ప్రసాదం

బొమ్మల సిద్ధాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ పర్యాయం అక్కడో ప్రపంచ గోష్ఠి జరుగుతోంది. ఆధ్యాత్మికానికి సంబంధించిన అనేక విషయాలమీద ప్రపంచ ప్రఖ్యాతమైన వ్యక్తులు ఆ సదస్సులో పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో ఆధ్యాత్మిక నిలయం గురువు అధ్యక్షోపన్యాసం చేశారు. ఆ ప్రసంగం యావత్తూ అనుభవపూర్వకంగా, సోదాహరణలతో ఎంతో ఆసక్తికరంగా చిన్న చిన్న ఘటనలు, సంఘటనలను ఉటంకిస్తూ మనసుకి హత్తుకునేలా ఉంది. తెలీని అతి కష్టమైన, క్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాలను అరటిపండు వొలిచి అరచేతిలో పెట్టినట్టు, తినిపించినట్టు అనుభవపూర్వకంగా, అద్భుతంగా ఉంది.

అదొక విద్యాలయం. అది ఓ ఆధ్యాత్మిక నిలయం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యాసంస్థ. అక్కడ విద్యావిధానం, బోధనా పద్ధతి అనుభవపూర్వకంగా వైవిధ్యభరితంగా ఉంటుంది. అక్కడి ప్రతి విద్యార్థి చదువుకుంటున్న విషయానికి సంబంధించిన పూర్తి జ్ఞానంతోపాటు, జీవితానికి సంబంధించిన విలువలాధారిత పరిజ్ఞానంతో ప్రతి విద్యార్థి ఓ వివేకానందునిలా ఉంటాడని చెప్పవచ్చు.
ఓ పర్యాయం అక్కడో ప్రపంచ గోష్ఠి జరుగుతోంది. ఆధ్యాత్మికానికి సంబంధించిన అనేక విషయాలమీద ప్రపంచ ప్రఖ్యాతమైన వ్యక్తులు ఆ సదస్సులో పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో ఆధ్యాత్మిక నిలయం గురువు అధ్యక్షోపన్యాసం చేశారు.
ఆ ప్రసంగం యావత్తూ అనుభవపూర్వకంగా, సోదాహరణలతో ఎంతో ఆసక్తికరంగా చిన్న చిన్న ఘటనలు, సంఘటనలను ఉటంకిస్తూ మనసుకి హత్తుకునేలా ఉంది. తెలీని అతి కష్టమైన, క్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాలను అరటిపండు వొలిచి అరచేతిలో పెట్టినట్టు, తినిపించినట్టు అనుభవపూర్వకంగా, అద్భుతంగా ఉంది.
ఆయన మహాక్లిష్టమైన హిందూ మతానికి సంబంధించిన తత్త్వ సిద్ధాంతాలమీద వివరణ ఇస్తున్నారు. నారికేళపాకం లాంటి క్లిష్టమైన సిద్ధంతాలవి. ఓ పట్టాన బుర్రకెక్కవు. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం- ఎంత లోతుల్లోకి వెళ్లినా ఇంకా లోతు ఉంటూనే ఉంటుంది. అర్థమైనట్టే అనిపిస్తుంది. ఏమి అర్థమైందో తెలీదు.
గమ్మత్తేమిటంటే ఆ రోజు గురువుగారు ఓ ప్రత్యేకమైన పద్ధతిలో పై సిద్ధాంతాలను విపులీకరిస్తున్నారు. మూడు టేబుళ్ళు వేయించారు. మూడు టేబ్ళుమీద మూడు పాత్రలు పెట్టేరు. పాత్రలలో మూడింతలు నీరు పోసేరు. మొదటి టేబుల్‌పై వున్న పాత్రలో ఓ కర్రబొమ్మ ఉంచేరు. రెండో పాత్రలో దూదితో చేసిన బొమ్మను వేసేరు. మూడో పాత్రలో చక్కెరతో చేసిన బొమ్మను వేసేరు. కొంచెంసేపు గడిచింది. శిష్యులందరినీ పిలిచి ఒక్కొక్కరినీ మూడు పాత్రలు, అందులో వేసిన బొమ్మల్ని చూపి వాళ్ళకి ఏమి అర్థమైందో చెప్పమన్నాడు. ఒక్కొక్క శిష్యుడు వచ్చి చూస్తున్నాడు. తనకేమి అర్థం అయ్యిందో చెపుతున్నారు. కొందరు తెలియటంలేదని తెల్లమొహం వేస్తున్నారు. గురువుగారు నవ్వుతున్నారు వాత్సల్యంతో. అందరి వంతు అయిపోయింది. అటు తిప్పి ఇటు తిప్పి చూసేరే కాని ఏమీ చెప్పలేకపోయారు.
