ప్రార్థన

గర్వము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నాశనమునకు ముందు గర్వము నడచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును’ - సామెతలు 16:18
నేను గొప్పవాడిని బలవంతుడను ఐశ్వర్యవంతుడను విద్యావంతుడను జ్ఞానవంతుడను నా కంటె గొప్ప వారెవరు లేరు. అందగాడిని తెలివిగలవాడనని నాకంటె మంచి ఆటగాడు గానీ పోటుగాడు కానీ లేడని విర్రవీగుతారు. చివరకు పప్పులో కాలేస్తారు.
అలా అనుకొని గర్వించిన ఎంతో ఖరీదైన ఐపీయల్ ఆటగాడు ఇప్పుడు కారు డిక్కీలో జీవించాల్సి వచ్చింది. ఇతను ఎవరో కాదు ఆస్ట్రేలియా క్రికెటర్ ల్యూక్ పోమర్స్. ఒకప్పుడు తారాజువ్వలా ఎగసిపడిన ల్యూక్ జీవితం ఒక్కసారిగా అగాధములో పడింది. 2007లో జరిగిన టి-20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెటర్‌గా కెరియర్ ప్రారంభించిన ల్యూక్ అనతి కాలములోనే విదేశీ మ్యాచ్‌ల్లో ఆడాడు. ఆ తరువాత అత్యంత ఖరీదైన ఐపీఎల్ సీజన్‌లో 3లక్షల డాలర్లు పలికి ప్రశంసలందుకున్నాడు. ఐపీఎల్ సీజన్‌లో నిర్విరామంగా నాలుగేళ్లపాటు కొనసాగాడు. ఆ నాలుగేళ్లలో వద్దంటే వచ్చిపడే డబ్బు, ఎండార్స్‌మెంట్స్, యాడ్స్ ఇంకేముంది ఎక్కడలేని అహంకారము మొదలైంది. నైతిక విలువలు తగ్గిపోయాయి. అమెరికా యువతిని వేధించి, తన బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ పడి జైలు పాలయ్యాడు. అప్పుడే ల్యూక్ పతనం మొదలైంది. ఆ అరెస్ట్ సమయములో ఐపీఎల్ నుండి బహిష్కరణకు గురయ్యాడు. ఆ తరువాత 2014లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. బార్‌లో గొడవ, బైక్ దొంగతనము ఇలా ఒక తప్పు తరువాత ఇంకొకటి చేస్తూ, పరిణామాలు అనుభవిస్తూ జీవిస్తూ ఉండేవాడు. ఆస్తులన్నీ హరించుకు పోవటం వల్ల చివరకు రోడ్డున పడ్డాడు. నిలువ నీడలేక కారు డిక్కీలో తలదాచుకొంటున్నాడు. దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం పోలీసుల చేతులలో ఉన్నాడట.
ఎవని గర్వము వానిని తగ్గించును.
వినయ మనస్కుడు ఘనత నొందును - సామెతలు 29:23
గర్వము ఎంతగా పతనానికి దారి తీస్తుందో, ప్రభువే ఒక ఉపమానము తెలియజేశాడు. అదే తప్పిపోయిన కుమారుని ఉపమానము. తండ్రి చాటున ఎంతో చక్కగా ఎదుగుచున్నవాడు. అన్నీ సమృద్ధిగా ఉండటం వల్ల కష్టమంటే ఆకలంటే ఏమిటో తెలియనివాడు గర్వించి తండ్రి ఆస్తిలో సగభాగమును ఇమ్మని అడిగి, తీసికొని అంతటిని కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసాడు. ఆస్తి అంత ఖర్చు అయిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడసాగి, వెళ్లి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరి పందులను మేపే పని చేస్తున్నాడు. చూడండి. ఎవని గర్వము వానిని ఎంతగా తగ్గించునో గదా. గొప్ప ఆస్తిపరుడై ఏ కొదువ లేకుండా తండ్రి చాటున హాయిగా సంతోషంగా జీవిస్తున్న వాడు, చెడు సహవాసాలకు పోయి ఇంకా ఏదో అనుభవిద్దామని తన వాటా ఆస్తి అంతా తీసికొనిపోయి, చివరకు తన ఇంట్లో ఉన్న కూలివాండ్రు సమృద్ధిగా ఉన్నారని తెలుసుకున్నాడు. అంటే కూలి వాళ్ల కంటె తన పరిస్థితి ఎంతగా దిగజారిందో చూడండి. ఎంతటి వాడినైనా గర్వము నాశనమునకు పతనానికి నడిపిస్తుంది. అయినా గర్వించటానికి వాడి దగ్గర ఏముంది. తండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తి. ఆయన ఎంతో కట్టుబాట్లతో ఉండి పొదుపుగా జీవించుట వల్ల అంత ఆస్తి సమకూడిందని, దానిని చూసి గర్వించటం తప్పు. తండ్రితోనే ఉండి, తండ్రి పనిలో సహాయపడినట్లయితే ఇంకా ఎంతో అభివృద్ధి చెందేవాడు. కానీ గర్వముతో తండ్రికి దూరమయ్యాడు.
