ప్రకాశం

నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, జనవరి 3: తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపిస్తే నిరుద్యోగుల ఉపాధి కల్పనకు కృషి చేస్తానని, ప్రైవేటు అధ్యాపకులకు ఉద్యోగ భద్రత, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా వంటి అంశాలపై పోరాడతానని టిడిపి బలపరుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి పట్ట్భారామిరెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. మంగళవారం స్థానిక ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన అధ్యాపకులతో మాట్లాడుతూ విద్యార్థి నాయకునిగా, ఒక విద్యాసంస్థకు సిఇఓగా పని చేసిన అనుభవం తనకు ఉందని, తత్ఫలితంగా వారి సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. తనకు ఒక అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీగా గెలిపించాలని అధ్యాపకులను కోరారు. జడ్‌పిటిసి సభ్యులు, కళాశాల ట్రెజరర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ పట్ట్భారామిరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించి చంద్రబాబునాయుడుకు బహుమతిగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షులు వెంకటరావు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
బిజెపి కార్యాలయంలో...
పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో టిడిపి బలపరుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి పట్ట్భా రామిరెడ్డి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బిజెపి మండల అధ్యక్షులు మాలకొండయ్య మాట్లాడుతూ టిడిపి బలపరుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి రామిరెడ్డిని బిజెపి నాయకులు, కార్యకర్తలు గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సిహెచ్ పాండురంగయ్య, జి నరసింహం, ఎం భూషయ్య, జె రాఘవయ్య, మాల్యాద్రినాయుడు, వైకుంఠం, కళ్యాణ్, కేశవులు, శ్రీను, ఆంజనేయులు, కుమారి, పద్మావతి, పర్మిల తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌పి త్రివిక్రమవర్మకు మాతృవియోగం
ఒంగోలు, జనవరి 3: ఎస్‌పి త్రివిక్రమవర్మకు మాతృవియోగం జరిగింది. ఎస్‌పి త్రివిక్రమవర్మతల్లి డాక్టర్ రాజేశ్వరి (82) గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఆమె ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలోని జిల్లా ఎస్‌పి బంగ్లాలో కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర రోడ్డు రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావుతోపాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు,కందుకూరు, అద్దంకి, పర్చూరు, చీరాల, కొండపి నియోజకవర్గాల శాసనసభ్యులు పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్, సాంబశివరావు, ఆమంచి కృష్ణమోహన్, డోలా బాలవీరాంజనేయులుతోపాటు, మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, కందుకూరు మాజీ శాసనసభ్యులు దివి శివరామ్ తదితరులు రాజేశ్వరి మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. అదేవిధంగా కలెక్టర్ సుజాతశర్మతో పాటు ఒంగోలు ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ వెంకటకృష్ణ వివిధ ప్రభుత్వ, ప్రయివేటు శాఖల అధికారులు కూడా రాజేశ్వరి మృతదేహాన్ని సందర్శించి ఆమెకు సంతాపాన్ని రాజేశ్వరి కుటుంబసభ్యులైన ఎస్‌పి త్రివిక్రమవర్మ తదితరులకు సానుభూతిని తెలిపారు.

ఆంధ్రభూమి బ్యూరో