ప్రకాశం

బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,్ఫబ్రవరి 28: కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న బ్యాంకింగ్ వ్యతిరేక విధానాలకు నిరసనగా బ్యాంకింగ్ సెక్టారులో ఉన్న తొమ్మిది యూనియన్లు ఇచ్చిన పిలుపులో భాగంగా జరిగిన సమ్మె విజయవంతమైంది. బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, సహకార బ్యాంకులన్నీ మూతపడ్డాయి. దీంతో జిల్లాలోని బ్యాంకు ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కరోజులోనే కోట్లాది రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా జిల్లాకేంద్రమైన ఒంగోలులోని ఆంధ్రాబ్యాంకు మెయిన్ బ్రాంచి వద్ద భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన యుఎఫ్‌బియు జిల్లాకన్వీనర్ ఏ పార్థసారధి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు, చిన్న వ్యాపారులకు అందిస్తున్న బ్యాంకింగ్ సేవలను సవరణల పేరుతో నిర్వీర్యం చేయాలని కేంద్రప్రభుత్వం చేపట్టిన కార్యకలపాలను తీవ్రంగా ఖండించారు. కార్మిక సంఘాలను వాటి హక్కులను కాలరాయాలని కేంద్రప్రభుత్వం పూనుకుందన్నారు. ఉద్యోగ విరమణ తరువాత వచ్చే గ్రాట్యూటిపై సీలింగ్ తీసివేయాలన్నారు. ఖాళీగా ఉన్న అన్ని క్యాడర్స్‌లోని ఖాళీలను భర్తీచేయాలన్నారు. ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఎస్‌డి సర్దార్ మాట్లాడుతూ బ్యాంకు యజమాన్యాలు, రిజర్వుబ్యాంకు, కేంద్రప్రభుత్వ వైఖరి వలన బ్యాంకులు నిర్వీర్యవౌతున్నాయన్నారు. ప్రభుత్వ రంగసంస్ధలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ఎఐబిఒసి జిల్లా నాయకులు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న బ్యాంకింగ్ వ్యతిరేక విధానాలను ఖండించారు. నోట్లరద్దు వలన బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర ప్రభావం చూపిందన్నారు. బ్యాంకుల్లో వ్యాపార లావాదేవీలు తగ్గిపోయాయన్నారు.ఎన్‌సిబిఎఫ్ నాయకులు విజయమోహన్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు చెప్పిన అబద్దాలనే మళ్లీమళ్లీ చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కేంద్రప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకమన్నారు. జాతీరుూకరణ పేరుతో బ్యాంకులు రైతులకు, సామాన్యప్రజలకు, చిరువ్యాపారులకు, ఎస్‌సి,ఎస్‌టిలకు, బిసి, మైనార్టీలకు చేరువై వారందరికి ఆర్థిక సహకారం అందించి ఎంతోమంది అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న బ్యాంకులను నిర్వీర్యం చేయాలని చూడటం సరికాదన్నారు.
బిఇఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ శోభన్‌బాబు మాట్లాడుతూ ప్రజల కోసం బ్యాంకు రంగాన్ని కాపాడుకునేందుకే సమ్మె చేస్తున్నామన్నారు. ఉద్యోగులు పడుతున్న కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఎఐబిఒఏ రాష్ట్రప్రధానకార్యదర్శి పికె రాజేశ్వరరావు మాట్లాడుతూ మొండిబకాయిలు బ్యాంకింగ్ రంగానికి ప్రధాన సమస్యగా మారిందన్నారు. సుమారు 14లక్షల కోట్లరూపాయలు మొండిబకాయిలు ఉన్నాయన్నారు. నిజంగా వ్యాపారంలో నష్టాలు వచ్చినవారిని పీల్చిపిప్పిచేసి బ్యాంకులు వసూలు చేస్తున్నారని కోట్లాది రూపాయలు ఎగొట్టేకార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తులనే ప్రభుత్వాలు శాసనసభ్యులుగా, పార్లమెంటుసభ్యులుగా టిక్కెట్లు ఇస్తున్నారన్నారు. 2004 తరువాత ఉద్యోగాల్లో చేరిన ప్రతిఒక్కరికి పెన్షన్ సౌకర్యం లేదని ప్రతిఒక్కరికి ఒకే పెన్షన్‌విధానాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులు అడుగుతున్న డిమాండ్లు అన్ని న్యాయమైనవని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. నోట్ల రద్దునిర్ణయం ద్వారా బ్యాంకు ఉద్యోగులు అహర్నిశలు కష్టపడ్డారన్నారు. వారి కష్టాలకు తగిన ప్రతిఫలం ఇవ్వటం లేదన్నారు. సిపిఐ నగర కార్యదర్శి యు ప్రకాశరావు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన ఈసమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. సిపిఎం నగర కార్యదర్శి జివి కొండారెడ్డి, బ్యాంకు సంఘాల నాయకులు వేణుగోపాల్, శ్రీనివాస్, నరేంద్రబాబు, కిశోర్, సుధీర్‌బాబు, పెద్దిరెడ్డి, గౌతం, విజయకృష్ణ,కృష్ణమోహన్ పాల్గొన్నారు.

అరకొర వసతుల మధ్య
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
92పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
54వేల 417మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు

ఒంగోలు,్ఫబ్రవరి 28:జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుండి ప్రారంభమై ఈనెల 19వతేదీతో అరకొర వసతుల మధ్య ప్రారంభం కానున్నాయి. ప్రతిసంవత్సరం విద్యార్థులు అందరు బల్లలపై రాస్తున్నారని అధికారులు చెప్పటం, తీరా విద్యార్థులను కిందే కూర్చోపెట్టి రాయించటం పరిపాటిగానే మారింది. ఈసంవత్సరం కూడా అధికారులు అదే చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 92 పరీక్షా కేంద్రాల్లో ఈపరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9గంటలకు ప్రారంభమై మధ్యాహ్నాం 12గంటలకు పరీక్షలు ముగియనున్నాయి. జిల్లావ్యాప్తంగా మొదటి, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 54వేల 417మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 27వేల 345మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 27వేల 72మంది హాజరుకానున్నారు. జిల్లాలోని నాలుగు పరీక్షా కేంద్రాలను సమస్యాత్మాక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, ఐదు సిట్టింగ్ స్క్వాడ్‌లను ఇంటర్మీడియట్‌బోర్డు అధికారులు ఏర్పాటుచేశారు. విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్‌ను పోలీసు యంత్రాంగం అమలుచేయనుంది. అదేవిధంగా పరీక్షా కేంద్రాల వద్ద జీరాక్స్‌సెంటర్లను మూసివేయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, మెడికల్ క్యాంపులను ఏర్పాటుచేయాలని జిల్లా యంత్రాంగం అధికారులను ఆదేశించింది. పరీక్షలు జరిగే ప్రాంతాల్లో విద్యార్ధులకు అసౌకర్యం కలగకుండా నిరంతరం విద్యుత్ సరఫరా అందించనున్నారు. విద్యార్ధుల సౌకర్యం కోసం పరీక్షా కేంద్రాల వద్దకు బస్‌రూట్లల్లో ఆర్‌టిసి బస్ సౌకర్యాన్ని జిల్లా యంత్రాంగం ఏర్పాటుచేసింది. మొత్తంమీద జిల్లాలో నేటి నుండి ప్రారంభమయ్యే పరీక్షలకు జిల్లా యంత్రాంగం మొత్తం సర్వసన్నద్ధమైంది.