ప్రకాశం

27న వైకాపాలోకి మానుగుంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఆగస్టు 24:రాష్ట్ర పురపాలక శాఖ మాజీ మంత్రి, కందుకూరు మాజీ శాసనసభ్యుడు మానుగుంట మహీధర్‌రెడ్డి ఈనెల 27న వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ మేరకు మానుగుంట నియోజకవర్గంలోని అన్నిమండలాల ముఖ్యనాయకులతో సమావేశమై తన నిర్ణయాన్ని తెలియచేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ముఖ్యనేతలందరూ మానుగుంటను అనుకరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.దీంతో ఈనెల 27న ఆయనతోపాటు ఆయన అనుచరగణం మొత్తం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లో చేరనున్నారు. ఈపాటికే జగన్‌తోను,నెల్లూరు పార్లమెంటుసభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డితోను మానుగుంట మంతనాలు సాగించారు. త్వరగా పార్టీలో చేరాలని వారిద్దరు మానుగుంటను కోరినట్లు సమాచారం. కాగా కొంతసమయం కావాలని మానుగుంట వారిని కోరినట్లు తెలుస్తొంది. త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఆ ప్రభావం తనపై పడుతుందన్న భావనలో మానుగుంట ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. కందుకూరు మునిసిపల్ ఎన్నికలను ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు పోతుల రామారావు, నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి దివి శివరాం ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. ఈ నేపధ్యంలో వైకాపా తరపున బలమైన అభ్యర్థిని నిలబెట్టడటంతోపాటు ఆర్థికంగా బలోపేతమైన నాయకుడిని మానుగుంట చూడాల్సిన బాధ్యత ఉంది. రాష్టప్రార్టీ ఈ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థికి ఆర్థికంగా చేయూతనందిస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా అక్కడి నేతల నుండి వినిపిస్తోంది. ప్రధానంగా కందుకూరు నియోజకవర్గంలో మానుగుంట వర్సస్ దివి కుటుంబం మధ్యనే రాజకీయంగా పోటీ ఉంటుంది. మొదటిలో మానుగుంట తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారన్నా ప్రచారం జోరుగా సాగింది. ఈ తరుణంలో తెలుగుదేశంపార్టీ తరపున కావలి నియోజకవర్గం నుండి పోటీచేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. కాని చివరకు మానుగుంట ఈనెల 27వతేదీన వైకాపాతీర్థం పుచ్చుకోవటం ఖాయమైందనే చెప్పవచ్చు. ఇదిలా ఉండగా రాష్టవ్య్రాప్తంగా కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై, పార్టీని బలోపేతం చేసే దిశగా గడపగడపకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నినాద కార్యక్రమం జరుగుతుంది. కాగా కందుకూరు నియోజకవర్గపరిధిలో ఈకార్యక్రమం జరగటం లేదు. దీంతో మానుగుంటను త్వరగా పార్టీలో చేర్చుకుని గడపగడపకు వైకాపాలో భాగస్వాములు చేసి పార్టీని బలోపేతం చేయాలని రాష్టప్రార్టీ ధృడసంకల్పంతో ఉంది.కాగా తాను పార్టీలోచేరేందుకు కొంత వ్యవధికావాలంటూ మానుగుంట అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. కాని అధిష్టానం మాత్రం త్వరితగతిన పార్టీలో చేరాలని కోరుతున్నట్లు తెలుస్తొంది.కందుకూరు నియోజకవర్గ వైకాపా ఇన్‌చార్జీగా మానుగుంట బాధ్యతలు తీసుకుంటే మాత్రం ఆ ప్రభావం ఆ నియోజకవర్గంపైనే కాకుండా ఇతర నియోజకవర్గాల్లోను వైకాపా బలపడే అవకాశాలు ఉన్నాయి. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోను వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి పోతుల రామారావు పోటీచేసి గెలుపొందారు. కాని మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో పోతుల తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకోవటంతో నియోజకవర్గంలోని తెలుగుతమ్ముళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పోతుల రామారావు, దివి శివరాం వర్గీయుల మధ్య సఖ్యత లేకపోవటంతో రానున్న ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి విజయం సాధిస్తారన్న భావన వైకాపా తమ్ముళ్లల్లో ఉన్నట్లు సమాచారం. కాగా కందుకూరు మునిసిపాలిటీలో మానుగుంటకు గట్టిపట్టు ఉంది. దీంతో రానున్న మునిసిపల్ ఎన్నికలు నువ్వానేనా అన్న రీతిలో జరిగే అవకాశాలున్నాయి. మొత్తంమీద మానుగుంట ఈనెల 27న వైకాపా తీర్థం పుచ్చుకోనున్న నేపధ్యంలో జిల్లాలో పార్టీ మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయనే చెప్పవచ్చు.
