ప్రకాశం

ఎస్‌సి, ఎస్‌టిల అభ్యున్నతికి భారీగా నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మార్చి 26:రాష్ట్రప్రభుత్వం ఎస్‌సి,ఎస్‌టిల అభ్యున్నతికి వేలాదికోట్ల రూపాయలు ఖర్చుచేస్తుందని రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ఆదివారం స్థానిక ఎంఎస్ ఫంక్షన్‌హాలులో విద్యుత్‌శాఖ ఎస్‌సి,ఎస్‌టి ఉద్యోగుల వారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ భారతరాజ్యాంగాన్ని తొమ్మిదినెలల్లో రూపొందించిన ఏకైక వ్యక్తిఅని కొనియాడారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో 125అడుగుల అంబేద్కర్ విగ్రహం కోసం 95కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించినట్లు చెప్పారు. జిల్లాలో ఎస్‌సి,ఎస్‌టి నిరుద్యోగులకు ఉపాధికోసం 180కోట్ల రూపాయలతో ఆటోలు, తదితర వ్యాపార సంబంధమైన యూనిట్లు నెలకొల్పడం కోసం ఆర్థిక సహాయం అందించటం జరిగిందన్నారు. ఈసందర్బంగా మంత్రిని విద్యుత్‌శాఖ ఎస్‌ఇ, విద్యుత్‌శాఖ యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ యర్రగొండపాలెం, సంతనూతలపాడు శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్‌రాజు, ఆదిమూలపు సురేష్, మాజీ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, విద్యుత్‌శాఖ ఎస్‌ఇ భాస్కరరావు, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి బి రవి తదితరులు పాల్గొన్నారు. కాగా ముందుగా జిల్లాలో నూతనంగా ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇగా బాధ్యతలు స్వీకరించిన సంజీవరెడ్డి రాష్టర్రవాణాశాఖమంత్రి శిద్దారాఘవరావు నివాసంలో కలిసి పుష్పగుచ్ఛాన్ని అందచేశారు.