ప్రకాశం

స్వగృహ నిర్మాణాలు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేటపాలెం, ఏప్రిల్ 16 : రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌ను పట్టణాభివృద్ధి శాఖలో విలీనం చేసి అసంపూర్తిగా నిలిచిపోయిన స్వగృహ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయనున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. మండలంలోని చల్లారెడ్డిపాలెం పంచాయతీ కొత్తపాలెం వద్ద అసంపూర్తిగా నిలిచిపోయిన కొణిజేటి హరివిల్లులోని రాజీవ్ స్వగృహ ఇళ్ల సముదాయాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా 2008లో మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు రాజీవ్ స్వగృహ పథకం ప్రారంభమైందన్నారు. అయితే నవ్యాంధ్ర ప్రదేశ్ లోని 10 ప్రాంతాలకు గాను కేవలం అనంతపురం, కర్నూలులో మాత్రమే వాటి నిర్మాణం పూర్తి కావడంతో లబ్ధిదారులకు అందజేశామన్నారు. చీరాల నియోజకవర్గానికి సంబంధించి వేటపాలెం మండలం నాయునిపల్లిలో మొత్తం 425 ఇళ్లకు గాను 335 ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభించగా వివిధ దశల్లో ఆ నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు. నాలుగు విభాగాల్లో గృహాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారన్నారు. ఎ కేటగిరిలో 1,450, బి కేటగిరిలో 1,140, సి కేటగిరిలో 700, డి కేటగిరిలో 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం కార్పొరేషన్ ద్వారా రూ.27 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. గృహ సముదాయాలకు సంబంధించి మరోసారి సమీక్ష జరిపి కనీస ధరలు నిర్ణయిస్తామన్నారు. అదేవిధంగా వాటిలో వౌలిక వసతులు కల్పిస్తామన్నారు. నిర్మాణాలు చివరి దశలో ఉన్న 103 ఇళ్లను సత్వరం పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ గతంలో కార్పొరేషన్ ఎండిగా ఉన్న శాలినీ మిశ్రా ముందుచూపుతో వ్యవహరించకపోవడం వల్లనే నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. మూడు దశల్లో గృహాలు నిర్మించాలని ప్రతిపాదించినప్పటికీ పట్టించుకోలేదన్నారు. నిర్మాణాలు వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఎజిఎం కోటేశ్వరరావు, ఓఎస్డీ రాజగోపాల్, తహశీల్దార్ కె లింగమహేశ్వరరావు, చీరాల మున్సిపల్ చైర్మన్ మోదడుగు రమేష్, చల్లారెడ్డిపాలెం ఉప సర్పంచ్ వై సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.