చాలమటుకు మనుష్యులు అదే స్థితిలో ఉన్నారు. దేవుడిచ్చిన ఆస్తి అంతస్తులు చక్కని కుటుంబము మంచి ఉద్యోగము చక్కని భార్య పిల్లలు మంచి తల్లిదండ్రులు. అన్నీ సవ్యంగా జరిగిపోతూ ఉన్నప్పుడు నాకేంటి, నేను గొప్పవాణ్ని నేను పట్టిందల్లా బంగారమే అనుకొని గర్వించి, ఇన్ని చేసి వాటిని అనుభవించటానికి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుని మరచిపోయి దేవుని కట్టడలు నిబంధనలు మరచిపోయి, లోక అలవాట్లకు, వ్యసనాలకు బానిసలై, జీవితాలను చెల్లాచెదరు చేసుకుంటున్నారు. ‘ఉయఆజఒౄ ఖఆజ్ఘౄఆళక ఘ్పళఒ ఔళ్యఔళ ళౄఔఆక’.
ఒకవేళ నీకు గర్వము లేకఫోవచ్చు కానీ, గర్విష్ఠులతో తిరుగకూడదని వాక్యము సెలవిస్తుంది.
గర్విష్ఠులతోనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. - కీర్తన 40:4
గర్విష్ఠులు త్రోవ విడిచి, తల్లిదండ్రులను అన్నదమ్ములను అక్కచెల్లెళ్లను పట్టించుకోక పెద్దలను గౌరవించక విచ్చలవిడిగా జీవిస్తుంటారు. ముందు వారి పోకడలు బాగానే ఉంటాయి కానీ చివరకు పతనానికి దారితీస్తాయి. సమస్తాన్ని కోల్పోతారు. వారిని వెంబడించేవారి సంగతి కూడా చివరకు అంతే అవుతుంది. గర్విష్ఠులతో సహవాసముండుట వల్ల వారు చేసిన చెడు పనులలో నీవు కూడా భాగస్తుడవై శిక్షకు అర్హుడవౌతావు. దేవుని నమ్మి ఆయన వాక్యానుసారంగా జీవిస్తే అది గొప్ప ధన్యత.
మా నాలుకల చేత మేము సాధించెదము మా పెదవులు మావి, మాకు ప్రభువెవడని వారనుకొందురు. అయితే యెహోవా ఇచ్చకములాడు పెదవుల నన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును - కీర్తన 12:4
కారణము - గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు దేవునికి అసహ్యములు.
లోకుల చెడుతనమును బట్టియు, దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షింపబోవుచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించెదను బలత్కారుల గర్వమును అణచివేసెదను - యెషయా 13:11
భక్తిపరులలో కూడ కొంత మందిలో గర్వము కనపడకుండా ఉంటుంది. నేను చాలా భక్తిపరుడను బుద్ధిమంతుడను మంచివాడను. సిగరెట్టు తాగను మందు తాగను వ్యభిచరించను దొంగతనము చేయను అబద్ధమాడను దైవాజ్ఞలన్ని పాటిస్తాను. ఉపవాసముంటాను. దినమునకు మూడుసార్లు ప్రార్థిస్తాను. అన్యాయము చేయను. సుంకరి వంటి వాడను కాను అని గర్వంగా దేవునితోనే చెప్తారు. ఇది ప్రార్థన కాదు. మేమెంత మంచివారమో చూడు అని దేవునితో గర్వంగా చెప్పేవారు.
వారి గర్వము వలన మనుష్యులనేగాక చివరకు దేవునిని కూడా గుర్తించ లేకపోయారు. సర్వసృష్టికర్తనే గుర్తించలేక పోయారు. మాకు అన్నీ తెలుసు. అంతా తెలుసు. మేమే గొప్ప అనుకుంటూ చివరకు ప్రభువునే గుర్తించలేక ప్రభువుతోనే వాదములు పెట్టుకొని చివరకు ఆయనను సిలువకు అప్పగించారు, ఇది గర్వాంధకారముతో చేసిన పని అయినా ప్రభువు క్షమించాడు. ప్రభువు క్షమించుటకు సిద్ధంగా ఉంటాడు, గర్విష్ఠులు పోట్లాటకు సిద్ధంగా ఉంటారు. ఇంత సందు ఎప్పుడు దొరుకునా అని చూస్తూ ఉంటారు. గర్విష్ఠులలో మానవత్వం బొత్తిగా ఉండదు. అహంకారముతో నిండి ఉంటారు. తల్లిదండ్రులంటే గౌరవముండదు. దేవుడంటే ఆసక్తి ఉండదు. అంతేకాదు వారు చేసే కాస్త పని లోకమంతటికి తెలియాలన్నట్టు చేస్తూంటారు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అందుకే పరిసయ్యుని కంటె సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నానని ప్రభువు సెలవిచ్చాడు. అంతేకాదు గర్వముతో తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు ప్రభువు తెలిపాడు - లూకా 18:14
అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింప వలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. - ఇర్మియా 9:24
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాదు. అందుకే అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలెను.
