ప్రకాశం

చంద్రన్న బీమాతో కార్మికులకు భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు , అక్టోబర్ 2 : పేదవారైన అసంఘటితరంగ కార్మికులకు, వారి కుటుంబాలకు భరోసా కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న బీమా పథకాన్ని రూపొందించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ ఇన్‌చార్జి మంత్రి రావెల కిశోర్‌బాబు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక బచ్చల బాలయ్య కల్యాణ మండపంలో జిల్లాలో చంద్రన్న బీమా పథకాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి రావెల కిశోర్‌బాబు మాట్లాడుతూ ఆర్థికంగా చితికిపోతున్న కార్మిక బతుకులకు చంద్రన్న బీమా పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. భవన, ఇతర నిర్మాణ రంగాల్లోని కార్మికులు, వ్యవసాయ అనుబంధ ఉపాధి చెందినవారు, చేతివృత్తులకు చెందినవారు, స్వయం ఉపాధి కార్మికులు, సేవా రంగ కార్మికులు, ప్రభుత్వ పథకాల్లో పనిచేసే వారు, హమాలీలు, రవాణా కార్మికులు, దుకాణాల్లో, సంస్థల్లో, ఫ్యాక్టరీల్లో పనిచేసే వారందరూ చంద్రన్న బీమా పథకంలో పేరు నమోదుచేసుకొని కుటుంబాలకు భరోసా కల్పించుకోవాలని సూచించారు. అసంఘటిత రంగ కార్మికులు కేవలం 15 రూపాయలు మాత్రమే సర్వీసు చార్జి కింద కట్టాల్సి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కింద 135 రూపాయలు చెల్లిస్తుందని మంత్రి వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 10 లక్షల 36వేల మంది చంద్రన్న బీమా పథకంలో నమోదు అయ్యారని తెలిపారు. తమ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమని తెలిపారు. పేదవారికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించాలన్న ద్రుఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కార్మికులు కష్టాలు, బాధల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి చంద్రన్న బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులకు ప్రమాదం సంభవించినప్పుడు, మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చంద్రన్న బీమా పథకం చేపట్టారని తెలిపారు. జిల్లాలో సామాజిక పెన్షన్ల కోసం సుమారు 36 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. కొండేపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రెండు కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికుల కోసం చంద్రన్న బీమా పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. నెలకు 15 వేలు ఆదాయం కలిగిన అసంఘటిత రంగ కార్మికుల కుటుంబాలు నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. అసంఘటిత కార్మికులకు ప్రమాదవశాత్తు మరణం, పూర్తి అంగవైకల్యం ఏర్పడిన సందర్భంలో 5లక్షల రూపాయలు, పాక్షిక అంగవైకల్యం కలిగితే 3లక్షల 62వేల 500 రూపాయలు, సహజ మరణానికి 30వేల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. 9, 10వ తరగతి, ఇంటర్, ఐటిఐ చదువుతున్న అసంఘటిత కార్మికరంగ పిల్లలకు (ఇద్దరికి మించకుండా) సంవత్సరానికి ఒక్కొక్కరికి 1200 రూపాయల చొప్పున ఉపకార వేతనం ఈ పథకం ద్వారా అందించనున్నట్లు ఆయన వివరించారు. వై.పాలెం ఎమ్మెల్యే పి డేవిడ్‌రాజు మాట్లాడుతూ పేద వర్గాల ప్రజల సంక్షేమం కోసం చంద్రన్న బీమా పథకం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహార్‌లాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంచి సంకల్పం, తలంపుతో చంద్రన్న బీమా పథకం ప్రవేశపెట్టారని, అసంఘటిత రంగ కార్మికులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాం, బిఎన్ విజయ్‌కుమార్, కందుల నారాయణరెడ్డి పాల్గొని మాట్లాడారు. తొలుత గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, సంయుక్త కలెక్టర్, జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం చంద్రన్న బీమా పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు మంత్రి రావెల చేతుల మీదుగా చంద్రన్న బీమా పథకం బాండ్‌లను పంపిణీ చేశారు. లబ్ధిదారులు ఎ లక్ష్మీరాజ్యం, డి కుమారి, ఎండి గౌసియాబేగం చంద్రన్న బీమా పథకం ద్వారా లబ్థిపొందినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్‌వో నర్సింగరావు, ఒంగోలు ఆర్డీవో కె శ్రీనివాసరావు, కార్మిక శాఖ ఉప కమిషనర్ ఏసుదాసు, డిఆర్‌డిఏ, డ్వామా, మెప్మా, హౌసింగ్ పిడిలు మురళి, పోలప్ప, అన్నపూర్ణ, ధనుంజయుడు, సెప్టప్ సిఇవో బి రవి, సర్పంచుల సంఘం అధ్యక్షులు పి వెంకట్రావు, ప్రేమానందం, ఒంగోలు తహశీల్దార్ శ్రీకాంత్ , ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.