ప్రసాదం

తల్లిచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడు తాను ప్రతిచోట ఉండలేనని తల్లిని సృష్టించేడు అనంటారు పెద్దలు. తల్లిప్రేమ అంతటి గొప్పది. విశిష్టమైనది. మహోత్కృష్టమైనది.
ఓ ఆసామీ చెడు వ్యసనాలకు బానిసయ్యేడు. వేశ్యాలోలుడైపోయేడు. విచక్షణ, ఇంగిత జ్ఞానం కోల్పోయేడు. వేశ్య ఆ ఆసామీ తల్లి తలని అడిగింది. ఇచ్చితీరాలని పట్టుపట్టింది. తిన్నగా ఇంటికి వచ్చేడు. మూలన ఉన్న వేటకత్తితో తల్లి తలని నరికేడు. తల మొండం వేరయ్యాయి. ‘నెత్తురోడు తల్లి తలని చేత్తోపట్టుకుని పరుగుపరుగు వేశ్య దగ్గరకెళ్తున్నాడు. గదిలో అలిగి కూచున్న వేశ్యని సంతోషపెట్టాలని, గది ద్వారం దాటుతుండగా కాలికి ద్వారం తగిలి, తుళ్లిపడబోయేడు. ‘‘నాన్నా! నెమ్మదిగా వెళ్ళమ్మా? చూసుకు వెళ్ళమ్మా’’చేతిలో ఉన్న తల్లి తల బాధపడుతూ అభిమానపడింది. కళ్ళంట నీరుకార్చింది. ఇదీ తల్లి ప్రేమ గొప్పతనాన్ని చాటే మహత్తరమైన కథ.
ఓ తల్లి ఏడాది పిల్లను చంకన పెట్టుకుని మార్కెట్‌కి వెళ్ళింది. మధ్యలో అకస్మాత్తుగా పెద్ద వడగళ్ళతో కూడిన వర్షం ప్రారంభమయ్యింది. టపటప మని వడగళ్ళు పడుతున్నాయి. తలదాచుకోడానికి దగ్గరలో అనువైన ప్రదేశమేదీ లేదు. దడదడ పడుతున్న వడగళ్ళు తన పాపమీద పడకుండా తన తలని చేతులను పాపకి అడ్డంపెట్టి, చీర కొంగున దాచుకుని పిల్లకు తగలకుండా, అన్ని వడగళ్ళను తల మాడు పగులుతున్నా శరీరానికి కర్కశంగా తగులుతున్నా, బాధనంతా తానే భరించి తన పాపకి ఏమీ కాకుండా మెల్లగా ఇల్లుచేరుకుంది. అమ్మయ్య అనుకుంటూ ఆనందంతో పొంగిపోతూ, ఇంట్లో స్పృహతప్పి పడిపోయింది. తల్లి ప్రేమని చెప్పే మరో కరుణరస కథ ఇది.
తల్లిప్రేమ గొప్పదనాన్ని చెప్పే కథలు మన ఇతిహాసాలు పురాణాలు ప్రబంధాలు, కావ్యాలలో కోకొల్లలు. తల్లిప్రేమ గొప్పదనాన్ని పరోక్షంగా ప్రస్తావించే ఘట్టం మహాభారతంలో ఉంది. తల్లిప్రేమ ఔన్నత్యాన్ని పరోక్షంగా, తల్లి ప్రేమకి సాటి అయినది మరొకటి లోకాన మరోటి ఉండదు అనే సత్యాన్ని మనకి అందిస్తుందది.
కురుక్షేత్ర సంగ్రామం ముగిసిపోయింది. కౌరవులు నూర్గురు పాండవులు చేతిలో కుప్పకూలేరు. వంద మంది కొడుకులను కోల్పోయిన గాంధారి ధృతరాష్ట్రుల దుఃఖం వర్ణనాతీతంగా ఉంది. పుత్రశోకంతో విలపిస్తున్నారు. అనుక్షణం జరిగిన దాన్ని తలచుకొని తలచుకుని ఏడుస్తున్నారు. చూసిన వాళ్ళ హృదయాలు కరిగిపోయేలా అంత విషాదంగా ఉందక్కడి పరిస్థితి. ఆ సమయంలో గాంధారీ ధృతరాష్ట్రులను పరామర్శించి ఓదార్పుచెప్పాలని శ్రీక్రృష్ణుడు అక్కడకి వచ్చేడు.