అయితే పౌలు భక్తుడు గలతీయులకు వ్రాస్తూ - మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరవౌనుగాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేసును సిలువ వేయబడి యున్నామని తెలిపాడు.
ఎందుకంటే దేవుని ఉచితమైన కృప వల్లనే మనము ఇలా ఉన్నాము. ఎఫెసీయులకు పౌలు భక్తుడు వ్రాసిన పత్రికలో ఈలాగు తెలియజేశాడు.
మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రతికించెను మీరు వాటిని చేయుచు వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారి వలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాలివారమై యుంటిమి అయినను దేవుడు కరుణా సంపన్నుడై యుండి, మనము మన అపరాధముల చేత చచ్చినవారమై యుండినప్పుడు సహితము మన యెడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడ బ్రతికించెను. కృప చేతనే మీరు రక్షింపబడి యున్నారు. - ఎఫెసి 2:1-5
మనము కూడ ఆయన ఉచిత కృపనుబట్టియే ఇలా ఉన్నాము, అంతేగానీ మన గొప్పతనమో లేక తెలివియో కాదు. అందుకే అతిశయించువాడు, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుని బట్టియే అతిశయింపవలెను.
అయితే రాజైన ఉజ్జీయ 16 సం. ప్రాయములోనే తండ్రి తరువాత సింహాసనాన్ని అధిష్ఠించి దేవుని కిష్టుడయ్యాడు, ఎన్నో మేలులు పొందుకుని స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాడు. అతడు తండ్రియైన అమాజ్యా చర్య యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యధార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి గలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడతని వర్థిల్లజేసెను - 2 కొరింథీ 26:4-5
వాస్తవానికి యూదా ప్రజలు ఎంతో సంతోషించారు. ఎందుకంటే తన తండ్రి తాతగారి పరిపాలనలో దేవుని ఉగ్రత వారి మీదికి రావటం వల్ల చాలా బాధల ననుభవించారు. వాస్తవానికి 16 ఏళ్ల బాలుడు రాజవ్వటం ప్రజలు చాలా ఆలోచించారు. కానీ అతని మంచి ప్రవర్తనను బట్టి దేవుని ఆశీర్వాదం, కాపుదల ఆ రాజ్యము మీదకు వచ్చింది. 16 సం. సంవత్సరములప్పుడు రాజ్యాధికారం మొదలుపెట్టి 52 సం.లు యెరూషలేమును ఏలాడు. ఎంతో వినయంగా మొదలుపెట్టిన రాజ్యాధికారము, ఆయన దేవునికి లోబడి ఉన్నంత కాలము వృద్ధి చెందుతూనే ఉంది, ఎప్పుడైతే గర్వము తన లోనికి వచ్చిందో 52 సం.లలో జరిగిన వృద్ధి అంతా ఆగిపోయింది. దేవునికి విధేయుడై యున్నంతకాలము రాజ్యము అభివృద్ధి చెందింది. అతడు చేసిన పనులన్నీ మంచి ఫలితాలిచ్చాయి. ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాంతమును, యబ్నె ప్రాకారమును అష్డోదు ప్రాకారమును పడగొట్టి, అష్డోదు దేశమును ఫిలిష్తీయుల ప్రదేశములలోను ప్రాకారపు పురములను కట్టించెను. ఫిలిష్తీయులతోను గూర్భయలులో నివసించిన అరబీయులతోను మెహునీయులతోను అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను - 2 ది.వృత్తా. 26:6-7
దేవుని వాక్యానుసారంగా నడచినప్పుడు ఉజ్జీయ చేసిన యుద్ధము లన్నింటిలో దేవుడు జయాన్నిచ్చాడు. ఇక్కడ ఒక సంగతి గ్రహించాలి. ఇప్పుడు మనము చేస్తున్న ఆత్మీయ పోరాటములో సాతానును ఓడించాలంటే ప్రభువుతో నడవాల్సిందే. లేకపోతే పోరాటంలో ఓడిపోవచ్చు.
యాకోబు పత్రికలో 4:7లో చెప్పినట్లు
కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును.
