ప్రకాశం

న్యాయం కోసం వెలుగొండ నిర్వాసితుల మహాధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం టౌన్, మార్చి 21: పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేసి త్యాగధనులైన నిర్వాసితుల కుటుంబాలకు ఆర్‌ఆర్‌ప్యాకేజీని వర్తింపచేయాలని, వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి వెయ్యి కోట్ల నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, సిపిఎం, వైఎస్‌ఆర్‌సిపిలతోపాటు వెలుగొండ ప్రాజెక్టు సాధన కమిటీ, వెలుగొండ నిర్వాసితుల సంఘం మంగళవారం చేపట్టిన పట్టణ బంద్ పాక్షికంగా జరిగింది. ఈ నేపధ్యంలో రీడింగ్‌రూం సెంటర్‌లో రెండుగంటలపాటు మహాధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టాన్ని వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. చట్టం వర్తింపుకు అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో భూములను త్యాగం చేసిన నిర్వాసితుల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల పరిధిలో ఆర్‌ఆర్‌ప్యాకేజీ నిబంధనలు మించి మార్పుచేయడం జరిగిందని, ఇదే దశలో సంబంధిత జీవోను కూడా విడుదల చేయడం జరిగిందని, అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో పలుఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. తక్షణమే ఆర్‌ఆర్‌ప్యాకేజీని వర్తింపచేసి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు పరిహారం అందచేయాలని కోరారు. సిపిఐ నాయకులు అందె నాసరయ్య మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదని, ఎన్నికల సమయంలో వెలుగొండను నినాదంగా తీసుకొని ప్రజలను మభ్యపెట్టడం తప్ప ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అనుకున్న నిధుల కంటే 7400 కోట్లు అదనంగా కేటాయించడం జరిగిందని, నేతలు, గుత్తేదారుల లబ్ధి కోసం అదనపు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. తక్షణమే వెలుగొండ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వెయ్యి కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయాలని, ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్‌సిపి సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధానకర్త వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని, ఆయన మరణానంతరం వెలుగొండ ప్రాజెక్టును పట్టించుకున్న నాథుడు లేడని అన్నారు. మొక్కుబడిగా ఇచ్చే నిధులు జీతభత్యాలకు, కరెంటు బకాయిలకు సరిపోతుందని, ఒకేసారి నిధులను కేటాయించి వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తే వెనుకబడిన పశ్చిమప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో దృష్టి సారించకుంటే మరిన్ని ఉద్యమాలను చేపట్టాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గాలి వెంకటరామిరెడ్డి, డికెఎం రఫీ, సోమయ్య, జిల్లా నాయకులు జాలా అంజయ్య, ఐద్వా నాయకురాలు కళావతి, బాలనాగయ్య, ఏనుగుల సురేష్, సిపిఐ నాయకులు షేక్ కాశీం, రామిరెడ్డి, కరుణ, వైకాపా నాయకులు చిల్లంచర్ల కృష్ణ, పంబి వెంకటరెడ్డి, కంది ప్రమీలారెడ్డి, ఉడుముల కోటిరెడ్డిలతోపాటు నిర్వాసితుల సంఘం నాయకులు, వెలుగొండ ప్రాజెక్టు సాధన కమిటీ నాయకులు పాల్గొన్నారు.