ప్రకాశం

వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టంగుటూరు,జనవరి 3:రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక చర్యలు తీసుకున్నారని రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. మంగళవారం టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో జన్మభూమి- మాఊరు కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై అందించి గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టునిర్మాణం చరిత్రలో నిలుస్తుందన్నారు. 2018నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు. కేంద్రప్రభుత్వం రెండువేల కోట్లరూపాయల నిధులు ఇచ్చిందన్నారు. వల్లూరు - సూరారెడ్డిపాలెం సాగునీటి అవసరాలకోసం వల్లూరమ్మ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈసమావేశంలో కొండెపి శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ కుటుంబ వికాసం చెందితేనే సామాజిక వికాసం చెందుతుందన్నారు. ముఖ్యమంత్రి గుర్తించి పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు చేపట్టారన్నారు. కొండెపి నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని కోటి రూపాయల నిధులతో అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.కొండెపి నియోజకవర్గంలో పదివేల రేషన్‌కార్డులు పంపిణీకి చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్‌టిఆర్ సుజల పధకం తాగునీటి రక్షిత నీటి పధకాలు ఏర్పాటు చేశామన్నారు. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు 50శాతం రాయితీతో గ్రాసం పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈసందర్బంగా గొర్రెలకు నెట్టల వ్యాధి మందులను మంత్రి శిద్దా, శాసనసభ్యుడు డోలా వేశారు. ఈకార్యక్రమంలో టంగుటూరు ఎంపిపి చంద్రశేఖర్, తహశీల్దార్ శిల్ప, ఎండిడిఒ హనుమంతరావు, సర్పంచ్ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.