ప్రకాశం

దేశ రక్షణకోసం సైనికులు చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,అక్టోబర్ 21: దేశ రక్షణకోసం సైనికులు చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు కొనియాడారు. ఆదివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని నగరంలోని పోలీసు పేరెడ్ మైదానంలో మంత్రి శిద్దా, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్, జిల్లా ఎస్‌పి బి సత్యఏసుబాబు, సంతనూతలపాడు మాజీ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, అదనపు ఎస్‌పిలు లావణ్యలక్ష్మి, శివారెడ్డి,పోలీసుర అమరవీరుల కుటుంబ సభ్యులు అమరవీరుల స్మారక స్ధూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్బంగా జరిగిన సమావేశంలో మంత్రి శిద్దా మాట్లాడుతూ 1959 సంవత్సరం అక్టోబర్ 21వతేదీన భారత్ -చైనా సరిహద్దుల్లోని అక్సాయ్‌చిన్ ప్రాంతంలో భారత్ సాయుధ దళాతలు చైనా సైన్యంతో పోరాటం చేసిన సమయంలో పదిమంది భారత సైనికులు అమరులైనారని, అప్పటినుండి ఆరోజును అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నామన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి ఇప్పటివరకు దేశంకోసం 35215మంది పోలీసులు ప్రాణాలు విడిచారన్నారు. ప్రస్తుత సంవత్సరంలో 414మంది అశువులు బాసారన్నారు. వారి ప్రాణత్యాగం ఎంతో మంది ప్రాణాలను కాపాడిందన్నారు. దేశ సమగ్రతను, సరిహద్దులను చెరగనీయకుండా వారి రక్తాన్ని ధారపోసి కోట్లాదిమంది ప్రజల కోసం అమరులైన సైనికులు, పోలీసులందరికి, వారి కుటుంబ సభ్యులకు వందనాలు తెలిపారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడేది సైనికులు, పోలీసులేనని కొనియాడారు. వారు చేసిన త్యాగాలు, సేవలు మరవలేనివని, అమూల్యమైనవని తెలిపారు. ప్రపంచంలో మల్టీటాస్కింగ్ అనే కంప్యూటర్ పదానికి అర్ధం యూనిఫారం వేసుకున్న వ్యక్తిలోనే కనపడుతుందన్నారు. మన ప్రతి అడుగుకు పోలీసు వ్యవస్ధ ఎంతో అవసరం ఉందన్నారు. కోట్లాధిమంది ప్రజలు ప్రశాంతంగా నిద్రిస్తున్నారంటే అందుకు కారణం పోలీసు వ్యవస్ధేనని తెలిపారు. ప్రకాశం జిల్లాకుచెందిన ఆరుమంది పోలీసు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో అమరులైనారని, వారి కుటుంబాలకు వాళ్ళులేని లోటును తీర్చలేనిదన్నారు. వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.
జిల్లాపోలీసు అధికారి బి సత్యఏసుబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు, సమాజ శ్రేయస్సు కోసం సైనికులు, పోలీసులు అహర్నిశలు పోరాడుతున్నారని తెలిపారు. ఈపోరాటంలో ప్రాణ త్యాగంచేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగనిరతిని, స్పూర్తిని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. వారి మహోన్నత త్యాగాలు ప్రజలు ప్రశాంత జీవనానికి పునాదులన్నారు. జిల్లాకు చెందిన సివి రత్నం, కెపి ప్రశాంతరావు, లేళ్ళ శంకర్, మోట ఆంజనేయులు, అద్దంకి సాల్మన్‌కేరి వెస్లీ, షేక్ మహమ్మద్ రఫీలు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయి అమరులైనట్లు తెలిపారు. పోలీసు అమరవీరులందరికి ఈసందర్బంగా జోహర్లు అర్పిస్తున్నామన్నారు. అనంతరం పరిపాలన అదనపు ఎస్‌పి లావణ్యలక్ష్మి గత ఏడాది సెప్టెంబర్ నెలనుండి ఈ ఏడాది ఆగస్టునెల వరకు దేశరక్షణ కోసం కోసం ప్రాణాలర్పించిన 414 మందికి గౌరవ వందనం చేశారు. ఈసందర్బంగా రెండునిమీషాల పాటు పోలీసు అమరవీరుల ఆత్మకు శాంతికలగాలన్నారు. ఈకార్యక్రమంలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో విజేతలైన వివిధ కళాశాలల, పాఠశాలల విద్యార్ధిని, విద్యార్ధులకు, పోలీసుఅధికారులకు ప్రశంసాపత్రాలు, బహుమతులను మంత్రి, శాసనసభ్యులు, ఎస్‌పిలు అందచేశారు. అనంతరం అమరులైన ఆరుమంది పోలీసుల కుటుంబాలకు పతాక నిధినుండి ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయాన్ని మంత్రి అందచేసి శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం నగరంలో పోలీసులురు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఉప రవాణాశాఖాధికారి సుబ్బారావు, డిఎస్‌పిలు శ్రీనివాసరావు, మరియదాసు, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, లక్ష్మినారాయణ, వై శ్రీనివాసులు, వేణుగోపాల్, సిఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.