ప్రకాశం

అప్పులబాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దారవీడు, ఏప్రిల్ 14: వరుస కరవు పరిస్థితులు, సాగుచేసిన పంటలు నీరులేక ఎండిపోవడంతో పెట్టుబడి రాక అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రమైన పెద్దారవీడులో గురువారం రాత్రి జరిగింది. పెద్దారవీడు గ్రామానికి చెందిన చిట్యాల మస్తాన్‌రెడ్డి (35) గత రెండు సంవత్సరాలుగా సాగుచేసిన పంటలకు పెట్టుబడి రాకపోవడంతో సుమారు 6లక్షల రూపాయల అప్పులు ఉన్నాయని, దీంతో అప్పులు తీర్చేమార్గం కనిపించకపోవడంతో పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని తండ్రి వెంకిరెడ్డి పోలీసులకు తెలిపారు. ఈమేరకు పోలీసులు మస్తాన్‌రెడ్డి మృతదేహాన్ని మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. విచారణ జరిపి అప్పులు ఉన్నట్లు తేలడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముక్కంటి తెలిపారు.

ఇంటర్‌లోస్టేట్ టాపర్
షర్మిలకు అభినందనల వెల్లువ
పొదిలి, ఏఫ్రిల్ 14 : ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన పొదిలి పట్టణానికి చెందిన షేక్ షర్మిలకు పలువురు అభినందనలు తెలిపారు. ఒంగోలు పట్టణంలో శుక్రవారం షర్మిలను రాష్ట్ర అటవీశాఖా మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్ తదితరులు సన్మానించారు. షర్మిల భవిష్యత్‌లో ఆమె లక్ష్యాన్ని సాధించాలని వారు ఆకాంక్షించారు. అలాగే ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి షర్మిలకు పదివేల రూపాయల నగదు చెక్కును అందజేశారు. అదేవిధంగా పొదిలిలో షర్మిలను వీరిశెట్టి కళాశాలలో మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి, పొదిలి ఎంపిపి కె నరసింహరావు, జడ్పిటిసి సాయిరాజేశ్వర్, వాకా వెంకటరెడ్డి తదితరులు అభినందలతో ముంచెత్తారు. ఆయా కార్యక్రమాల్లో వీరిశెట్టి కాలేజీ డైరెక్టర్ నాగ ప్రసాద్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.