గృహనిర్మాణంలో జిల్లాకు నిర్దేశించిన
లక్ష్యాలు సాధించాలి
- కలెక్టర్ సుజాతశర్మ
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఆగస్టు 24: గృహ నిర్మాణంలో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన సాధించాలని కలెక్టర్ సుజాతశర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక సిపిఒ సమావేశ మందిరంలో ఎన్‌టిఆర్ గృహనిర్మాణం, ఇందిరా ఆవాజ్‌యోజన, పాత ఇళ్ల మరమ్మతులు, బిల్లుల చెల్లింపులు తదితర అంశాలపై గృహనిర్మాణ సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించి మండల, డివిజన్, నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహనిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రెండు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అందులో జీవో నెంబరు 103లో ఎన్‌టిఆర్ గృహ నిర్మాణపథకం కింద జిల్లాలోని ఒంగోలు మినహా 11 నియోజక వర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 900 గృహాలు చొప్పున 9900 గృహాలు, ఒంగోలు నియోజకవర్గానికి 350 గృహాలు కలిపి 10250 గృహాలు జిల్లాకు మంజూరైనట్లు తెలిపారు. ఈ గృహాల్లో రెండువందల చదరపు అడుగుల్లో ఉండాలని ఒక్కొ యూనిట్ విలువ 1.50లక్షల రూపాయలని అందులో 95వేల రూపాయలు రాష్ట్రప్రభుత్వ సబ్సిడీ కాగా మిగిలిన 55వేల రూపాయలు ఉపాధి హామీ పథకం కింద భరించనున్నట్లు చెప్పారు. ఎన్‌టిఆర్ గ్రామీణ గృహనిర్మాణం కింద గతంలో నిర్ణయించిన 14వేల 250 గృహాలకు గాను 11500మంది లబ్ధిదారులను ఇప్పటికే గుర్తించటం జరిగిందని ఈ జాబితా నుండి తాజా ఉత్తర్వులు ప్రకారం లబ్ధిదారుల ఎంపిక చేయాలన్నారు. అదేవిధంగా జివో 104ప్రకారం ఎన్‌టిఆర్ గృహనిర్మాణం కింద జిల్లామొత్తం కలిపి నాలుగువేల 102గృహాలు మంజూరు అయ్యాయన్నారు. భారతప్రభుత్వం 2011 జనాభాలెక్కల ప్రకారం 9,785మంది లబ్ధిదారులు జాబితాను పంపించిందని అందులో ప్రస్తుతం 4493మంది అర్హులున్నట్లు తెలిందన్నారు. ఈపధకం కింద ఒక్కొక్క యూనిట్ విలువ రెండులక్షల రూపాయలని అందులో 1.20లక్షల రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్‌యోజన కింద కేంద్రప్రభుత్వం భరిస్తుందని, మిగిలిన 80వేల రూపాయలు రాష్ట్రప్రభుత్వం,ఉపాధిహామీపధకం అనుసంధానంతో భరిస్తుందన్నారు. తాజా ఉత్తర్వులు ప్రకారం 4102గృహాలకు లబ్ధిదారులను ఎంపికచేయాలన్నారు. సంబంధిత నియోజకవర్గాల శాసనసభ్యులతో సంప్రదించి లబ్దిదారుల ఎంపికను సకాలంలో పూర్తిచేయాలని లేనిపక్షంలో కోల్పోయే అవకాశం ఉందన్నారు.ఎస్‌సి,ఎస్‌టి రిజర్వేషన్లను విధిగా పాటించాలన్నారు. ఎన్‌టిఆర్ అప్‌గ్రేడేషన్‌కింద జిల్లాకు కేటాయించిన 12వేల పాత ఇళ్ళ మరమ్మత్తులకు గాను 4956మంది లబ్ధిదారులను నిర్ధారించగా ఇప్పటివరకు 512గృహాలకు మంజూరు చేశామన్నారు. లబ్ధిదారులను గుర్తించటంలో పర్చూరు, సంతనూతలపాడు, దర్శి నియోజకవర్గాల్లో మంచి పురోగతి ఉండగా చీరాల, ఒంగోలు, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాలు వెనకంజలో ఉన్నాయన్నారు. ఈనెలాఖరులో నిర్ణీత లక్ష్యాలను పూర్తిచేయాలని, లేనిపక్షంలో మిగిలిన లక్ష్యాన్ని అవసరమయ్యే నియోజకవర్గాలకు మళ్లించటం జరుగుతుందన్నారు. పాత ఇళ్ల మరమ్మతులకు డిమాండ్ లేదని చెప్పటం సరికాదన్నారు. క్షేత్రస్థాయిలో తిరిగి సమావేశాలు నిర్వహించి ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించి పురోగతి సాధించాలన్నారు. వచ్చే సెప్టెంబర్ 15వతేదీన తిరిగి సమావేశం నిర్వహిస్తామని ఈలోగా పురోగతి సాధించకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు, డిఇలు వారి పరిధిలో ఏఇలు, వర్క్ ఇన్‌స్పెక్టర్లతో బాధ్యతగా సమావేశం నిర్వహించి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలన్నారు. గృహనిర్మాణం బిల్లుల చెల్లింపులో