ప్రకాశం

పదవులపై ఉన్న ప్రేమ పార్టీ పటిష్టతపై లేదా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, సెప్టెంబర్ 13: తెలుగుదేశంపార్టీ కార్యకర్తల కష్టంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలో పదవులు పొందిన నేతలు పార్టీ గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గంలో టిడిపి అధికారంలోనికి వచ్చిన ఆరునెలల నుంచే పార్టీలో అంతర్గత విభేదాలు ఏర్పడి రెండు వర్గాలుగా చీలి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ విషయంపై ఒక వర్గం ముఖ్యమంత్రి తనయుడు లోకేష్‌తోపాటు జిల్లామంత్రికి, జిల్లాపార్టీ అధ్యక్షులకు తెలిపినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తూ ఊరుకోవడంతో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. గిద్దలూరు నియోజకవర్గంలో అన్నా రాంబాబు ఇన్‌ఛార్జిగా ఉన్నంతకాలం అక్కడ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి టిడిపి తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి రెండువర్గాలుగా ఏర్పడి అధికారుల బదిలీల విషయంలో రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. యర్రగొండపాలెం నియోజకవర్గంలో దళిత నేత లేకపోవడంతో త్రిసభ్య కమిటీని వేసి పార్టీని నడిపేందుకు అధిష్ఠానవర్గం చర్యలు తీసుకుంది. అప్పట్లో వారు ముగ్గురు ఎవరికివారే యమున తీరులా తయారు కావడంతో ఇదే సమయంలో వైకాపా నుంచి గెలిచిన ఎమ్మెల్యే డేవిడ్‌రాజు టిడిపి తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ ప్రస్తుతం పైకి కనిపించకుండా సమస్యలు ఏమి లేవన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ త్రిసభ్య కమిటీ చేసిన కొన్ని ప్రతిపాదనలు తారుమారు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఈమూడు నియోజకవర్గాలపై అధిష్ఠానం దృష్టి సారించి అసమ్మతివాదులను బుజ్జగించి పార్టీ క్యాడర్‌నంతా ఒకే తాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేకుంటే 2009 ఎన్నికల్లో ఏ ఫలితాలు వచ్చాయో అదే ఫలితాలు 2019లో వచ్చే అవకాశాలు ఉన్నాయని కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు వాపోతున్నారు.