తెలంగాణ

గడ్డు వేసవి.. గట్టెక్కేదెలా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీరు లేక కళతప్పిన సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు

మిర్యాలగూడ, మార్చి 10: కృష్ణానది ఎగువన ఈ సంవత్సరం వర్షాలు కురవక కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నీరులేక వెలవెలబోయాయి. తాగునీటి అవసరాలు తీర్చే నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులలో నీరులేక కళతప్పి చెరువులా దర్శనమిస్తున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 590 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికిగాను 510 అడుగుల మేర నీటిని నిల్వ ఉంచాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ ఆదేశాలను తుంగలో తొక్కి తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాల కోసం సాగర్ నుండి కృష్ణాడెల్టాకు నీటిని తరలించుకుపోయారు. దాంతో నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం నీటిమట్టం 509.20 అడుగులు ఉంది. నాగార్జునసాగర్ ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో సైతం డెడ్‌స్టోరేజీలో నీటిమట్టం ఉంది. అయితే నల్లగొండ జిల్లాతోపాటు హైదరాబాద్ రాజధానికి వేసవిలో తాగునీటి కష్టాలు తప్పేట్లు లేదు. ఇటీవల శ్రీశైలం ప్రాజెక్టు నుండి 14 టిఎంసిల నీటిని వాడుకునేందుకు కృష్ణా రివర్‌బోర్డు ఇటీవల సూచించింది. దాంతో తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలు ఆ నీటిని వాడుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 130.34 టిఎంసిల నీరు నిల్వ ఉంది. దీంతోపాటు శ్రీశైలం జలాశయంలో 36 టిఎంసిల నీరు మాత్రమే ఉండడంతో ఎండాకాలంలో ఇరు రాష్ట్రాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే సాగర్ జలాశయ నీటిమట్టం కనీస నీటిమట్టం కంటే తగ్గి ఉన్న పరిస్థితిలో కూడా సాగర్ జలాశయం నుండి తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని వినియోగిస్తున్నారు. సాగర్ ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయ పరిస్థితి కూడా ఘోరంగా తయారైంది. 885 అడుగులకుగాను 814 అడుగులు మాత్రమే ఉన్న తరుణంలో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు తాగునీటి కష్టాలు తీర్చడానికి శ్రీశైలం నుండి సాగర్ జలాశయానికి విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటి విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితిలో కూడా ఇటీవల కాలంలో కృష్ణా రివర్‌బోర్డు 4.5 టిఎంసిల నీటిని తాగునీటి అవసరాల నిమిత్తం ఆంధ్రాకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించిన కారణంగా ఇప్పటికే కుడికాల్వకు 2.5 టిఎంసిల నీటిని విడుదల చేశారు. ఇంకా కృష్ణాడెల్టాకు 2 టిఎంసిల నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఇరు రాష్ట్రాల ఆయకట్టు ప్రాంతాలలో భూగర్భజలాలు పూర్తిగా పడిపోయి ఎక్కడా నీరు కనిపించని పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఇలాగే ఉంటే మండుతున్న ఎండలకు దాహార్తితో ప్రజలు, మూగజీవాలు సమస్యల వలయంలో పడక తప్పదు.