అద్దంకి మండలంలో నూటికినూరుశాతం,నాగులుప్పలపాడులో 15కు 15పూర్తిచేసి ముందంజలో ఉన్నారని, ఇది ఇలాగే కొనసాగాలని అభినందించారు. మిగిలిన మండలాల్లో కూడా బిల్లులు చెల్లింపులు సత్వరమే చేయాలన్నారు. ఇందిరా అవాస్ యోజన పధకం కింద 2015-16సంవత్సరంలో జిల్లాకు మంజూరైన 4326గృహాలకు గాను 1913గృహాలు పూర్తిఅయ్యాయని వివిధ దశల్లో ఉన్న మిగిలిన 2413గృహాలను కూడా వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. అర్బన్ హౌసింగ్ కింద ఒంగోలునగరానికి మంజూరైన 500ఇళ్లకు గాను 320మంది లబ్ధిదారులను ఎంపికచేయటం జరిగిందని, చీరాల మునిసిపాలిటికి 612గృహాలు మంజూరుకాగా లబ్ధిదారుల ఎంపిక ఇంకా పూర్తిచేయలేదన్నారు.వార్డుల వారీగా సమావేశంనిర్వహించి నిర్ణీత లక్ష్యాలను వచ్చే మూడునెలల్లో పూర్తిచేసి రాష్ట్రప్రభుత్వానికి మంచిపేరు వచ్చేవిధంగా నిజాయితీతో పనిచేయాలన్నారు. ఈసమావేశంలో గృహనిర్మాణ సంస్థ అధికారులు పాల్గొన్నారు.

కుక్క కాటుకు బాలుడు మృతి
చీరాల, ఆగస్టు 24: వీధికుక్క కరవడంతో విషమెక్కి బాలుడు మృతి చెందిన విషాద సంఘటన బుధవారం ప్రకాశం జిల్లా చీరాల్లో వెలుగుచూసింది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండల పరిధి లోని ఈపూరుపాలెం గ్రామానికి చెందిన బేల్దారి కూలీ నాశన బిక్షాలు, వెంకటేశ్వరమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులున్నారు. చివరి కొడుకు మహేష్ (10) పేరాల్లోని సాయి విద్యా నికేతన్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో అతను సోమవారం రాత్రి చలి, జ్వరంతో బాధపడ్డాడు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు మహేష్‌ను స్థానికంగా ఉన్న ఓ వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. బాలుడిని పరీక్షించిన సదరు వైద్యుడు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించాలని సూచించాడు. వారు ఆ బాలుడిని మంగళవారం ఉదయం చీరాల ఏరియా వైద్యశాలలో చేర్పించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు చలి, జ్వరంతో పాటు కడుపునొప్పి లక్షణాలను గుర్తించారు. కనీసం తాగునీరు కూడా అతను తీసుకోలేదు. దీంతో వైద్యులు అతన్ని ఏం జరిగిందని ప్రశ్నించే సరికి అసలు విషయం బయటపెట్టాడు. తనను మూడు రోజుల క్రితం ఓ కుక్క కరిచిందని బాలుడు వైద్యులకు చెప్పాడు. కాలిపై కుక్క కరిచిన ప్రదేశాన్ని వారికి చూపించాడు. అయితే అప్పటికే కుక్క కరిచిన ప్రదేశం విషతుల్యమైందని, గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాలని వారు సూచించారు. చేసేది లేక తల్లిదండ్రులు ఆ బాలుడిని గుంటూరుకు తరలించారు. అక్కడి వైద్యులు అతన్ని పరీక్షించి రాబిస్ సోకినట్లు నిర్ధారించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో మహేష్ మృతి చెందాడు. ఉదయం అతని మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. ఈ ఘటనతో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అధికారులు స్పందించాలి : బాలుడిని కరిచి అతని మృతికి కారణమైన వీధికుక్కను బంధించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. పంచాయతీ అధికారులు స్పందించి వెంటనే గ్రామంలో వీధికుక్కలను గుర్తించి భవిష్యత్తులో ఇంకెవరూ వాటి బారిన పడకుండా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

కలెక్టర్‌తో మాట్లాడి
సమస్య పరిష్కరిస్తా
- మంత్రి పత్తిపాటి హామీ
