రాష్ట్రీయం

రోహిత్ కుటుంబానికి రూ. 8లక్షల పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: దేశవ్యాప్తంగా రోహిత్ ఆత్మహత్య సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ వర్శిటీ కార్యనిర్వాహక సంఘం శుక్రవారం సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. రోహిత్ కుటుంబానికి ఎనిమిది లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. అలాగే చర్చలకు రావలసిందిగా పరిపాలన బాధ్యతలనుంచి తప్పుకున్న అధ్యాపకులను ఆహ్వానించింది. అయితే వారు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. వైస్ ఛాన్సలర్ స్వయంగా వచ్చి విద్యార్థుల మధ్య చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ రోహిత్ తల్లికి ఫోన్ చేసి పరామర్శించారు. రోహిత్ మృతి బాధాకరమని, కుమారుడి మృతిని తట్టుకోలేక పోతున్న మీరు ఆత్మస్థయిర్యంతో ఉండాలని, రోహిత్‌కు న్యాయం జరుగుతుందని కుటుంబీకులను ఓదార్చారు. కాగా రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఆరో రోజుకు చేరింది. దీక్షలోఉన్న ఏడుగురు విద్యార్థులకు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. కుల వివక్ష పోరాట సమితి పిలుపు మేరకు విద్యార్థులు కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.
రాజ్‌భవన్ ముట్టడి యత్నం
విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై సిటింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం టివైఎల్ నాయకులు రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు. పలువురు టివైఎల్ నాయకులు రాజ్‌భవన్‌లోకి చొచ్చుకెళ్ళేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని పలువురిని అరెస్టు చేశారు.