క్రైమ్/లీగల్

దారి దోపిడి ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఏప్రిల్ 5: దారిదోపిడి, మోటార్ సైకిళ్ళు, బంగారపు వస్తువులను దోపిడీ చేసే ఎనిమిది మంది ముద్దాయిలు, ఒక బాలనేరస్తుడిని ఒంగోలు పోలీసులు గురువారం అరెస్ట్ చేసినట్లు జిల్లా అదనపు(పరిపాలనా) పోలీసు సూపరింటెండెంట్ ఉదయరాణి తెలిపారు. గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని ఐటి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎఎస్‌పి ఉదయరాణి మాట్లాడుతూ పలు కేసుల్లో అరెస్ట్ అయిన ముద్దాయిల వివరాలను ఎఎస్‌పి ఉదయరాణి తెలియజేస్తూ ప్రకాశం జిల్లా చీమకుర్తి లోని శిద్దానగర్‌కు చెందిన పాలపర్తి ఏసు, కొమరగిరి కొండయ్య, బొజ్జా దుర్గా ప్రసాద్ , మనె్నం అంకమరావు, మనె్నం నరసింహారావు, మనె్న గంగయ్య, తుపాకుల అంజయ్య , చీమకుర్తిలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన నల్లబోతుల శ్రీనివాసరావు తోపాటు చీమకుర్తిలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన ఒక బాలనేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేసామని ఎఎస్‌పి ఉదయరాణి తెలిపారు. ముద్దాయిలు చేసిన నేరాలుగురించి ఎఎస్‌పి వివరిస్తూ 2017 జూన్ 21న టంగుటూరు పోలీసు స్టేషన్ పరిధిలో దారి దోపిడీ దొంగతనం, ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలో 6నెలల క్రితం దారిదోపిడీ దొంగతనం , ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలో2017 అక్టోబర్ 22న దారి దోపిడీ దొంగతనం, ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలో 2017 జనవరి 31న దారి దోపిడీ దొంగతనం, 2018 మార్చి 12న సంతనూతలపాడు పోలీసు స్టేషన్ పరిధిలో పగటి దొంగతనాలు ముద్దాయిలు చేసినట్లు ఎఎస్‌పి తెలిపారు. తన పర్యవేక్షణలో ఒంగోలు సిసిఎస్‌డి ఎస్‌పి కేసన వెంకటేశ్వరరావు, ఒంగోలు పట్టణ డిఎస్‌పి బి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్ సీఐ గంగా వెంకటేశ్వర్లు, సిసిఎస్ సిబ్బంది ఎస్‌ఐ వివి నారాయణ, ఎఎస్‌ఐ వి వెంకటేశ్వరరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ బాలాంజనేయులు, చంద్రశేఖర్, సురేష్, కోటయ్య, వెంకయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, అంజిబాబు, రామకృష్ణ, ఖాదర్, సాయి, శాంతకుమార్, శేషు, శివ, వౌలాలి, సంధాని బాషా లు కలిసి ఒక బృందంగా ఏర్పడి పై ముద్దాయిలను గురువారం సాయంత్రం ఒంగోలులోని వెంగముక్కపాలెం క్రాస్ రోడ్డు సమీపంలో అరెస్ట్‌చేసి వారి వద్ద నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని ఎఎస్‌పి తెలిపారు. పై ముద్దాయిలు అందరూ చీమకుర్తి చెందిన వారై ఉండి ఒంగోలు సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో దారిదోపిడీలు, మానబంగాలు, రక్తగాయాలు, కలిగించి నేరాలు చేస్తున్న అనేక తెగలకు చెందిన ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించామని ఎఎస్‌పి తెలిపారు. పై ముద్దాయిలలో ఏసు, శ్రీనివాస్, కొండయ్య అనే వారు ఒక ముఠాగా ఏర్పడి వారు మిగిలిన నేరస్తులను కలుపుకొని సుమారు 17నేరాలు చేసి పోలీసులకు దొరకకుండా చాకచక్యంగా తప్పించుకొని తిరుగుతూ తిరిగి నేరాలు చేస్తున్నట్లు రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు ముద్దాయిలను అరెస్ట్ చేసామని ఎఎస్‌పి తెలిపారు. ముద్దాయిలు చేసిన నేరాలలో ఐదు నేరాలు మాత్రమే పోలీసు రికార్డుల్లో నమోదు కాగా,మిగిలిన 12 కేసులు నమోదు కాలేదని ఎఎస్‌పి తెలిపారు. అందులో ఐదు కేసులు యరజర్ల, మల్లవరము డ్యామ్,కొప్పోలు శివార్లు,మద్దులూరు, కొణిజేడు, పొందూరు, లింగం గుంట, చీమకుర్తి ప్రాంతాలలో ముద్దాయిలు వేర్వేరుగా వివిధ నేరాలకు పాల్పడగా బాధితుల పిర్యాదు లేనందున స్టేషన్‌లో కేసులు నమోదు కాలేదని తెలిపారు. ముద్దాయిలు నేరాలు చేయాలనే ఉద్దేశ్యంతో నిర్జీవ ప్రదేశాలను ఎంచుకొని నేరాలు చేసే వారని ఎఎస్‌పి తెలిపారు. ఈ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎఎస్‌పి ఉదయరాణి ప్రత్యేకంగా అభినందించారు. ఈ విలేకర్ల సమావేశంలో ఒంగోలు పట్ణణ డిఎస్‌పి బి శ్రీనివాసరావు, సిసిఎస్ పోలీసు స్టేషన్ డిఎస్‌పి కేసన వెంకటేశ్వరరావు, ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్ సిఐ గంగా వెంకటేశ్వర్లు తదితతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.