ప్రకాశం

చిత్రహింసలా..? గుండెపోటా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, నవంబర్ 6: డివిజన్‌లోని రాచర్ల పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన వీరాంజనేయులు (35) మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్టేషన్‌కు వీరాంజనేయును పిలిపించి చిత్రహింసలు పెట్టడం వలనే చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తుండగా పోలీసులు మాత్రం స్టేషన్‌కు తీసుకువచ్చిన మాట వాస్తవమేనని, అనారోగ్యంతో ఉండటం గుర్తించి బంధువులకు ఫోన్ చేయడంతో వచ్చి తీసుకువెళ్ళారని, ప్రైవేటు వైద్యశాలలో మృతిచెందాడని చెబుతున్నారు. రాచర్ల మండలం కలువపల్లెకు చెందిన వీరాంజనేయులు తన వదినతో అక్రమ సంబంధం నెరుపుతున్నాడని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం సాయంత్రం పోలీసులు మృతుడిని పిలిపించారు. అయితే ఆదివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బంధువులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు వైద్యుని వద్దకు తీసుకువెళ్ళగా గిద్దలూరు తీసుకువెళ్ళాలని సలహా ఇవ్వడంతో అక్కడికి తరలించారు. కాగా, వైద్యశాలలో చేర్చి వైద్యులు వచ్చి చూసేలోపే మృతి చెంది ఉండటంతో వీరాంజనేయులు మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో బంధువులు వీరాంజనేయులును పోలీసులు తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురిచేయడం వలనే మృతి చెందాడని ఆరోపిస్తుండగా, మార్కాపురం డివైఎస్పీ ఆర్ శ్రీహరిబాబు మాట్లాడుతూ వీరాంజనేయులుకు వదినతో అక్రమ సంబంధం ఉన్న విషయాన్ని సోదరుడు రాచర్ల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని, విచారణ కోసం పిలిపించగా అర్థరాత్రి సమయంలో ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి వైద్యం అందించేందుకు వైద్యశాలకు తీసుకువెళ్ళాల్సిందిగా చెప్పడంతో తీసుకువెళ్ళారని, అనంతరం ఏమి జరిగిందో తమకు కూడా తెలియదని తెలిపారు. విషయం తెలుసుకున్న కొందరు రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని బాధితుడి కుటుంబానికి 2లక్షల రూపాయల మేర సాయం అందించడంతోపాటు శాసనసభ్యుని ద్వారా ఆపద్బంధు పథకం వర్తింప చేయడంతోపాటు నివాసస్థలాన్ని కూడా ఇప్పిస్తామని హామీ ఇచ్చి వివాదాన్ని పరిష్కరించినట్లు సమాచారం.