ప్రార్థన

యేసు రక్తము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా! -1 పేతురు 1:18-19
ఆ దినాలలో పొంతు గలతీయ కప్పదొకియ ఆసియ బితునియ అను దేశముల యందు ఉన్న వారికందరికి పేతురు భక్తుడు వ్రాసిన మాటలు ఇవి. వారు ఆ దినములలో యేసు ప్రభువు యొక్క యజ్ఞము ఎరిగినటు వంటి వారు. క్రీస్తు మానవాళి కొరకు పడిన కష్టాలు, సిలువ యాత్ర అంతటిని చూసినవారు, అంతేకాదు చివరి బొట్టు వరకు రక్తము ధారబోసిన యేసు ప్రభువును చూసిన వారు గనుక వారెరుగుదురు. అయితే ఈ సంగతులు మనము కూడా తెలిసికోవాలని భక్తుడు పేతురు ద్వారా దేవుడు వ్రాయించాడు.
సిల్వలో మనకై కార్చెను యేసు రక్తము
శిలలైన వారిని మార్చును యేసు రక్తము
సమకూర్చును దేవునితో యేసు రక్తము
సమాధానపరచును యేసు రక్తము
నీతిమంతులుగా చేయును యేసు రక్తము
రోగములను బాపును యేసు రక్తము
ప్రతి పాపమును కడిగివేయును యేసు రక్తము
దురాత్మలను పారద్రోలును యేసు రక్తము
శక్తి బలము సంతోషమునిచ్చును యేసు రక్తము
సంపూర్ణ శాంతి ఇచ్చును యేసు రక్తము
అమూల్యమైనది యేసు రక్తము.
యేసు క్రీస్తు మన పాపములకు శాంతికరమై యున్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై యున్నాడు. - 1 యోహాను 2:2.
మనమేదో మంచివారమని గొప్పవారమని మంచి మంచి పదవులలో ఉన్నామని కాదు గానీ ఆయన ఉచితమైన కృపను బట్టి మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక! - ప్రకటన 1:6.
సర్వశక్తిగల దేవునికి వ్యతిరేకముగా మానవుడు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. మానవ శరీరము ధరించాల్సి వచ్చింది. ఈ తగ్గింపునకు కారణము ఆయన ప్రేమయే. ఆ ప్రేమ లేకపోతే మనుషులను, అంటే ప్రాణము పోయిన వారిని చెత్త కంటె హీనంగా చూస్తున్నారు. వాస్తవానికి దేవుని నీతి ముందు మన నీతి మురికిగుడ్డ లాంటిదే. దేవుని పరిశుద్ధత ముందు మనము చెత్తలాంటి వారమే. అయినా తన ఉచిత కృపను బట్టి మన వంటి వాడు కావలసి వచ్చెను. ఈయన మన కొరకు పరలోకము నుండి వచ్చిన మన్నా. జీవాహారము యేసే. అరణ్యములో ఇశ్రాయేలీయులు మన్నా తినినను చనిపోయారు కానీ జీవాహారము మనకు నిత్య జీవము ఇస్తుంది. అరణ్యములో మోషే ద్వారా వచ్చిన మన్నా ఒక్కరోజే ఉండేది. ఆ తరువాత ఎంత ఎక్కువ మిగుల్చుకున్నా అది పాడైపోయేది. కానీ క్రీస్తు మనకు జీవాహారమై యున్నాడు. ఆయన మాటలు మనకు ఆత్మయు జీవమునై యున్నవి. మన తండ్రియైన దేవుని చిత్తప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకున్నాడు. బలిగా అర్పించుకొన్నాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తము క్రీస్తు సిలువలో రక్తము కార్చి చెల్లించాడు. మన కోసం తండ్రికి ప్రార్థించినప్పుడు కూడా చెమట రక్తముగా మారునంతగా ప్రార్థించాడు. అంతేకాదు తన చివరి రక్తపుబొట్టు కూడా కార్చి మన పాపాలు కడిగివేశాడు. మన అంటే లోకములో ఉన్నవారందరు. అంటే ఆదాము మొదలు యుగాంతములో చివర పుట్టేవారి వరకు.
అసలు రక్తము చిందించటము, ఆదాము పాపము చేసి దిగంబరిగా ఉన్నామని దేవునికి భయపడి చెట్ల చాటున దాగి యున్నప్పుడు మొదలైంది. హవ్వ ఆదాము అంజూరపు ఆకులు కుట్టి ధరించుకున్నారు. అయితే దేవుడు వారికి చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. దేవుని కృప కార్యము ఇక్కడ కనపడుతోంది. హవ్వ ఆదాముల పాపమును వారు కప్పుకోలేకపోయారు. వారి స్వంత పనులతో దేవుని ముందు నిలువబడ లేకపోయారు. అప్పుడు దేవుడే ఒక పశువును వధించి దాని చర్మముతో వారిరువురిని కప్పినట్లు తెలుస్తుంది.
శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరింపబడిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్తమ్రులను నాకు ధరింపజేసి యున్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి యున్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. - యెషయా 61:10.
యేసు క్రీస్తు మనకు రక్షణ వస్త్రాలివ్వటానికి సిలువలో బలియాగమయ్యాడు. ఆయన ఇచ్చే రక్షణ వస్తమ్రులు ధరించుకుంటేనే పరిశుద్ధుడైన దేవుని ముందు నీతిమంతులముగా కనబడుతాము. మన స్వంత నీతి పనికిరాదు. యేసు క్రీస్తు చిందించిన రక్తములో మనము కడుగబడాల్సిందే.
పాప పరిహారానికి నిర్దోషమైన గొఱ్ఱెపిల్లలను బలి అర్పించేవారు. ఈలాగు ఏటేటా బలులు అర్పిస్తూ వచ్చేవారు. పస్కాను ఈ రీతి ఆచరించేవారు. బలి అర్పించిన వాటి రక్తము ద్వారా బంధపు రెండు నిలువు కమీల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాని తినవలెను.
వారి ద్వారబంధముల మీద పైకమ్మిల మీద చిలకరించిన రక్తాన్ని చూసినప్పుడు మరణం వారిని నశింపచేయక దాటిపోవును. ఐగుప్తీయులను పాడుచేసిన ఆ తెగులు వారిని దాటిపోయేది.
ఏటేటా అర్పించే బలులకు బదులు క్రీస్తు సిలువపైన తన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తాన్ని అర్పించి, సమాప్తమైనదని పలికాడు. పశువులనైతే ప్రతి ఏడాది బలులు అర్పించాలి కానీ ప్రభువు యొక్క సిలువ వల్ల అవన్నీ సమాప్తమైనవి. క్రీస్తు చేసిన ఈ యజ్ఞము లోకమంతటి పాప పరిహారార్థము. దేవునికి మహిమ కలుగునుగాక.
ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. - హెబ్రీ. 9:22.
రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. - లేవీ.17:11.
దేవుని కృపా మహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియుని యందు ప్రభువు రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి యున్నది. - ఎఫెసీ.1:7.
మన యతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. - యెషయా 53:5.
పాత నిబంధన కాలమంతటిలో చూస్తే ఏటేటా పాప పరిహార బలులు అర్పిస్తూ ఉండేవారు. అయితే మానవ పాపాలకు పూర్తిగా పరిహారం చెల్లించలేకపోయారు. కానీ నూతన నిబంధనలో క్రీస్తు లోక పాపములను మోసికొనిపోయే గొఱ్ఱెపిల్లగా ఈ లోకానికి మానవ రూపములోనే వచ్చాడు.
మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి - ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల. నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటి వాడాయెననని నేనెవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన. - యోహాను 1:29-30.
పౌలు గారు కూడా క్రీస్తును ఒక పస్కా పశువుగా వధించబడ్డాడని కొరింథీయులకు తెలియజేశాడు. పస్కా పశువును వధించి బలి అర్పించిన తరువాత దాని మాంసమును ఎలా భుజిస్తారో, అలాగే క్రీస్తు కూడా చెప్తూ ఉన్నాడు. జీవాహారము నేనే - యోహాను 6:47-49. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమిదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. - యోహాను 6:50-51.
ఈ మాటలు వినిన యూదులు ఆశ్చర్యపోయి ఈయన తన శరీరమును ఎలా తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించుకొనిరి. అయితే ప్రభువు వారితో, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని, మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు. అంత్య దినమున నేను వాని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచియుందును. - యోహాను 6:52-56
దయచేసి ఈ మాటలను ప్రార్థనా పూర్వకముగాను, ఆత్మీయముగాను అర్థము చేసికోవాలని నా మనవి. ఎందుకంటే ఈ మాటలు విన్న యేసు ప్రభువు శిష్యులు అనేకులు ఇది కఠినమైన మాట. ఇది ఎవడు వినగలరని చెప్పుకొనిరి. అంతేకాదు వారిలో అనేకులు ప్రభువును వదలి వెళ్లిపోయారు. తిరిగి ఎన్నటికి రాలేదట. అయితే పండ్రెండు మంది శిష్యులు మాత్రము నీవు నిత్యజీవపు మాటలు గలవాడవు. దేవుని పరిశుద్ధుడవని మాకు తెలుసు గనుక మేము మాత్రము నిన్ను వదలమని ప్రభువుతోనే ఉన్నారు.
