రాష్ట్రీయం

రాష్టప్రతి రాక నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

31 వరకూ హైదరాబాద్‌లోనే
హైదరాబాద్, డిసెంబర్ 17: రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ రెండు వారాల దక్షిణాది పర్యటన కోసం శుక్రవారం నగరానికి చేరుకోనున్నారు. సికిందరాబాద్ బొల్లారంలోని రాష్టప్రతి నిలయంలో 18 నుంచి 31వరకు బస చేస్తారు. సికిందరాబాద్‌లోని మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో 19న జరిగే స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 22,23 తేదీల్లో కర్నాటకలో పర్యటిస్తారు. 22న కర్నాటక సెంట్రల్ యూనివర్సిటీ రెండవ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అదే రోజు గుల్బర్గాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. న్యూరో సైనె్సస్ బెంగళూరును జాతికి అంకితం చేస్తారు. 23న జరిగే బిషప్ కాటన్ బాయ్స్ స్కూల్ 150 వ వార్షికోత్సవంలో పాల్గొంటారు. బెంగళూరులో కిద్వాయ్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ అంకాలజీ బెంగళూరును ప్రారంభిస్తారు. 25న ప్రోఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తారు. 27న అయుత చండీమహాయాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. 30 న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నర్ నరసింహాన్ రాప్ట్రపతి గౌరవార్థం విందు ఇస్తారు. రాష్టప్రతి భవన్‌లో జరిగే ఈ విందులో మంత్రులు, అధికారులు, జర్నలిస్టులను ఆహ్వానిస్తున్నారు. చండీయాగంలో పాల్గొనేందుకు రావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్టప్రతిని ఆహ్వానించిన విషయం తెలిసిందే.