజి ప్రకటించిందని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లాపార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం అధికారంలో వచ్చి 27నెలలు పూర్తయిందని ఈ కాలంలో రాష్ట్రానికి సంబంధించి లక్షా 41వేల కోట్లరూపాయలు నిధులు సమకూర్చిందని, రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజి పేరుతో రెండులక్షల 25వేలకోట్లరూపాయల నిధులను ఇచ్చేందుకు సంసిద్ధమైందన్నారు. ప్రత్యేక ప్యాకేజికి స్వాగతం పలకాల్సిన ప్రతిపక్ష నాయకులు కేవలం ఆ పార్టీల మనుగడ కోసం ప్రత్యేకహోదాపై రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆనాటి యుపిఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసారన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ప్రత్యేకహోదా ఉన్నప్పటికీ ఆ రాష్ట్రాలకు నిధులు 64వేల కోట్లరూపాయలు మాత్రమే విడుదలయ్యాయన్నారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని 14వ ఆర్థిక సంఘం నివేదిక చెప్పిన తరువాతనే రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాదని తేలిపోయిందన్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడని అలాంటి ప్రాజెక్టును కేంద్రప్రభుత్వమే పూర్తిచేస్తుందన్నారు. లక్షలకోట్లరూపాయలు కుంభకోణాలకు పాల్పడి ఇతర పార్టీల్లో చేరిన నాయకులు విమర్శలు చేయటం అర్ధరహితమన్నారు. కేవలం అభివృద్దిని చూసి ఓర్వలేకనే బిజెపిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధానికి నిధులతోపాటు కేంద్రవిద్యాసంస్ధలను, సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు కేంద్రం ముందుకువచ్చిందన్నారు. జిల్లా అన్ని రంగాల్లో వెనకబడి ఉందని అలాంటి జిల్లాలో రామాయపట్నంపోర్టుతోపాటు వెలుగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలని కేంద్రానికి విజ్ఞప్తిచేశామన్నారు. జిల్లాలో 11వేల హెక్టార్లల్లో నిమ్మ, బత్తాయితోటలను రైతులు సాగుచేస్తారని గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాటికి సంబంధించిన ఆధారపరిశ్రమలు లేకపోవటం నష్టాలకు కారణమన్నారు. 2500కోట్లరూపాయల వ్యాపారం జరుగుతుందని త్వరలో పరిశ్రమలు ఏర్పాటుచేసి రైతులను ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తిచేశామన్నారు. రాష్ట్భ్రావృద్ధి బిజెపితోనే సాధ్యవౌతుందని వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించుకుని రాష్ట్భ్రావృద్ధికి ప్రభుత్వం సహకరించాలన్నారు. ప్రత్యేకహోదాపై ప్రతిపక్షాలకు పనిలేకనే పోరాటాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ విలేఖర్ల సమావేశంలో బిజెపి రాష్టన్రాయకులు బత్తిన నరసింహరావు, కనమాల రాఘవులు, ఖలీఫాతుల్లా భాషా, జిల్లాపార్టీ ప్రధానకార్యదర్శి విన్నకోట సురేష్ పాల్గొన్నారు.