ప్రకాశం

భూముల ఆన్‌లైన్ కోసం రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిపురాంతకం, డిసెంబర్ 6: దేశానికి వెనె్నముక అయిన రైతులను భూముల ఆన్‌లైన్ కోసం కార్యాలయాల చుట్టు తిప్పుకోవద్దని యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు ఆదేశించారు. మంగళవారం మార్కాపురం ఆర్డీఓ కె చంద్రశేఖరరావు అధ్యక్షతన తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే డేవిడ్‌రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ రైతులకు ఉన్న భూములు ఆన్‌లైన్ చేసేందుకు విఆర్‌ఓలు, మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లు, ఎంఆర్‌ఐలు, కంప్యూటర్ ఆపరేటర్లు తరచూ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని తన దృష్టికి వచ్చిందని, అలా తిప్పుకోవడం మంచిది కాదని, అర్జీకి పరిష్కారం చూపించాలని సూచించారు. ఆర్డీఓ చంద్రశేఖరరావు మాట్లాడుతూ రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు విఆర్‌ఓలు రిజిష్టర్‌లో నమోదు చేసుకొని మండల తహశీల్దార్ కార్యాలయంలో అందచేయాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ నిమ్మరాజు వెంకటేశ్వర్లు, ఎంఆర్‌ఐ నరసింహారావు, విఆర్‌ఓలు, రెవెన్యూ సిబ్బంది, మండల టిడిపి కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, నీలం శామ్యూల్‌జాన్, న్యాయవాది సీతారామయ్య, దేవినేని చలమయ్య, ఆళ్ళ నాసర్‌రెడ్డి, మాజీఎంపిపిలు వెంకటేశ్వరరావు, జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి మాటలను దళితులు నమ్మరు :సిపిఐ
ఒంగోలు, డిసెంబర్ 6: ఒక నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ని అంటరాని వ్యక్తిగా భావించిన బిజెపి ఈనాడు అంబేద్కర్ జపం చేసినప్పటికీ మీ మాటలను దళితులు నమ్మరని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎంఎల్ నారాయణ విమర్శించారు. ఎపి వ్యవసాయ కార్మిక సంఘం (బికెఎంయు) జాతీయ సమితి పిలుపు మేరకు మంగళవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద సమితి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ నోట్ల రద్దుతో దేశంలో ఆర్ధిక ఎమర్జెన్సీ సృష్టించి దేశంలోని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రావు మాట్లాడుతూ జన్మభూమి కమిటీ ల పేరుతో అభివృద్ధిని అడుకుంటున్నట్లు విమర్శించారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి జన్మభూమి కమిటీలకు పెత్తనం అప్పగించడం రాజ్యాంగ విరుద్దమన్నారు. సిపిఐ జిల్లా మాజీ కార్యాదర్శి యం వెంకయ్య మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ సూత్రాలను అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైయిందన్నారు. డిహెచ్‌పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కరవది సుబ్బారావు మాట్లాడుతూ బిజెపి పాలనలో దేశంలోని దళితులు, మైనార్టీలకు రక్షణ కరవైందని విమర్శించారు. అంబేద్కర్‌కి 125 అడుగుల విగ్రహాలను నిర్మిస్తామని ప్రధాని మోది, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబులు మాయమాటలు చెబుతూ దళితులను మోసం చేస్తున్నట్లు ఆయన విమర్శించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్‌డి వౌలాలి అధ్యక్షత వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎస్‌డి సర్ధార్, వ్యసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శులు పి బాలకోటయ్య, గద్దల రవి, ఉపాధ్యక్షులు చినిగే సుబ్బారావు, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మస్తాన్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు డి ఆంజయ్య, డిహెపియస్ జిల్లా కార్యదర్శి నక్కల శ్రీను, ఉపాధ్యక్షులు డి రత్నం, సిపిఐ జిల్లాసమితి సభ్యులు ఆర్ రామకృష్ణ, ఎఐవైఫ్ జిల్లా కార్యదర్శులు రవి, గులాం హుస్సేన్, అధ్యక్షులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.