రాష్ట్రీయం

ప్రభుత్వ పాఠశాలలో బాలిక ప్రసవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమోటోగా స్వీకరించిన బాలల హక్కుల కమిషన్
డిసెంబర్ 15లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్, నవంబర్ 30: ప్రభుత్వ పాఠశాలలో బాలిక ప్రసవించిన సంఘటనను బాలల హ క్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతు న్న బాలిక గర్భవతి కావడం, పాఠశాల ప్రాంగణలో ఉన్న మూత్రశాలలో ఓ పాపకు జన్మనివ్వడంపై బాలల హక్కుల కమిషన్ విస్మయం వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై సమగ్ర వివరాలతో నివేదిక అందజేయాలని కమిషన్ రంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారికి, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ అధికారికీ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 15 నాటికల్లా నివేదిక అందజేయాలని కమిషన్ ఆ నోటీసులో పేర్కొంది. ఈ ఘటన పూర్వాపరాలు, తగిన చర్యలు, మైనర్‌బాలిక ఆరోగ్య పరిస్థితి, శిశువు ఆరోగ్యంపై తీసుకున్న చర్యలు గురించి నివేదికలో పొందుపర్చాలని కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు అచ్యుతరావు ఒక ప్రకటనలో తెలిపారు.
డిఇవో విచారణ ప్రారంభం
గచ్చిబౌలి: పాఠశాలలో విద్యార్థిని ప్రసవించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటనపై జిల్లా విద్యాధికారి రమేశ్ విచారణ ప్రారంభించారు. విద్యార్థిని విషయంలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు, ఇన్‌చార్జి మండల విద్యాధికారిగా ఉండటంతో ఇక్కడ ఓ ఉపాధ్యాయురాలు ఇన్‌చార్జి హెచ్‌ఎంగా కొనసాగుతున్నా ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం విస్మయానికి గురిచేసిందని మండిపడ్డారు. నిండు గర్భిణిగా ఉన్న విద్యార్థినిని ఉపాధ్యాయురాళ్లు గుర్తించుకోలేదన్న సంగతి కొట్టచ్చినట్లు కనిస్తోందని డిఇవో తెలిపారు. విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామని తెలిపారు. కాగా పాఠశాలను గిరిజన సంక్షేమశాఖ అధికారులు కూడా సందర్శించి విచారణ చేశారు. బంజారా సేవా సంఘం ప్రతినిధులు సందర్శించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికారుల ఒత్తిడితో బాలిక తండ్రి ఉప్పల్‌లో ఉన్న కూతురును తీసుకొచ్చి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలింత నుంచి మహిళా ఇన్‌స్పెక్టర్ సునీత వివరాలు సేకరించి మాదాపూర్ పోలీసులకు ఇచ్చారు. మాదాపూర్ సిఐ నర్సింహులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.