ప్రకాశం

అంబేద్కర్ చిరస్మరణీయుడు:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,డిసెంబర్ 6:ప్రపంచంలోనే గొప్పదైన భారతరాజ్యాంగాన్ని రచించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ కొనియాడారు. మంగళవారం అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా నగరంలోని హెచ్‌సిఎం జూనియర్ కాలేజి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ సుజాతశర్మ, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్,జిల్లా జాయింట్‌కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ విలేఖర్లతో మాట్లాడుతూ దేశంలో ప్రతిపౌరుడికి గౌరవప్రదమైన జీవనం, స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా నవభారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ తయారుచేశారన్నారు. ఆయన జీవితం, సందేశం నేటి యువతరానికి స్పూర్తిదాయకం కావాలన్నారు. ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ ఎంతో ముందుచూపుతో భారతరాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ మహానుభావున్ని స్మరించుకుంటూ రాజ్యాంగస్పూర్తితో అందరూ ముందుకువెళ్ళాలన్నారు. అణగారిన ప్రజల ఆశాజ్యోతి అంబేద్కర్ అని కీర్తించారు. ప్రజాస్వామ్య పంధాలో ఆర్ధిక, సామాజిక, రాజకీయ, సమానత్వం కోసం నైతిక విలువలతో కూడిన శాంతియుత జీవనం కోసం ఆయన ఎంతగానో కృషిచేశారన్నారు. రాష్ట్రప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పధకాలు అమలుచేస్తోందని, ముఖ్యంగా గృహనిర్మాణం చేపడుతుందన్నారు. అన్ని నియోజకవర్గాలు, కాలనీల్లో ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు, విద్యుత్, రహదారులువంటి వౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ది పరుస్తున్నామన్నారు. ఎస్‌సి,ఎస్‌టి ఉపప్రణాళిక నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, పలువురి అభ్యున్నతికి అర్ధికసహాయం అందిస్తున్నామన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనదిశగా ఆయన అడుగుజాడల్లో నడుస్తామన్నారు. ఈకార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.