మరియు ఉజ్జీయా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మముల దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను, దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరచెను. అనేక బావులను త్రవ్వించెను. విస్తారమైన పశువులుండెను. పొలములు ద్రాక్షతోటలు విస్తరించెను.
అమ్మోనీయులు ఉజ్జీయాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశము లన్నింటను వ్యాపించెను. మరియు ఉజ్జియా అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో వేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడువరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను.
అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. తన విజయానికి గొప్పతనానికి బలానికి శక్తిని కారణము ప్రభువేనని మరచిపోయాడు. అతడు స్థిరపడే వరకు అద్భుతమైన ప్రభువు హస్తము ఎలా సహాయపడిందో మరచాడు. కానీ అతడు గర్వించి యాజకులు మాత్రమే చేయవలసిన ధూపము వేయుటకు యెహోవా మందిరములో ప్రవేశించాడు. యాజకుడు వచ్చి అలా చేయకూడదు రాజా అని చెప్పినా రాజైన ఉజ్జీయ పట్టించుకోలేదు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని యాజకుడైన అజర్యా చెప్తూనే ఉన్నా గానీ, ఉజ్జీయ ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే యున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరును అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై యుండెను. గనుక వారు తడవు చేయక అక్కడ నుండి అతనిని బయటకు వెళ్లగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని యెరిగి బయటకు వెళ్లుటకు తానును త్వరపడెను. రాజైన ఉజ్జీయ తన మరణ దినము వరకు కుష్ఠ రోగియై యుండెను. కుష్ట రోగియై యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడెను. ఉజ్జీయ చివరకు అవమానముతోను అగౌరవముతో మరణించెను.
-జజూళ జఒ ఘ రీజళూ.
యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్టులను బాగుగా ఎరుగును.
ఎవడైనను మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క హిత వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపకు చిన్నమైన బోధ ఉపదేశించిన యెడల వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియు, వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాస పడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములును కలుగుచున్నవని పౌలు భక్తుడు తిమోతికి వ్రాసిన మొదటి ఉత్తరము ఆరవ అధ్యాయములో వివరించాడు.
నిచి తీళ ఘ్యతీ ఔజజూళ ఆ్య ఖళ ఖఒ, ద్యిజూ తీజ ఇళ యఖూ ళశళౄక ఘశజూ తీజ చిజదఆ ఘ్ఘజశఒఆ ఖఒ.
ఉజ్జీయా యొక్క ఫరిపాలనలో యూదాకు కలిగిన సమృద్ధిని భూగోళ శాస్తజ్ఞ్రులు పరిశోధన ద్వారా నిరూపించి యున్నారు. ఇతర యూదా రాజుల వలె ఇతడును అహంకారము అను పాపములో పడిపోయాడు. యాజకత్వపు హక్కు విషయములలో హద్దుమీరుటను బట్టి కుష్ఠు రోగముతో బాధింపబడి చనిపోయాడు.
నెబుకద్నెజరను బబులోను రాజు, ఫరో రాజు వలె పరిసయ్యుల వలె గర్వించి చిన్నవారిని బలహీనులను చాల తేలికగా చూసినటువంటి వారు. మనుషులను లెక్కచేయలేదు. దేవుని కూడా లెక్క చేయలేదు. కారణము తాను వృద్ధి పొంది ఎంతో బలవంతుడయ్యాడు. ఆయన ప్రభావము ఆకాశమంత ఎత్తు అయింది. ప్రభుత్వము భూలోకమంతట వ్యాపించటయే. అతని గర్వానికి దేవుడు వేసిన శిక్ష ఏమంటే అడవి జంతువుల మధ్య నివాసము, పశువులతోపాటు గడ్డి మేయుటము. ఇది ఏడు కాలములు జరిగిన తరువాత, నెబుకద్నెజరు మానవ బుద్ధి గలవాడై కండ్లు ఆకాశము తట్టు ఎత్తి, చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించాడు. దానియేలు చెప్పినట్టే తిరిగి తన రాజ్య సంబంధమగు ప్రభావము తేజస్సు ఘనతను పొందుకున్నాడు. తన రాజ్యము మరల స్థిరపడింది. అప్పుడు తాను చెప్పిన మాటలు
‘ఈలాగు నెబుకద్నెజరు అను నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నియు సత్యములును, ఆయన మార్గములు న్యాయములునై యున్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను’ - దానియేలు 4:37
దేవుని కృప వల్ల మనము ఎంతగా హెచ్చింపబడినా, గర్వము మనలోనికి రాకుండా, పరలోక సేనల యెడలను భూ నివాసుల యెడలను తన చిత్తము చొప్పున జరిగించుచున్న దేవుని స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచు ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి సహాయము చేయునుగాక.

- మద్దు పీటర్ 9490651256