ప్రకాశం

అంబరాన్నంటిన సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జనవరి 1:జిల్లాలోని ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. శనివారం అర్ధరాత్రి 12గంటల నుండి ఆదివారం సాయంత్రం వరకు నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు మునిగితేలారు.ప్రధానంగా అర్ధరాత్రి 12గంటల సమయంలో 2016సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2017 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువత జోష్ చేసింది. జిల్లావ్యాప్తంగా మద్యం షాపులన్నీ మందుబాబులతో కిటకిటలాడాయి. అదేవిధంగా ఆదివారం కూడా మద్యం బార్లు అన్ని కిక్కిరిసిపోయాయి. నూతనసంవత్సరం సందర్భంగా మిఠాయిలు, కేక్‌లను భారీగా కొనుగోలు చేశారు. జిల్లాలోని పలుప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వాహకులు నిర్వహించారు. జిల్లాలోని ప్రముఖ దేవాలయాలన్ని విద్యుత్‌కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందాయి. అర్ధరాత్రి 12గంటల సమయంలో భక్తుల సౌకర్యార్ధం దేవాలయాను తెరిచి ఉంచారు. ఆ సమయంలో నూతన సంవత్సరంలో అంతా శుభాలు కలగాలని కోరుకుంటూ భక్తులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఇదిలా ఉండగా జిల్లావ్యాప్తంగా రాజకీయ నాయకులు, అధికారులతోపాటు ఇతర ప్రముఖులు భారీగా కేక్‌లను కట్‌చేసి అభిమానులకు పంచిపెట్టారు. రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు తన కార్యాలయంలో భారీకేక్‌ను కట్‌చేసి అభిమానులకు పంచిపెట్టారు.దర్శి నియోజకవర్గ ప్రజలే కాకుండా జిల్లాలోని నలుమూలల నుండి తెలుగుతమ్ముళ్లు వచ్చి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి తన కార్యాలయంలో భారీకేక్‌ను కట్‌చేశారు. ఈసందర్బంగా మాగుంట కార్యాలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేశారు.జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ స్థానిక జిల్లా తెలుగుదేశంపార్టీకార్యాలయ ఆవరణలోను, తన నివాసంలోను భారీకేక్‌లను కట్‌చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలనుండి నేతలు వచ్చి దామచర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి తన కార్యాలయంలో అభిమానులు ఏర్పాటుచేసిన భారీకేక్‌ను కట్‌చేసి అందరికి పంచిపెట్టారు. అదేవిధంగా ఒంగోలులోని పలుప్రాంతాల్లో సుబ్బారెడ్డి అభిమానులు భారీ ప్లెక్సీలను ఏర్పాటుచేసి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు పార్లమెంటునియోజకవర్గ పరిధిలోని నాయకులే కాకుండా జిల్లాలోని వైకాపాకు చెందిన ముఖ్యనేతలందరూ వైవిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాగా వైకాపా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనకార్యాలయంలో భారీకేక్ కట్‌చేశారు.అదేవిధంగా జిల్లాలోని అధికారులు, అనధికారులు సైతం కేక్‌లను కట్‌చేసి అందరికి పంచిపెట్టారు. అదేవిధంగా రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి తన నివాసంలో భారీకేక్‌ను కట్‌చేశారు.కాగా బిజెపి జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి కూడా పార్టీకార్యాలయంలో భారీకేక్‌ను కట్‌చేసి పార్టీశ్రేణులకు పంచిపెట్టారు.