విషాదం కూడిన కోపం, క్రోధం లోపల కృష్ణుని మీద తన్నుకొస్తున్నా, మగాడు కాబట్టి ధృతరాష్ట్రుడు ఉగ్గబట్టుకున్నాడు. వౌనంగా నిష్టూరం వ్యక్తమయ్యేలా ఊరుకున్నాడు. తల్లి కాబట్టి సహజమైన పుత్రవాత్సల్యంతో గుండెల్లోంచి ఉబికివస్తున్న కోపాన్ని గాంధారి ఆపుకోకపోయింది. కోపం, క్రోధం మిళితంకాగా శ్రీకృష్ణుడ్ని నిష్టూరాలాడింది. నింద వేసింది నిందించింది. ‘‘కృష్ణా నీకెందుకు అంత పక్షపాతం? నువ్వు భగవంతుడివి కదా! నువ్వు పాండవులను ఒకలా కౌరవులను మరొకలా చూడటం ధర్మమా? పాండవులు అయిదుగుర్నీ కంటికి రెప్పలా కాపాడేవు. వాళ్ళు అంత ప్రియం నీకు. కౌరవులు నీకు అంతటి అప్రియం అవడానికి కారణమేంటి? ఇంతటి పక్షపాతం నీకుండుట తగునా? నీకది న్యాయమా శ్రీకృష్ణా! పోనీ కౌరవులు నీకు అప్రియమే అగుగాక. నువ్వు మాకుకూడా దూరపు బంధువువేకదా! నా నూరుగురు కుమారులలో ఒక్కరినైనా కాపాడడానికి నీకు మనసెందుకు రాలేదు? ఈ ముసలి తల్లితండ్రుల మీద కనీసం జాలిపడి అయినా, తల్లిదండ్రులకు ఉత్తరక్రియలు జరపటానికైనా కనీసం ఒక్కడినైనా కాపాడలేక పోయేవు. మా ఇద్దరి మీదా ఆమాత్రం కనికరం పుట్టలేదా? అంతటి కఠినాత్ముడివి నువ్వు’’అని శ్రీకృష్ణుడ్ని నిలదీసింది గాంధారి. నిగ్గుతీసి నిలబెట్టి అడిగింది.
గాంధారి తనని అంతలా నిందించినా క్రృష్ణుడు కోపం తెచ్చుకోలేదు. అనునయంగానే ‘‘అత్తా! పుత్రులు పోయిన శోకంతో ఉచితానుచితాలు మరచిపోతున్నావు నువ్వు. విచక్షణ కోల్పోయి నన్ను నిందిస్తున్నావు. ఆలోచన కోల్పోయి నన్ను అలా నిందించటం, తప్పుపట్టటం నీకు తగునా? ఇందులో నా దోషం ఏముంది? పూర్తిగా అది దోషమే. స్వయంకృతం అత్తా’’అన్నాడు కృష్ణపరమాత్మ. ‘‘నా దోషమా? స్వయంకృతమా? ఏమిటి నువ్వనేది? అని గద్దించింది గాంధారి. ‘‘అవునత్తా ముమ్మాటికీ దోషం పూర్తిగా నీదే. ప్రపంచంలో ఎక్కడైనా శిశువు పుట్టగానే శిశువుని తల్లి అపురూపంగా కళ్ళారా చూసుకుంటుంది. నీ స్వార్థంతో పాతివ్రత్యం పేరున, నీ మగనికి కళ్ళులేవని నువ్వు కళ్ళకు గంతలు కట్టుకున్నావు. కృత్రిమంగా కావాలనే గుడ్డిదానివైపోయేవు. ఎప్పుడైనా, ఏనాడైనా నువ్వు నీ పుత్రుల్ని చూసినావా? లేదే. తల్లి చూపుకి నోచుకోని బిడ్డలు, దైవం చూపుకు నోచుకోరు. నేనెలా వారిని చూడగలను’’ గాంధారి అప్రియమైనదే అయినా కుండబద్ధలు కొట్టినట్టు శ్రీకృష్ణుడు ధర్మసూక్ష్మాన్ని విడమర్చి చెప్పేడు.
వౌనంగా గాంధారీ ధృతరాష్ట్రులిద్దరూ కృష్ణుడు కొనసాగిస్తున్నాడు. ‘‘ఇక పాండవుల మాటంటావా? కుంతీదేవి తన పుత్రుల బాగోగుల్ని కళ్ళారా తనే చూసుకుంది. పాండవులు అంతఃపురంలో ఉన్నా, అడవుల్లో వారి యోగక్షేమంకోసమే పరితపించింది. పిల్లల బాగుకోసం పాటుపడింది. ప్రార్థన చేసింది. ఆ తల్లి ప్రేమే పాండవులకి శ్రీరామరక్ష అయ్యింది. పాండవుల్ని కాపాడింది.’’ కారణాన్ని విడమరచి వివరించేడు శ్రీక్రిష్ణుడు.
అవును. ఇతిహాసాలు, పురాణాలు, చరిత్రలు అన్నీ.. తల్లి ఒడియే పిల్లలకు ప్రథమ ఒడి. ప్రథమ గుడి అని ఘోషించేయి. బోధించేవి. బోధన చేస్తున్నాయి. ప్రబోధాన్నిస్తున్నాయి.
*