ఒక సంగతి, మన శరీరము కేవలము నిష్ప్రయోజనమని మనము తెలుసుకోవాలి. శక్తి కోల్పోయిన తరువాత, అనారోగ్యములో ఉన్నప్పుడు, వయస్సు ఉడిగిన తరువాత ఈ శరీరము ఎంత నిష్ప్రయోజనమో మనకు తెలుసు. వాస్తవానికి ఈ శరీరమును బట్టి కాదు, ఈ శరీర పోషణను బట్టి కాదు ప్రభువు మాట్లాడుతుంది, ఈ క్షయమైన శరీరమును బట్టి కానేకాదు గానీ అక్షయమగు జీవితమును గురించి మాట్లాడుతున్నాడు.
నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై యున్నవి. - యోహాను 6:63
జీవాహారము ఆయన మాటలే. ఆదియందు ఉన్న ఆ వాక్యమే, దేవుడై యున్న ఆ వాక్యమే శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయన మాటలే మనలను జీవింప చేయును. మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి అని ప్రభువు జీవిస్తున్నాడు. వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయండి అని పౌలు భక్తుడు కూడా వ్రాస్తున్నాడు.
ఇశ్రాయేలీయులు రక్షింపబడింది వాళ్ల మంచితనము వల్ల కాదు, వాళ్ల మంచి పనుల వల్ల కాదు గానీ వారి గుమ్మముల మీద చిలకరించబడిన వధించబడిన పశువు యొక్క రక్తమును బట్టి. గుమ్మముల మీద ఆ రక్తపు గుర్తులేని ఇండ్లన్ని ఎలా ఏడ్పులతో మొదటి సంతానపు శవములతో నిండి యున్నవో మనకు తెలుసు.
క్రీస్తు మాటలు విని ఆయనను అంగీకరించిన వారికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము ఇచ్చెను. ఆ పిల్లలు ఇక దేవుని వలన పుట్టినవారే గాని, రక్తము వలననైనను శరీరేచ్ఛల వలననైనను మనుషేచ్ఛల వలననైనను పుట్టినవారు కారు.
వీటన్నిటిని బట్టి చూస్తే క్రీస్తు శరీరమును తినుట, ఆయన రక్తము త్రాగుట అంటే ఆయన మాటలను మన శరీరములలో నింపుకొనుట. ఆయన మాటలు ఆత్మయు జీవమునై యున్నవి. అంటే ఆత్మయు జీవమును మనలో ప్రవహిస్తూ పనిచేస్తూ ఉంటాయన్న మాట. మన శరీరాలకు రక్తము ఎంత ఉపయోగకరమో తెలుసు గదా! మన ప్రాణము రక్తములోనే ఉంది. అది ఆగిపోతే మనం మరణించినట్లే. కారణము శరీరములో ఉన్న ప్రతి అవయవానికి ప్రతి భాగానికి గుండెకు, ఊపిరితిత్తులకు మెదడుకు కళ్లకు కాళ్లకు చేతులకు కావలసిన పోషక ఆహారాన్ని అందించేది ఈ రక్తమే. సగటు మనిషి శరీరమంతటిలో 37.2 ట్రిలియన్ సెల్స్ ఉంటాయని శాస్తవ్రేత్తల అంచనా. అయితే వాటన్నిటికి కావలసిన పోషకాహారములు, విటమిన్లు, ఎలక్ట్రోలైట్స్ అందించేది మన రక్తమే. మనలో ఉన్న రక్తనాళాల పొడవును కొలిస్తే సుమారు 60వేల మైళ్లు అంటే 1,00,000 కిలోమీటర్లు ఉంటుందట. ఈ రక్తనాళాలు మనకు కావలసిన ప్రాణ వాయువు (02)ను అందించి, అక్కడ ఉన్న చెడును (సిఓ2)ను తీసివేస్తుంది. అంతేకాదు పోషకాహారాలను అందించి అవసరమైన మలిన పదార్థాలను విసర్జించుటలో సహాయపడుతోంది. మన రక్తములో ఉన్న యాంటీ బాడీస్ వల్ల మన శరీరములోనికి ప్రవేశించిన బాక్టీరియాను చంపివేస్తాయి. నేచురల్ డిఫెన్స్ మెకానిజమ్.
మన శరీరములో ఉన్న తెల్ల రక్త కణాలు మన శరీరములోనికి ప్రవేశించిన బాక్టీరియాల నుండి కాపాడతాయి.
