తెలంగాణ

ప్రియాంక హత్య కేసులో పురోగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డి మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా నలుగురు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. ప్రియాంకరెడ్డి స్కూటీకి ఉద్దేశ్యపూర్వకంగానే పంక్చర్ చేసి ఆమె స్కూటీని బాగు చేయిస్తామని డ్రామాలు ఆడారని పోలీసులు భావిస్తున్నారు. లారీ డ్రైవర్, క్లీనర్, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు తెలిసింది. ఈ నలుగురు ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు, ఆ తరువాత ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు నిర్థారణకు వచ్చారు. మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి చటాన్‌పల్లి వంతెన కిందకు తీసుకువెళ్లి అనంతరం కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు నిర్థారణకు వచ్చారు. నిందితులు మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలవారీగా గుర్తించారు. నిందితుల్లో ఇద్దరిని నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన మహ్మద్ పాషా, మహబూబ్‌గా గుర్తించారు. టోల్‌ప్లాజా వెనుకాల వున్న ఖాళీ ప్రదేశంలో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. తెల్లవారుజామున 3-4 గంటల మధ్య హత్య చేసి ఉంటారని శవ పరీక్షలో తేలింది. ప్రియాంకరెడ్డి తలపైన వైద్యులు గాయాన్ని గుర్తించారు.