ప్రకాశం

ప్రజల్లోకి వెళ్లకపోతే మీకు నష్టం,పార్టీకి నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,డిసెంబర్ 6:జిల్లాలోని శాసనసభ్యులు, ఇన్‌చార్జులు ప్రజల్లోకి వెళ్ళాలని, ఆ విధంగా చేయకుండా షో చేస్తే మీకు నష్టం,పార్టీకి నష్టమని జిల్లాలోని పార్టీముఖ్యశ్రేణులకు హితబోధచేస్తూనే మరోకపక్క చురకలంటించారు. గడపగడపకు వైకాపా కార్యక్రమం జిల్లాలో ఏవిధంగా జరిగిందన్న అంశంపై వైకాపా రాష్ట్రఅధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ముఖ్యనేతలతో హైదరాబాదులోని లోటస్‌పాండ్‌లో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కడప, నెల్లూరు జిల్లాల ముఖ్యనేతలతో జరిగిన తరువాత ప్రకాశం ముఖ్యనేతలతో మధ్యాహ్నం 12.30గంటలకు సమావేశాన్ని జగన్ నిర్వహించి 1.30గంటలకు ముగించారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఒకగంటపాటు జిల్లాలోని నేతలకు ఒకపక్క దశ,దిశానిర్ధేశం చేస్తూనే మరోకపక్క రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిపెట్టుకుని వ్యవహరించాలని ఆ విధంగా చేయకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని పార్టీ నేతలకు సూచించారు. పార్టీబాగుంటే మీరు బాగుంటరాని అందువలన రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి పార్టీని పురోభివృద్ధి బాటలో పయనింపచేయాలన్నారు. ప్రధానంగా గడపగడపవైకాపా కార్యక్రమంపై జగన్ అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు, ఇన్‌చార్జులతో చర్చించారు. గడపగడపకు వైకాపా కార్యక్రమంలో ఎన్నిగ్రామాలు పర్యటించారు, ఏవేమి సమస్యలు వచ్చాయంటూ నిశితంగా జగన్ నేతలతో చర్చించినట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో సీట్లు కావాలంటే ప్రజల్లో మమేకం కావాల్సిందేనని ఆయన హితబోధ చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితాలో ఓటర్లను చేర్పించాలని జగన్ పార్టీశ్రేణులకు ఆదేశాలు జారీచేశారు.
రాష్ట్రప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తునే తాము ఎంచేస్తున్నామనే విషయాలను కూడా ప్రజలకు వివరించాలని జగన్ ఆదేశించారు.
ఇదిలాఉండగా ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు జరగకపోవటంతో రాష్టవ్య్రాప్తంగా జగన్ ఆందోళన బాట పట్టారు. ఈనేపధ్యంలో ఈనెల 9న జిల్లాకలెక్టరేట్ వద్ద జరిగే మహాధర్నాలో జగన్ పాల్గొననున్నారు. ఆమేరకు జిల్లాపార్టీనేతలకు తాను వస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. మొత్తంమీద రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ ప్రసంగం సాగింది. దీంతో ప్రజలతో మమేకం కాని శాసనసభ్యులు, ఇన్‌చార్జులకు టిక్కెట్లు వస్తాయో రావో అన్న సందిగ్ధపరిస్ధితి నేతల్లో నెలకొంది. కాగా ఈసమావేశానికి ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి హాజరుకాలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిచెందటంతో ఆయన అక్కడికి వెళ్ళారు. దీంతో ఆయన సమావేశానికి హాజరుకాలేదు.
ఈసమావేశంలో వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, మార్కాపురం, యర్రగొండపాలెం శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్, ఇన్‌చార్జులు బూచేపల్లి శివప్రసాదురెడ్డి,బాచిన చెంచుగరటయ్య, యడం బాలాజి, గొట్టిపాటి భరత్, తూమాటి మాధవరావు, బి మధుసూదన్‌రావు, ఐవిరెడ్డి, వరికూటి అశోక్‌బాబుతోపాటు తదితరులు పాల్గొన్నారు.