జ్దీజఆళ ఱ్య్యజూ ళళఒ (జీఱ4), ఘఒ్య ష్ఘళజూ జళశర్యీషకఆళఒ, ఆ్దళక ఘూళ ఆ్దళ షళఒ యచి ఆ్దళ జౄౄఖశళ ఒకఒఆళౄ ఆ్ద్ఘఆ ఘూళ జశ్ప్య్పళజూ జశ ఔ్యఆళషఆజశ ఆ్దళ ఱ్యజూక ఘ్ఘజశఒఆ ఇ్యఆ్ద జశఛిళషఆజ్యఖఒ జూజఒళ్ఘఒళ ఘశజూ చ్యిళజశ జశ్ప్ఘజూళూఒ.
మన శరీరములో ఏ భాగానికి రక్తమందకపోయినా ఏ కణానికి రక్తమందకపోయినా ఆ కణం నశించిపోతుంది. అంటే రక్తప్రసరణ లేకపోతే శరీరములో ఉన్న కణాలన్నీ చనిపోతాయన్న మాట. ఒక్కొక్క కణం ఒక ఫ్యాక్టరీలా ఉంటుంది గనుక, ఆ ఫ్యాక్టరీ నడవటానికి కావలసిన దాన్ని రక్తమే అందిస్తుంది. నిజముగా మన శరీర నిర్మాణము యొక్క లోతు అంతుచిక్కనిది. అందుకే కీర్తనకారుడు అంటాడు -
నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నవి. - కీర్తన 139:14.
దీనంతటిని బట్టి మనకు తెలుస్తున్న విషయమేమంటే, శరీరానికి ఆహారము నీరు ఎంత అవసరమో - ఆత్మీయ జీవితానికి దేవుని వాక్యము అంత అవసరము. దేవుని వాక్యము మనకు ఆహారముగా, ఆత్మీయ బలాన్ని ఎదుగుదలను కలిగిస్తుంది. ఇంకొక విధముగా రక్తమువలె మనలో ప్రవహిస్తూ ప్రతి కణానికి ఏమేమి అవసరమో వాటిని అందిస్తూ, అనవసరమైన పదార్థాలను బైటకు పంపివేయటానికి, మనలోనికి వచ్చి మనలను బలహీనపరచే కోపాన్నీ, ద్వేషాన్నీ, అసూయను, ఉద్రేకాన్ని, కక్షలను, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, మత్తతలను, కలహమును భేదములను, అబద్ధములను కనుగొని, వాటిని మనలో పని చేయనీయకుండా చేస్తాయి. బాక్టీరియాను రక్తములో ఉన్న యాంటీబాడీస్ ఎలా ఎదుర్కొంటాయో, మనలో ఉన్న దైవవాక్యము అలా పని చేస్తుంది. వాక్య బలము మనలో ఉండవలసినంత లేకుంటే మనలోనికి ప్రవేశించే బాక్టీరియా లాంటి కోపానికో కాముకత్వానికో కక్షలకో జారత్వానికో అసూయకో ద్వేషానికో లోనవుతాము గనుక వాటికి సంబంధించిన జబ్బులలో పడిపోయి చివరకు మరణించాల్సి ఉంటుంది. ఇలాంటి జబ్బులలో ఉన్నవారు ఎవరైనా వాక్యాన్ని చదివి ధ్యానిస్తూ ఉంటే అవి నయవౌతాయి. దావీదు వ్రాసిన మాటలు చూస్తే-
నీ వాక్యము నన్ను బ్రతికించి యున్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నదని, దేవుని మాటలను పాటిస్తే అవమానము కలుగదని, హృదయములో ఉన్న ఆ మాటలు పాపము చేయనియ్యవని, సంతోషాన్ని మంచి ఆలోచనను ఇచ్చునని, స్థిరపరచునని, వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు త్రిప్పివేయునని, అవమానమును కొట్టివేయునని, జ్ఞానాన్ని కలుగజేయునని, వెలుగునిచ్చునని, అడుగులు స్థిరపరచి ఏ పాపము చేయనివ్వదని, రక్షణలో నడిపించునని, నెమ్మదినిచ్చునని తెలిపాడు. ఇంకా ఎన్నో మేలులు మనకు కలుగును. ఇవన్నీ మనందరి జీవితాలలో జరిగి, ముందుగా ఆయన రక్తములో మన పాపములు కడుగబడి, ఇకను దాని జోలికి పోకుండా ఉండటానికి ఆయన వాక్కును మనలో నింపుకొని బలపడటానికి ఆరోగ్యముగా సంతోష సమాధానాలతో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక.
* లోక పాపములు మోసికొని పోవు గొఱ్ఱెపిల్ల అని యేసును పిలుచుట పోలిక కొరకే. అలానే ఆయన శరీరము రక్తము అంటే ఆయన జీవపు మాటలే.*

- మద్దు పీటర్ 9490651256