అవ్యాజమైన ప్రేమతో శిష్యుల్ని మన్నించి విషయంలోకి వచ్చేరు గురువుగారు.
మొదటి పాత్రలో వున్న కొయ్యబొమ్మని పైకి తీసేరు. పాత్రలో నీరుండిపోయింది. బొమ్మ నీటిలో వేయడానికి ముందు ఎలా వుందో అలాగనే ఉంది నీటిలోంచి తీసిన తర్వాత కూడా! చూసేరా! ఇంతసేపు ఈ బొమ్మ నీటిలో వున్నా, నీటిలోంచి తీసిన తర్వాత కూడా అలానే వుంది. అంటే నీరూ ఉంది, బొమ్మలా వుంది. నీరూ బొమ్మా రెండూ ఉన్నాయి. ఇదే ద్వైతం అంటే అని వివరించారు గురువుగారు. శిష్యులంతా ఆనందంతో తలలూపేరు అర్థమైంది అన్నట్లు.
అపుడు రెండో బొమ్మని నీట్లోంచి తీసేరు. దూదితో చేసిన బొమ్మకదా, బొమ్మకి నీరుపట్టి ఉంది. కొంతసేపైన తర్వాత ఆ బొమ్మని చేత్తో పిండారు. నీరంతా బయటికి వచ్చి బొమ్మ మాత్రం మిగిలింది. అంటే నీటితో కలిసి ఒక్కటిగా ఉంది కానీ రెండుగా ఉండే తన స్వరూపాన్ని వదులుకోలేదు. వేర్వేరు అయ్యే తన అస్తిత్వాన్ని కోల్పోలేదు. ఒకటై ఉండి కూడా రెండుగా ఉండగలిగింది. ఇది విశిష్టాద్వైతం. శిష్యులు నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. అపుడు గురువుగారు మూడో తొట్టె దగ్గరకెళ్ళేరు. మూడో తొట్టెలో వున్న చక్కెర బొమ్మ లేనే లేదు. పూర్తిగా నీటిలో కరిగిపోయింది. నీటినుంచి వేరు చేసే అవకాశమే లేకుండా పోయింది. అంటే నీటిలో కరిగిపోయి ఉంది. అంటే ఏంటి? రెండు అన్నది లేనే లేదు. ఉన్నదంతా ఒక్కటే! ఇదే అద్వైతం అంటే! అని అందరికీ అర్థమయ్యేలా మూడు బొమ్మలతో అతి క్లిష్టమైన మూడు సిద్ధాంతాల్ని, వాటి వెనుకదాగి వున్న రహస్యాల్ని అతి సరళంగా బోధించారు. శిష్యులందరూ పరమానందం పొందేరు. అంతటి మహాగురువు తమ గరువైనందుకు మహదానందపడ్డారు.
తత్త్వాన్ని, తాత్త్వికాన్ని, తర్కాన్ని, తార్కికత్త్వాన్ని, సిద్ధాంతాన్ని, మీమాంసని ఇప్పటి తరానికి ఇపుడున్న వాతావరణానికి అనుగుణంగా అర్థం అయ్యేటట్లు వివరణ ఈయగలిగే, విశదీకరించగలిగే, విపులీకరించగలిగే గురువులు కావాలిపుడు. అలాంటి గురువుల్ని ప్రసాదించమని గురు పరంపరని ప్రార్దిద్దాం.
*