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఆగస్టు 24:జిల్లాలో సుబాబుల్ టన్ను 4400రూపాయలు, జామాయిల్ టన్ను 4600రూపాయలకు కొనుగోళ్లు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్టవ్య్రవసాయశాఖమంత్రి పత్తిపాటి పుల్లారావును ఎపి రైతు సంఘం నాయకులు, రైతులు బుధవారం చిలకలూరిపేటలో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పత్తిపాటి స్పందిస్తూ కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కరానికి కృషిచేస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన ఒప్పందం ప్రకారం సుబాబుల్ టన్ను 4400రూపాయలు, జామాయిల్ టన్ను 4600రూపాయలకు రైతు నుండి నేరుగా కొనుగోళ్లు జరపాలని, వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని, జామాయిల్ కర్రను కూడా సుబాబుల్‌లాగానే ముడి కర్రను కొనుగోలు చేయాలని, రివాల్వింగ్ ఫండ్‌ను కేటాయించి మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోళ్లు జరపాలని, కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని పేపరుమిల్లుల వారు డంపింగ్ యార్డులు ఏర్పాటుచేయాలని, ఏ జిల్లాకు ఆ జిల్లా రేట్లు నిర్ణయించుకునే విధంగా అవకాశం కల్పించే జివో నెంబరు 143ను రద్దుచేయాలని వారు మంత్రికి విన్నవించారు. పేపరుమిల్లులవారు సుబాబుల్ టన్ను 3700రూపాయలు, జామాయిల్ టన్ను 2700రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, ఆన్‌లైన్‌లోప్రభుత్వం నిర్ణయించిన రేట్లు ఇస్తున్నట్లు చూపిస్తున్నారని పేర్కొన్నారు. కాని రైతుకు నేరుగా మార్కెట్ కమిటీ వారు నిర్ణయించిన కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకుని వెళ్తే కంపెనీల వారు తీసుకోవటం లేదని, మధ్యవర్తులద్వారా మాట్లాడుకుని కొంత కర్ర వారి అనుయాయుల పేరున వేసుకుని మిగిలిన కర్రను రైతుపేరున రాసి ఆన్‌లైన్‌లో సుబాబుల్ 4400రూపాయలు, జామాయిల్ 4600రూపాయలు ఇస్తున్నట్లు చూపిస్తున్నట్లు చెప్పారు. ఈ మోసాన్ని అపాలని వారు మంత్రికి విన్నవించారు. రతై పండించిన కర్రను పూర్తిగా ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు కొనుగోలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని, రైతులు మద్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా కొనుగోలు చేయమని అడిగినందునే గత 20రోజులకు పైగా కొనుగోళ్ళు ఆపివేయటం జరిగిందని దీనివలన రైతులు, కర్రకోత కూలీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మంత్రికి విన్నవించారు. మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించిన వారిలో ఎపి రైతు సంఘం జిల్లాకార్యదర్శి పమిడి వెంకట్రావు, జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బూరి వెంకటేశ్వర్లు, రైతులు పల్లకి కోటిరెడ్డి, నల్లూరి కృష్ణయ్య, కొల్లూరి వెంకటేశ్వర్లు, బెజవాడ శ్రీను తదితరులు ఉన్నారు.

ఆగి ఉన్న బోరు లారీని ఢీకొన్న కారు
ఇద్దరు మృతి
నలుగురికి తీవ్ర గాయాలు
కొనకనమిట్ల, ఆగస్టు 24: మండలంలోని చౌటపల్లె ఎస్సీకాలనీ సమీపంలో 565 జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆగిఉన్న బోరు లారీని వెనుకవైపు నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోఉన్న ఆరుమూరి సుధాకర్ (37), ఆరుమూరి సుజనకుమార్(14) అక్కడికక్కడే మృతిచెందారు. ఎ రవికుమార్, శ్రీలక్ష్మి, రాజేశ్వరి, నవీన్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరందరూ ఒకే కుటుంబ సభ్యులు. కారు ముందు భాగం బోరు బండి కిందకు దూసుకుపోయి ఇరుక్కుంది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. తెలంగాణా రాష్ట్రం సిద్ధపేటకు చెందిన వీరు నెల్లూరుజిల్లా బట్టలదినె్న గ్రామంలోని అంకాలమ్మ జాతరకు వెళ్లి స్వగ్రామానికి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలోని చౌటపల్లెవద్ద ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108లో అంబులెన్స్ సిబ్బంది పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ఆసుపత్రిలో చేర్చారు. ఇన్‌చార్జ్ ఎస్సై అజయ్‌కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.