ప్రకాశం

తీరని దాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, ఏప్రిల్ 28 : వేసవితీవ్రతను దృష్టిలో ఉంచుకుని పురపాలక సంఘ పరిధిలో తాత్కాలిక చలివేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్ ఆమోదించింది. చలివేంద్రాలు నిధుల స్వాహాకు వనరుగా మారాయ. ప్రజాధనం దుర్వినియోగం చేసే విషయంలో ఏ ఒక్క అవకాశాన్ని మున్సిపాలిటీ వారు వదులుకోవడం లేదని ప్రజలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ప్రజాధనంతో చలివేంద్రాలు
కలెక్టర్ ఆదేశాలతో పురపాలక పరిధిలో మొత్తం 8 చోట్ల ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ పాలకవర్గం నిర్ణయించింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట, ఆర్టీసీ బస్టాండు వద్ద, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పార్కు వద్ద, పేరాల శివాలయం వద్ద, గడియార స్తంభం కూడలిలో, బాలికోన్నత పాఠశాల వద్ద, ముంతావారి కూడలిలో, ఆంజనేయస్వామి గుడి వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు రూ.97వేలు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. పురపాలక పరిధిలోని 33 వార్డుల్లో తాగునీరు సరఫరా చేసే అధికారులు చలివేంద్రాల్లో తాగునీటికి మాత్రం ఇంత మొత్తంలో ఖర్చు చేయడమేంటని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు.
చలివేంద్రం ఖరీదు 43 వేలు
ఇక స్థానిక ఏరియా వైద్యశాల ఎదుట కూడా చలివేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ తాత్కాలిక చలివేంద్రానికి ఏకంగా రూ. 43వేలు ఖర్చు అవుతుందని అంచనా వేయ డం గమనార్హం. ఇటీవల వైద్యవిధాన పరిషత్ జిల్లా సమన్వయకర్త ఉష ఆస్పత్రి పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి వచ్చే ప్రజల దాహర్తి తీర్చేందుకు అవసరమైన తాగునీటి వసతి కల్పించాలని స్థానిక వైద్యశాల అధికారులను ఆమె ఆదేశించారు. ఇప్పుడు పురపాలక వర్గం ఏర్పాటు చేసే చలివేంద్రాన్ని కేవలం ఆ రోడ్డులో ప్రయాణించే వారు మాత్రమే ఎక్కువగా వినియోగించే అవకాశం ఉంది.
సిబ్బందికి లక్షా 93 వేలు : మొత్తం 8 చోట్ల ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు పనిచేసే వాళ్లను నియమించాలని నిర్ణయించారు. ఇందుకు రూ.1లక్షా 93వేలు వెచ్చించనున్నారు. పురపాలక కార్యాలయంలో సుమారు 350 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో నుంచి ఈ చలివేంద్రాలకు అవసరమైనంత మందిని నియమిస్తే ఖర్చు తగ్గించుకోవచ్చని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద చలివేంద్రాల ఏర్పాటుకు రూ.3 లక్షల 33 వేలు ఖర్చు చేయాలని నిర్ణయించడం ఒక్క పురపాలక వర్గానికే చెల్లిందని వారు ఎద్దేవా చేస్తున్నారు. అందులోనూ ఆ మొత్తాన్ని పురపాలక సాధారణ నిధుల నుంచి ఖర్చు చేస్తుండడంతో ప్రజాధనాన్ని వెచ్చించేటపుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని వారు గుర్తు చేస్తున్నారు.