ప్రకాశం

కమర్షియల్ విద్యుత్ వినియోగదారులపై ట్రాన్స్‌కో అదనపు బాదుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మార్చి 31 : ఎపి ఇఆర్‌సి పెంచిన కమర్షియల్ విద్యుత్ ఛార్జీలు రాష్టవ్య్రాప్తంగా శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ మేరకు గురువారం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ఎపిఇఆర్‌సి ఉత్తర్వులు జారీచేసింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి రానుండటంతో కమర్షియల్ విద్యుత్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కమర్షియల్ విద్యుత్ ఛార్జీలు రెండుశాతం పెంచినప్పటికి తమపై ఆదనపుభారం పడనుందని, దీంతో తాము ఆర్ధికంగా ఇబ్బందులు పడనున్నామని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్టవ్య్రాప్తంగా 216 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి ఆదాయం రానుండగా ప్రకాశం నుంచి పది కోట్ల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. కాగా పెంచిన విద్యుత్ టారిఫ్ గురువారం సాయంత్రం వరకు ట్రాన్స్‌కో కార్యాలయాలకు అందకపోవటంతో అధికారులు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా విద్యుత్‌ను భారీగా వినియోగించే కమర్షియల్ రంగంపైనే ఎపిఇఆర్‌సి దృష్టిసారించటంతో రానున్న రోజుల్లో అన్ని వస్తువులపై రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కమర్షియల్ పరంగా ఉండే షాపింగ్‌మాల్స్, వస్త్ర దుకాణాలు, కాంప్లెక్స్‌ల్లో వ్యాపారాలు చేసే షాపులపై ఈ ఆదనపు బాదుడు పడనుంది. దీంతో వ్యాపారులు పెరిగిన విద్యుత్ ఛార్జీలను ప్రజలపై వేయనున్నారు. ప్రత్యక్షంగా విద్యుత్ ఛార్జీలు కమర్షియల్ రంగంపై పడుతున్నప్పటికి పరోక్షంగా మాత్రం ఆ భారం ప్రజలపైనే పడనుంది. రాష్ట్రప్రభుత్వం గృహవిద్యుత్ వినియోగంపై కరుణ చూపించినప్పటికి వ్యాపార వర్గాలపై మాత్రం కొరఢా ఝుళిపించింది. వ్యాపారులు దాన్ని ఆసరాగా చేసుకుని ఆ భారాన్ని ప్రజలపైనే వేయనున్నారు.
ప్రధానంగా వేసవికాలం కావడంతో షాపింగ్‌మాల్స్, ఇతర వాణిజ్యపరమైన షాపుల్లో విద్యుత్ వినియోగం భారీగా పెరగనుంది. ప్రతి షాపులోను నిత్యం ఇక ఎయిర్‌కూలర్స్ మోత మోగనున్నాయి. పెరిగిన విద్యుత్ ఛార్జీల మూలంగా సన్న, చిన్నకారు వర్గానికి చెందిన వ్యాపారులు ఏసిల వినియోగం తగ్గించుకున్నా బడా వ్యాపారులు మాత్రం ఆ వాడకాన్ని నియంత్రించలేని పరిస్థితి నెలకొంది. మొత్తంమీద ఎపిఇఆర్‌సి పెంచిన విద్యుత్ ఛార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి రానుండటంతో అన్నివర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ప్రధాన ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.